నల్గొండ

నియంతలా పాలిస్తున్న మోదీ, కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, డిసెంబర్ 5: కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌లు నాటి నియంత హిట్లర్‌లా పరిపాలన కొనసాగిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. సోమవారం జిల్లాకేంద్రంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి నివాసంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. నాడు నాజీ నియంత హిట్లర్ కూడ అనర్గళంగా ఉపన్యాసాలు చేసేవాడని, పరిపాలనలో మాత్రం నియంతృత్వ ధోరణి ప్రదర్శించేవాడని, నేడు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కూడ అదే వైఖరీని అవలంభిస్తున్నారన్నారు. ఇద్దరూ కూడ వాక్‌చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ ప్రచార ఆర్భాటంతో ప్రజలకు భ్రమలు కలిగిస్తూ పాలన సాగిస్తున్నారన్నారు. భ్రమలతో ఎంతోకాలం పాలన సాగించలేరని, 2019 నాటికి ప్రజలకు భ్రమలు తొలగిపోయి కాంగ్రెస్‌కు పట్టం కడుతారని ధీమా వ్యక్తంచేశారు. ప్రధానమంత్రి నోట్ల రద్దుతో నల్లధనాన్ని అరికడతానని చెబుతున్నారని, పెద్దల డబ్బు చేరాల్సిన చోటకు చేరిందని, సామాన్యులు మాత్రమే బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తూ నిత్యావసరాల ఖర్చుల కోసం అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కేవలం ప్రజలను మభ్యపెడుతూ కమీషన్‌ల కోసం పనులు చేపడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడ్డ నాటికి తెలంగాణకు రూ.లక్ష కోట్ల మిగులు బడ్జెట్ ఉందని, నేడు రెండు లక్షల కోట్ల లోటు ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ హయంలో ప్రాజెక్టులపై విస్తృతంగా సర్వే నిర్వహించి అవసరమైన చోట ప్రాజెక్టుల డిజైన్‌ను రూపొందించి నిర్మాణాలు చేశామన్నారు. ప్రస్తుత కెసిఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ హయంలో నిర్మించిన ప్రాజెక్టులకు మోటార్లు బిగించి తామే నిర్మించామని గొప్పలు చెప్పుకుంటుందన్నారు.