నల్గొండ

త్వరలో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో.. 100 పెట్రోల్ బంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, నవంబర్ 21: తెలంగాణలోని జైళ్లల్లో మెరుగైన సదుపాయాలు కల్పించడంతో పాటు ఖైదీలతో వివిధ పరిశ్రమలను నిర్వహిస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నామని రాష్ట్ర జైళ్లశాఖ డిజి వికె.సింగ్ తెలిపారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ఎస్పి కార్యాలయాన్ని, సబ్‌జైల్‌ను సందర్శించారు. అదేవిధంగా స్థానిక డిఎస్పి కార్యాలయంలో స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ క్షణికావేశంలో నేరాలకు పాల్పడి జైళ్లకు వచ్చే ఖైదీలల్లో పరివర్తన తీసుకొచ్చే దిశగా అనేక కార్యక్రమాలను అమలుచేస్తున్నామన్నారు. జైళ్లల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఉపాధి కల్పించడంతో పాటు తద్వారా వారి జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు గాను ఫర్నిచర్ తయారు, పెట్రోల్ బంకుల ఏర్పాటు, పలు రకాల పరిశ్రమలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. త్వరలో రాష్టవ్య్రాప్తంగా జైళ్లశాఖ ఆధ్వర్యంలో 100పెట్రోల్ బంకులను ఏర్పాటుచేసి ఖైదీలతో వాటిని నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. జైళ్లశాఖ ఆధ్వర్యంలో ఖైదీలతో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల ద్వారా వస్తున్న ఆదాయాన్ని జైళ్ల నిర్వాహణ కోసం వినియోగిస్తున్నామని రాబోయే మూడేళ్లల్లో జైళ్ల నిర్వహణ పోను ప్రభుత్వానికే ఆదాయాన్ని అందించే విధంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని జైళ్లల్లో అన్ని రకాల వౌళిక సదుపాయాలను కల్పించడం జరిగిందన్నారు. తెలంగాణ జైళ్లల్లో ఉన్న సదుపాయాలు ఏ ఇతర రాష్ట్రంలోను లేవన్నారు. నేరాలు చేసి జైలు జీవితం గడుపుతున్న ఖైదీలలో పరివర్తన తీసుకొచ్చి మరోసారి నేరాలు చేయకుండా వారిలో మార్పులు తీసుకొస్తున్నట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న స్వచ్చ్భారత్, హరితహారం కార్యక్రమాల్లో ఖైదీలను భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. ఖైదీల ఆలోచన విధానాల్లో మార్పులు తీసుకొచ్చి తద్వారా నేరరహిత తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు.
కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో నూతనంగా జిల్లా కారాగారాలను నిర్మించేందుకు ప్రతిపాధనలు సిద్దంచేస్తున్నట్లు చెప్పారు. స్వచ్చంధ సంస్థలు తమ సేవా కార్యక్రమాలను విస్తృతం చేసి ప్రజలకు ఉపయోగపడేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, వైద్యశాలలు, కార్యాలయాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ఆయన వెంట జిల్లా ఎస్పి పరిమళ హనా నూతన్, డిఎస్పి సునీతామోహన్, పట్టణ ఇన్ప్‌స్పెక్టర్ వై. మొగిలయ్య, జైలు సూపరిండెంట్ నెహ్రు తదితరులు పాల్గొన్నారు.
