నల్గొండ

సామాన్యుడిని ప్రధానమంత్రిని చేసిన పార్టీ ‘కమలం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్యాల, ఏప్రిల్ 8: తమ పార్టీలో కార్యకర్తలకు నాయకులకు సముచిత స్థానముంటుందని సామాన్య కార్యకర్తగా పార్టీలో చేరిన వ్యక్తిని ప్రదానమంత్రిగా చేసిన ఘనత భాజపాదేనని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు వీరెళ్ళి చంద్రశేఖర్ అన్నారు. మండలంలోని ఎలికట్టె గ్రామంలో భాజపా మండల అధ్యక్షుడు మాస శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపార్టీలో చేరిన యువకులకు వీరెళ్ళి చంద్రశేఖర్ శుక్రవారం కాషాయ కండువాలనుకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి బాకి పాపయ్య, నియోజకవర్గ ఇన్‌చార్జి పాల్వాయి భాస్కర్‌రావు, మండల అధ్యక్షుడు మాస శ్రీనివాస్, గీతమోర్చ నియోజకవర్గ కన్వీనర్ పల్లె వెంకన్నగౌడ్‌లతో కలిసి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రశేఖర్ మాట్లాడుతూ భాజపాలో ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని సముచితస్థానాన్ని కల్పించబడుతుందని అందుకు నిదర్శనమే నేటి ప్రధానమంత్రి నరేంద్రమోదియేనన్నారు. దేశాభివృద్ధి భాజపాతోనే సాధ్యమవుతుందని కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చాక దేశంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చాయని విప్లవాత్మక మార్పులతో ప్రధాని నరేంద్రమోది అభివృద్ధిపథంలో దేశాన్ని ప్రపంచస్థాయిలో నిలుపుతున్నారన్నారు. సామాన్య ప్రజానీకానికి, రైతాంగానికి, నిరుద్యోగులకు, కార్మికులకు, పరిశ్రమల యాజమాన్యాల అభ్యున్నతే ధ్యేయంగా ప్రధాని నరేంద్రమోది ఎన్నో నూతన సంస్కరణలను అమలు చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో భారతదేశం అభివృద్ధిలో ప్రపంచస్థాయిలో ముందంజలో నిలుస్తుందన్నారు. రాజకీయాలను శాసించాలనే దురుద్దేశంతో కొన్ని లౌకిక రాజకీయ పార్టీలు వ్యతిరేకశక్తులకు కొమ్ముకాస్తున్నాయని యువత వ్యతిరేకవక్తులకు తగిన బుద్ధిని చెప్పాలన్నారు. రాజకీయాలను శాసించాలనుకునే వారు కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి తీసుకువచ్చి తాము లేనిదే రాజకీయం లేదని తామే రాజకీయాలు చేయాలనుకుంటూ వారసత్వరాజకీయాలను ప్రోత్సహించడం సమంజసంకాదన్నారు. భాజపాలో కుటుంబ రాజకీయాలుండవని కుటుంబ సభ్యులను పార్టీలోకి తీసుకుని వారసత్వరాజకీయాలను చేయమని అసలు భాజపాలో వారసత్వరాజకీయాలకు తావులేదన్నారు.
కార్యక్రమంలో చికిలంమెట్ల అశోక్, గుడిపాటి జాని, కొండ వేణు, అశోక్, మజీద్, మత్స్యగిరి, వెంకన్న, దశరథ, కృష్ణ, నాగరాజు, రమేష్, దేవానంద్, శ్రీకాంత్, సందీప్ పాల్గొన్నారు.