నల్గొండ

పజ్జూరుకు పర్యాటక కళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఏప్రిల్ 7: జిల్లాలోని తిప్పర్తి మండలం పజ్జూరులో పురావస్తుశాఖ చేపట్టిన త్రవ్వకాల్లో తొలి చారిత్రాక యుగం క్రీ.పూ.2శతాబ్ధం నుండి క్రీ.శ.2శతాబ్ధం చారిత్రాక ఆనవాళ్లు, వస్తువులు బయల్పడుతుండటంతో ఒక్కసారిగా పజ్జూరు గ్రామం అందరి దృష్టిని ఆకర్షించింది. పజ్జూరు త్రవ్వకాలలో చారిత్రాక సంపద ఒక్కొక్కటిగా వెలుగుచూస్తుండగా ఈ ప్రాంతాన్ని సందర్శించి త్రవ్వకాల్లో బయల్పడిన వాటిని చూసేందుకు క్రమంగా విద్యార్థులు, సందర్శకులు వస్తుండటంతో పజ్జూరు క్రమంగా పర్యాటక ప్రాంతాన్ని తలపిస్తుంది. గ్రామంలో పాటిగడ్డ ప్రాంతంలో జరుగుతున్న త్రవ్వకాల్లో బౌద్ద చైత్యం కట్టడంతో పాటు శాతవాహనుల కాలం నాటి రాగి, సీసం నాణాలు, మట్టి బొమ్మలు, పాత్రలు, కొలత పాత్రలు, ఆ కాలపు పనిముట్లు, పూజలు, గాజు వస్తువులు లభ్యం కావడం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న త్రవ్వకాలను మరింతగా విస్తరించిన పక్షంలో మరిన్ని చారిత్రాక ఆధారాలు వెలుగు చూడవచ్చని భావిస్తున్నారు. అదిగాక ఇదే గ్రామంలో రాతియుగం, బృహత్ శిలాయుగం ఆదిమానవుడి నాటి మెన్‌హిర్ నిలువరాతి స్మారక శిలల సమాధులు గ్రామంలో పలుచోట్ల ఉన్నాయి. తొలి చారిత్రక యుగం క్రీ.శ.1శతాబ్ధాం నుండి 11,15శతాబ్ధాల వరకు వివిధ రాజవంశీయులు నిర్మించిన పురాతన ఆలయాలు గ్రామంలో ఉన్నాయి. ఈ నేపధ్యంలో గతంలో పజ్జూరు ప్రముఖ బౌద్ధ నివాసంగా, చారిత్రక గ్రామంగా విలసిల్లినట్లుగా భావిస్తున్నారు.
గురువారం పజ్జూరును రాష్ట్ర పురావస్తు, మ్యూజియమ్స్ డైరక్టర్ డాక్టర్ జి.వి.రామకృష్ణారావు సందర్శించి త్రవ్వకాల్లో బయల్పపడిన చారిత్రక అవశేషాలను పరిశీలించారు. పజ్జూరు పాటిగడ్డలో వెలుగుచూసిన కట్టడం బౌద్ధుల చైత్యంగా, చారిత్రక అవశేషాలు శాతవాహన కాలం నాటివిగా అంచనావేశారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన విద్యార్థులకు త్రవ్వకాల్లో బయల్పపడిన చారిత్రక వస్తువుల విశేషాలను, అవి ఏ కాలం నాటివన్న వివరాలతో పాటు నాటి రాజవంశీయుల వివరాలు, ప్రజల జీవన పద్ధతులు, వారి ఆహార సేకరణ, అలవాట్లు, నాగరికత, మత విధానాలు వంటి అంశాలను ఆయన విద్యార్థులకు ఆసక్తిగా వివరించారు. పజ్జూరు కూడా కోటిలింగాలు, దూళికట్ట పెద్దబంకూరు, ఫణిగిరి, నాగార్జున సాగర్, గాజులబండ, వర్ధమానుకోట, నాగారం, ఏలేశ్వరం వంటి ప్రాంతాల మాదిరిగా ప్రాచీన నాగరికత, బౌద్ధ చైత్యాలకు నెలవుగా కొనసాగినట్లుగా చారిత్రాక ఆధారాలతో తెలుస్తుందన్నారు. బృహత్ శిలాయుగం, శాతవాహనుల కాలం నుండి బహమన్తీ సుల్తాన్‌లు, నిజాంల కాలం నిర్మాణాలు, అవశేషాలు పజ్జూరులో కనిపిస్తున్నాయన్నారు. ప్రభుత్వం పజ్జూరులో త్రవ్వకాలను మరింతగా విస్తరించిన పక్షంలో మరిన్ని విలువైన చారిత్రాక అవశేషాలు వెలుగూ చూసే అవకాశముందని ఆయన వివరించారు. ఆయన వెంట పరావస్తు శాఖ రిటైర్డ్ అధికారులు బ్రహ్మచారి, భానుమూర్తి, ఏడి నాగరాజు, ఎంపిపి పాశం రాంరెడ్డి, సర్పంచ్ సింగం సత్తయ్యిలు ఉన్నారు.