నేడు రేవంత్ రైతు పోరు సభ
* నార్కట్‌పల్లి నుండి నల్లగొండకు పాదయాత్ర
* హాజరుకానున్న ఎల్.రమణ, రేవూరి, రావుల, నామా

నల్లగొండ, నవంబర్ 21: టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి రైతు పోరుయాత్ర సభను పోరుగడ్డ నల్లగొండలో నేడు భారీగా నిర్వహించేందుకు ఆ పార్టీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి. రైతు సమస్యలే అస్త్రంగా చేసుకున్న రేవంత్‌రెడ్డి రైతు పోరుయాత్ర సభలతో సీఎం కెసిఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న క్రమంలో నల్లగొండ రైతు పోరుయాత్ర సభ ఆసక్తికరంగా మారింది. రేవంత్‌రెడ్డి రైతు పోరుయాత్ర జిల్లాలో ఉదయం 9-30కు చిట్యాల వెలిమినేడులో దివంగత మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి విగ్రహావిష్కరణతో ప్రారంభంకానుంది. అక్కడి నుండి నార్కట్‌పల్లికి 11గంటలకు పాదయాత్ర ద్వారా చేరుకోనున్న రేవంత్ దారిలో రైతులను కలిసి వారి సమస్యలు వింటారు. పాదయాత్ర చెర్వుగట్టు, ఎల్లారెడ్డిగూడెం, దాసరిగూడెం, అనే్నపర్తి, చర్లపల్లి, ఆర్జాలబావి, మర్రిగూడల మీదుగా 5-30కు నల్లగొండ ఎన్‌జి కళాశాల మైదానం రైతు పోరుయాత్ర సభ స్థలికి చేరుకుంటుంది. యాత్ర మధ్యలో దారిలో పలుచోట్ల రైతులతో రేవంత్ మాట్లాడనున్నారు. పోరుయాత్ర సభకు టి.టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ్, పొలిట్ బ్యూరో సభ్యులు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, నామా నాగేశ్వర్‌రావు, రమేష్‌రాథోడ్, ఇ.పెద్దిరెడ్డి, మోత్కుపల్లి నరసింహులు, ఉమామాధవరెడ్డి, అధికార ప్రతినిధి పాల్వాయి రజనికుమారి, జిల్లా అధ్యక్షుడు కె.బిల్యానాయక్, నియోజకవర్గ ఇన్‌చార్జిలు కంచర్ల భూపాల్‌రెడ్డి, బంటు వెంకటేశ్వర్లు, కడారి అంజయ్య ప్రభృతులు హాజరుకానున్నారు. నల్లగొండ రైతుపోరుయాత్ర సభ విజయవంతానికి కంచర్ల భూపాల్‌రెడ్డి, బిల్యానాయక్‌ల పర్యవేక్షణలో జనసమీకరణకు, రైతులను తరలించేందుకు విస్తృత ప్రచారం సైతం నిర్వహించారు. ఇటీవల సూర్యాపేట రైతు పోరుయాత్ర సభలో కెసిఆర్ సర్కార్‌పై రేవంత్ చేసిన విమర్శలు దుమారం రేపాయి. నేడు జరిగే నల్లగొండ రైతు పోరుయాత్ర సభలోనూ మరోసారి రేవంత్ తనదైన శైలిలో రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు సంధిస్తారోనన్న ఆసక్తి నెలకొంది.

పెద్దగట్టు జాతరకు విస్తృత ఏర్పాట్లు
* సమీక్షా సమావేశంలో కలెక్టర్ సురేంద్రమోహన్
సూర్యాపేట, నవంబర్ 21: ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే దురాజ్‌పల్లి పెద్దగట్టు శ్రీ లింగమంతులస్వామి జాతరకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా విస్తృత ఏర్పాట్లు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్ తెలిపారు. జాతర ఏర్పాట్లపై సోమవారం కలెక్టర్ తన చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. వచ్చే ఫిబ్రవరి మాసంలో ఐదురోజుల పాటు జరిగే జాతరకు సుమారు 6లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిభింబించే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జాతర పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, దురాజ్‌పల్లి గుట్ట వద్ద చుట్టు ప్రక్కల ఉన్న పొలాలను జాతర ఏర్పాట్ల కోపం తాత్కాలికంగా అద్దెకు తీసుకోవానేలా చర్యలు తీసుకోవాలని చివ్వెంల తహశీల్దార్‌ను ఆదేశించారు. భక్తులకు మంచినీరు, మరుగుదొడ్ల వసతి, స్నానఘట్టాలు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులను ఏర్పాటుచేసేలా పనులు చేపట్టాలని పంచాయితీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులకు సూచించారు. జాతర తరలివచ్చే భక్తులకు వైద్య సేవలు అందించేందుకు ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటుచేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు.
