నల్గొండ

వైభవంగా కార్తీక పౌర్ణమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, నవంబర్ 14: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాల ప్రజలు సోమవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. కార్తీక పౌర్ణమికి ఈదఫా సోమవారం రావడంతో శివాలయాలు లింగాభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలతో కిటకిటలడాయి. భక్తుల కార్తీక దీపారాధనలతో దేవాలయాలు కాంతులీనాయి. వేకువ జామునే కార్తీక పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు వాడపల్లి మీనాక్షీ ఆగస్తేశ్వర స్వామి ఆలయం కృష్ణా-మూసీల సంగమ స్థలికి, కృష్ణాతీరంలోని పంఛనారాసింహక్షేత్రాలు వాడపల్లి లక్ష్మీనరసింహాస్వామి, మఠంపల్లి లక్ష్మీనరసింహాస్వామి ఆలయానికి వేలాదిగా తరలివచ్చారు. కార్తీక మాసంలో శివకేశవులను పూజిస్తే మహాపుణ్యమన్న భావనతో నది స్నానాలు, కార్తీక దీపారాధన పిదప భక్తులు మీనాక్షి ఆగస్తేశ్వరుడిని, లక్ష్మీనరసింహులను దర్శించుకున్నారు. కృష్ణాతీరంలోని మేళ్లచెర్వు శ్రీ శుంభులింగేశ్వర ఆలయం, నేరడుచర్ల శ్రీ బుగ్గ మహేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు భారీగా కార్తీక పూజల్లో పాల్గొన్నారు. చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర ఆలయం భక్తుల రద్ధీతో కిక్కిరిసింది. అటు కార్తీక పౌర్ణమి రోజున ప్రసిద్ధ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలిరాగా కొండ పరిసరాలు భక్తుల రద్ధీతో నిండిపోయాయి. భక్తులు స్వామిసన్నిధిలో కార్తీక దీపాలు వెలిగించారు. భారీ సంఖ్యలో సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిపించారు.
నల్లగొండ పానగల్ ఛాయ సోమేశ్వర ఆలయం, పచ్ఛల సోమేశ్వర ఆలయం, శ్రీ వెంకటేశ్వర ఆలయం, రామగిరి రామాలయం, రామకోటి స్థూప దేవాలయం, రేణుకా ఎల్లమ్మ ఆలయం, సంతోషిమాతాలయం, తులసినగర్ భక్తాంజనేయ ఆలయం భక్తుల కార్తీ పూజలతో కిటకిటలాడాయి.
ఛాయ సోమేశ్వర ఆలయం కృష్ణా పుష్కరణిలో మహిళలు వేకువ జామునుండి భారీగా తరవచ్చి కార్తీక దీపాలు వదిలి శివుడికి అభిషేకాలు నిర్వహించారు. భువనగిరి పచ్చలకట్ట సోమేశ్వర ఆలయం, సుంకిశాల శ్రీ వెంకటేశ్వర ఆలయం, మత్స్యగిరి లక్ష్మీనరసింహ ఆలయం, పిల్లలమర్రి శివాలయం, ఉండ్రుగొండ లక్ష్మినరసింహ ఆలయం, సాగర్ శివాలయం, మూసీ తీరం సంగెం భీమలింగం, అవంతిపురం శ్రీ వెంకటేశ్వర ఆలయాలు భక్తుల కార్తీక పౌర్ణమి పూజలతో కార్తీక దీపరాధనలతో దేదీప్యమానంగా శోభిల్లాయి.