నల్గొండ

మిషన్ భగీరథ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్ద అడిశర్లపల్లి, నవంబర్ 22: తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికి కృష్ణా జలాలు అందించేందుకు చేపడుతున్న మిషన్ భగీరథ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. మంగళవారం మండలంలోని జంట నగరాల ప్రజలకు సాగునీరు అందించే కోదండాపురం ప్లాంటులో జరుగుతున్న మిషన్ భగీరథ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా ప్రజల త్రాగునీటి కోసం టేయిల్‌పాండ్, ఉదయసముద్రం, అక్కంపల్లి బ్యాలెన్స్ రిజర్వాయర్ల నుండి కృష్ణా జలాలను తీసుకొని అందించడం జరుగుతుందన్నారు. మిషన్ భగీరథకు సంబంధించిన పైప్‌లైన్, శుద్దిప్లాంట్ తదితర పనుల పురోగతిపై వారం వారం సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రస్తుత పనులు పురోగతిలో ఉన్నాయని, అయినప్పటికీ గడువుకు ముందే పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, మెగా కంపెనీ ప్రతినిధులకు ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులను ఆదేశించారు.