క్రీడలతో ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి
* డిఈవో చంద్రమోహన్
నల్లగొండ టౌన్, నవంబర్ 21: క్రీడలతో విద్యార్ధులు ఆత్మవిశ్వాసం, తద్వారా మేదస్సును, సృజనాత్మకతను పెంచుకోవాలని డిఈఒ చంద్రమోహన్ సూచించారు. సోమవారం స్ధానిక ఎన్జీ కళాశాలలో 62వ పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అంతర్‌జిల్లాల బాల బాలికల సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్‌లో పాల్గొన్న విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం మాట్లాడుతూ క్రీడలతో విద్యార్ధులకు ఉన్నత ఉద్యోగ అవకాశాలతో పాటు ప్రపంచ దేశాల్లో భారత దేశానికి గుర్తింపు తెచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తిప్పర్తి ఎంపీపీ పాశం రాంరెడ్డి, ఎస్ జి ఎఫ్ జిల్లా కార్యదర్శి జె.పుల్లయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్ ఖయ్యుంబేగ్, జిల్లా వ్యాయామ అసోసియేషన్ అధ్యక్షులు కుంభం నర్సిరెడ్డి పాల్గొన్నారు.
గట్టుప్పల్‌లో అర్ధనగ్న ప్రదర్శన
చండూరు, నవంబర్ 21: గట్టుప్పల్ గ్రామాన్ని మండల కేంద్రంగా చేయాలని కోరుతూ మండల సాదన కమిటీ ఆధ్వర్యంలో సోమవారం అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా కమిటీ సభ్యులు కైలాస్ మాట్లాడుతూ 1984 నుండి గట్టుప్పల్ మండల డిమాండ్ ఉన్నప్పటికీ ఇప్పటివరకు అది నెరవేరలేదని, గత 41 రోజులుగా గ్రామస్తులు నిరసన కార్యక్రమాలు చేస్తున్నా ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మండలాన్ని ఏర్పాటు చేయాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సాధన కమిటీ సభ్యులు భీమగాని మల్లేష్, కృష్ణ, సత్తయ్య, కిషోర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్ధులు లక్ష్యంతో ముందుకుపోవాలి
మోత్కూరు, నవంబర్ 21: నేటి తరం విద్యార్ధులు విద్యార్ధి దశ నుండే ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు పోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ సిహెచ్.మహేంద్రనాద్ అన్నారు. సోమవారం గ్రంధాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొని బహుమతులను అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వట్టికొట అళ్వారుస్వామి గ్రంధాలయోధ్యమంలో విశేష పాత్ర పోషించారన్నారు. నేటి తరం గ్రంధాలయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సినీ గేయరచయిత అభినయ శ్రీనివాస్ తన పాటల ద్వారా గ్రంధాలయ ప్రాముఖ్యాన్ని వివరించారు. గ్రంధాలయ చైర్మన్ కోమటి మత్స్యగిరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి చింతల వరలక్ష్మీ, ఎంపిడి ఒ కె.వెంకటనర్సయ్య, ఎంపిటిసి ప్రమీల, రెడ్‌క్రాస్ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ లక్ష్మీనర్సింహ్మారెడ్డి, పాఠశాల హెచ్ ఎం వెంకట్‌రెడ్డి, ప్రజా భారతి అధ్యక్ష కార్యదర్శులు అరవిందరాయుడు, మనోహరచారి, జనవిజ్ఞాన వేదిక డివిజన్ అధ్యక్షులు భాస్కరాచారి, ఎస్ ఎంసి చైర్మన్ వెంకటనర్సయ్య, గ్రంధాలయ వైస్ చైర్మన్ స్వామిరాయుడు, యాకేష్, రాజు, మధుసూధన్‌రెడ్డి, జయశ్రీ, హనుమంతు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పుస్తక పఠనంతో సత్ఫలితాలు
