నల్గొండ

10 నుండి.. భోపాల్‌లో ఐద్వా జాతీయ మహాసభలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, నవంబర్ 22: ఎన్నికలకు ముందు మహిళలను లక్షాధికారులను చేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వాలు బిచ్ఛగాళ్లను చేశారని ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి ఆరోపించారు. భోపాల్‌లో డిసెంబర్ 10నుండి 14వరకు జరిగే ఐద్వా 11వ జాతీయ మహాసభల కరపత్రాలను మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో, దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను, హత్యలను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. సాంకేతికరంగాల్లో దేశం అభివృద్ధిచెందినప్పటికి దేశంలో మహిళలపై హింస, అగాయిత్యాలు పెరిగాయని ఆమె అన్నారు. ప్రతి మూడు నిమిషాలకు ఒక మహిళపై దౌర్జన్యం, 9నిమిషాలకు గృహహింస, ప్రతి 29నిమిషాలకు అత్యాచారాలు జరుగుతున్నాయని ఆమె అన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను, హత్యలను అరికట్టేందుకు పెద్దఎత్తున పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకుంటున్నారని ఆమె విమర్శించారు. 1936వ సంవత్సరంలో ఐద్వా మహిళ సంఘం ఏర్పడి అప్పటి నుండి మహిళల హక్కుల సాధనకై గళమెత్తుతుందని ఆమె అన్నారు. దేశంలో 1.35లక్షల సభ్యత్వాలు కలిగిన ఏకైక మహిళ సంఘం ఐద్వా అని ఆమె పేర్కొన్నారు. డిసెంబర్ 10నుండి 14వరకు మధ్య ప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగే ఐద్వా 11వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు గాదె పద్మ, నాయకురాలు పుల్లమ్మ, రాధాబాయి, బీబమ్మ, నక్క లక్ష్మమ్మ, కనకమ్మ, భాగ్యం తదితరులు పాల్గొన్నారు.