నల్గొండ

అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, డిసెంబర్ 6: చిన్న రాష్ట్రాల ఏర్పాటుతోనే దేశాభివృద్ది జరుగుతుందని రాజ్యాంగంలో పొందుపర్చిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ స్పూర్తితోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని రాష్ట్ర విద్యుత్, దళిత అభివృద్ది శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 60వ వర్దంతి సందర్బంగా మంగళవారం జిల్లాకేంద్రంలోని ఖమ్మం క్రాస్‌రోడ్డు వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి, రైతుబజార్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘణ నివాళ్లు అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలోనే గొప్ప సామాజిక ఉద్యమానికి నూతన పద్దతుల్లో నాంది పలికిన మహోన్నతుడు అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ ఆశించిన సమాజ ఏర్పాటుకోసం ప్రతి ఒక్కరు కృషిచేయాలని పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్య్రం కోసం అనేక మంది పోరాటాలు చేసి ప్రాణత్యాగాలు చేసినప్పటికి దేశంలో ఎలాంటి అల్లకల్లోలలు జరగకుండా సమయ స్పూర్తితో దేశ నిర్మాణం ఎలా ఉండాలో ముందే మార్గ నిర్దేణం చేసిన మహానీయడు అంబేద్కర్ అని స్మరించారు. భారత రాజ్యాంగాన్ని రచించి దేశానికి దిశా దశను అందించిన గొప్ప వ్యక్తి అని కితాబిచ్చారు. స్వాతంత్య్రం సిద్దించిన తర్వాత దేశంలో అనిచివేతకు గురై జాతులు అధికంగా ఉండడంతో మళ్లి అల్లకల్లోలాలు జరుగుతాయని ముందే ఉహించి నిమ్న జాతుల అభ్యున్నతి కోసం రాజ్యాంగాన్ని రచించారని అన్నారు. ప్రజలు బాధితులు మాత్రమే కారని, పాలకులు అవుతారని గుర్తుచేశారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందన్నారు. దేశంలో 80శాతానికి పైగా ఉన్న అనగారిన వర్గాల అభ్యున్నతి సాధించాలని రాజ్యాంగంలో పొందుపర్చితే అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి కెసిఆర్ వారి ఉన్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారన్నారు. ప్రధానంగా దళితులకు మూడెకరాల భూపంపిణి, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, దళితులు, బలహీన వర్గాల విద్యార్థుల కోసం ప్రత్యేక గురుకులాలు ఏర్పాటుచేశామన్నారు.