నార్కట్‌పల్లి, నవంబర్ 21: ప్రతి విద్యార్ధి, ప్రతి వ్యక్తినిత్యం పుస్తక పఠనాన్ని అలవర్చుకుంటే సమాజంలో జరుగుతున్న విషయాలపై అవగాహన పెరగడంతో పాటు మేధాశక్తి పెంపొందించుకోవచ్చు ఎంపీపీ రేగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి, జెడ్పిటిసి దూదిమెట్ల సత్తయ్యయాదవ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో గ్రంధాలయ ముగింపు వారోత్సవాల్లో పాల్గొని ప్రసంగించారు. నాడు, నేడు, ఎప్పటికీ గ్రంధాలయాలు ప్రజలకు అందుబాటులో ఉంటే విజ్ఞానం పెంపొందించుకోవడానికి దోహదపడుతుందన్నారు. గ్రంధాలయాల అభివృద్ది పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఎంపీపీ రేగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి మాట్లాడుతూ స్ధానిక శాసనసభ్యులు వేముల వీరేశం సహకారంతో గ్రంధాలయానికి అదనపు గదిని నిర్మించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిడి ఒ సురేష్, గ్రంధ పాలకురాలు రాజ్యలక్ష్మీ, గ్రంధాలయ నిర్వాహకులు ప్రజ్ఞాపురం కృష్ణ, తిరుమల్, కార్యదర్శి బ్రహ్మచారి, బహుమతుల ప్రధానానికి సహాకరించిన దాతలు లింగంగౌడ్, ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌బిఐ ముందు పిఆర్‌పిఎస్ నిరసన
నల్లగొండ టౌన్, నవంబర్ 21: రద్దుచేసి పాత 500,1000 నోట్లను డిసెంబర్ 30 వరకు మార్కెట్లలో చెలామణికి అవకాశం కల్పించాలని పి ఆర్ పి ఎస్ ఆధ్వర్యంలో సోమవారం స్దానిక గడియారం సెంటర్ వద్ద గల ఎస్‌బి ఐ ముందు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆసంఘం రాష్ట్ర అధ్యక్షులు నూనె వెంకటస్వామి మాట్లాడుతూ అకస్మాత్తుగా నరేంద్రమోడీ పెద్ద నోట్లను రద్దు చేయడం అప్రజాస్వామికమని, దేశంలో పదిశాతం ఉన్న పందికొక్కుల నల్లధనం వెలికితీత కోసం 90శాతం ఉన్న సామాన్య ప్రజలను రోడ్డుకీడుస్తున్నాడని ఆరోపించారు. స్విస్‌బ్యాంకులో ఉన్న నల్లకుబేరుల ధనాన్ని వెలికితెస్తానన్న మోడీ సామాన్య ప్రజలకు ప్రత్యామ్నాయ చిల్లర నోట్లు ఏర్పాటు చేయకుండా రోజువారి కూలీలను సైతం గంటల తరబడి బ్యాంకులు, ఏటి ఎంల ముందు నిలబెట్టుకొని వారి కుటుంబాలను రోడ్డుమీదకు ఈడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ తల్లిని బ్యాంకు ముందు లైన్‌లో నిలబడిందని ప్రచారం చేసేవారు అంబానీ, ఆదానీల గురించి చెప్పడంలేదని, నోట్ల రద్దు వెనుక భారీ కుంభకోణం ఉన్నట్లుగా ప్రజలు అయోమయానికి గురవుతున్నారన్నారు. కింగ్‌ఫిషర్ యజమాని విజయ్‌మాల్యాకు 12వందల కోట్ల రుణం మాఫీ చేసిన ప్రభుత్వం రైతుల రుణమాఫీకి ఎందుకు చేతుల రావడం లేదని ప్రశ్నించారు. ఈ ధర్నాలో ఆ సంఘం నాయకులు శ్యాంసుందర్‌రెడ్డి, సత్యనారాయణచారి, ప్రభుయాదవ్, వరం నరసింహ, యాదయ్య పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధే ధ్యేయం
* ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్
పెద్ద అడిశర్లపల్లి, నవంబర్ 21: గ్రామాల అభివృధ్దే తమ ముఖ్యలక్ష్యమని దేవరకొండ శాసనసభ్యుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం మండలంలోని గుడిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన హైమాస్ట్‌లైట్లను ఆయన ప్రారంభించారు. శ్రీ రామాలయం వద్ద ఎంపీ సుఖేందర్‌రెడ్డి నిధులచే 56వేల రూపాయలతో ఏర్పాటు చేసిన హైమాస్ట్‌లైట్, అదేవిధంగా బిసి కాలనీలో దేవరకొండ శాసనసభ్యుడి నిధులు 64వేల రూపాయలతో ఏర్పాటు చేసి హైమాస్ట్‌లైట్లను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని మండలాలను అభివృద్ది పర్చడమే తమ ముఖ్యధ్యేయమని అందుకు తన వంతుగా కృషి చేస్తానన్నారు. ప్రజా సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య ధ్యేయమని, దానికి అనుగుణంగా ప్రభుత్వం అనేక నూతన పథకాలను ఏర్పాటు చేస్తుందన్నారు. ముందుగా మండలంలోని చిలకమర్రి గేటు వద్ద పబ్బతి అంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టతో పాటు ధ్వజస్ధంబ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా మొదటిరోజు నిర్వహిస్తున్న సంకల్ప పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి స్పందనరెడ్డి, మాజీ జెడ్పిటిసి తేరా గోవర్ధన్‌రెడ్డి, దేవరకొండ జెడ్పిటిసి అల్లంపల్లి నర్సింహ్మ, పి ఏ.పల్లి వైస్ ఎంపీపీ గాసీరాం, గుడిపల్లి సర్పంచ్ శేఖర్‌రెడ్డి, ఎంపిటిసి చంద్రారెడ్డి, నాయకులు పాల్వాయి రంగారెడ్డి, వల్లపురెడ్డి, మహేందర్, నార కృష్ణమూర్తి, శ్రీను, మూనా తదితరులు పాల్గొన్నారు.

క్రీడాకారులను అభినందించిన కలెక్టర్
నల్లగొండ టౌన్, నవంబర్ 21: ఇటీవల రంగారెడ్డి జిల్లాలో జాతీయ స్ధాయిలో జరిగిన అండర్-19 వాలీబాల్ పోటీలలో ప్రధమస్దానం దక్కించుకున్న నల్లగొండ జిల్లా బాలికల జట్టును సోమవారం జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తన ఛాంబర్‌లో అభినందించారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ భవిష్యత్‌లో ప్రపంచస్ధాయిలో రాణించి దేశానికి వనె్న తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సాయినర్సింహ్మారెడ్డితో పాటు జాతీయ స్ధాయికి ఎంపికైన న్యూవిజన్ కళాశాలకు చెందిన మానస, శిల్ప, బాలికల కళాశాల, నల్లగొండకు చెందిన ఆర్.వనితలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ ఒ హన్మంతరావు, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మందడి నర్సిరెడ్డి, దయాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మాదిగలను మోసం చేస్తున్న బిజెపి
నల్లగొండ టౌన్, నవంబర్ 21: అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదింపచేస్తామన్న బిజెపి రెండున్నర సంవత్సరాలు గడిచినా కాలయాపన చేస్తూ మాదిగలను చిన్నచూపు చూస్తూ మోసం చేస్తుందని గమనించాలని ఎం ఎస్ ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెరుకుపల్లి శాంతికుమార్ ప్రభుత్వాన్ని విమర్శించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ బిజెపి పార్టీ మాదిగలకు సముచ్ఛిత న్యాయం చేయడంలేదని, కేవలం ప్రచారానికే దళితమోర్చాలాంటి పదవులను కట్టబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశంలో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని కోరారు.
గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు
నల్లగొండ టౌన్, నవంబర్ 21: పుస్తక పఠనంతో ప్రతి వ్యక్తి విజ్ఞానం పెంపొందించుకోవచ్చని జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. సోమవారం గ్రంధాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గ్రంధాలయాలు వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికి విజ్ఞాన బాండాగారాలుగా ఉపకరిస్తాయని సూచించారు. గ్రంధాలయ వారోత్సవాల సందర్భంగా గత వారం రోజులుగా జరిగిన పోటీలలో పాల్గొని విజేతలుగా నిలిచిన విద్యార్ధులకు బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం గ్రంధాలయ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంధాలయ చైర్మన్లు అల్లం ప్రభాకర్‌రెడ్డి, గాదె వినోద్‌రెడ్డి, గ్రంధాలయ కార్యదర్శి శుక్లాదేవి, కట్ట నాగయ్య, తదితరులు పాల్గొన్నారు.
టిఆర్‌ఎస్‌పై భ్రమలు తొలిగాయి..
2019లో అధికారం మనదే
* బిజెపి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ లక్ష్మణ్, మనోహర్‌రెడ్డి
చౌటుప్పల్, నవంబర్ 21: టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై భ్రమలు తొలిగిపోయాయని, రానున్న ఎన్నికల్లో బిజెపికి అధికారం రావడం ఖాయమని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ గంగిడి మనోహర్‌రెడ్డిలు ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో సోమవారం మండల పరిధిలోని చిన్నకొండూరు గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా వారు మాడ్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో బిజెపి పటిష్టమవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంపై ప్రజలు కోటి ఆశలు పెట్టుకొని టిఆర్‌ఎస్‌కు అధికారం అప్పగిస్తే ముఖ్యమంత్రి కేసిఆర్ మాటాల గారడీతో మయా చేస్తున్నాడు కానీ అభివృద్ధిపై దృష్టి పెట్టడంలేదన్నారు. కేసిఆర్‌పై పెట్టుకున్న బ్రమలు తొలగిపోయాయన్నారు. ప్రపంచదేశాల ఖ్యాతిని గడిస్తూ దేశ ప్రజలకు సమర్ధవంతమైన పాలన అందిస్తున్న మోదీ పట్ల అన్నివర్గాల ప్రజలు ఆకర్షితులవుతున్నారన్నారు. మోదీ పాలనపై నమ్మకం పెంచుకున్న ప్రజలు బిజెపి వైపుకు మొగ్గు చూపుతున్నారన్నారు. కేంద్రంలో ఎన్డీయే సారథ్యంలో నీతివంతమైన, సమర్ధవంతమైన పాలన అందుతుందన్నారు. దేశ సమైక్యత, సమగ్రతల కోసం మోదీ అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. అవినీతిని అంతం చేసేందుకు కంకణకట్టుకోని పని చేస్తున్నాడన్నారు. నరేంద్రమోదీకి ప్రజలు సంపూర్ణ సహకారం అందిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలను ఇంటింటికి ప్రచారం చేసి బిజెపిని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి దూడల బిక్షంగౌడ్, బక్క రాములు, దేవరకొండ నరసింహాచారి, బండ్ల దశరథ, బండ్ల చంద్రయ్య, బక్క జగన్, గంజి కొండయ్య, గంజి నరసింహా, బిక్షం, యాదగిరి, దేవరకొండ కనకాచారి, దేప అంజిరెడ్డి, చెక్క స్వామి, ఎర్రోజు ముత్యంప్రకాష్, బక్క యాదయ్య, సుర్వి బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.