నల్గొండ

కొనసాగుతున్న వలసల పర్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, డిసెంబర్ 12: టిఆర్‌ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ వలలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన మరో నలుగురు కాంగ్రెస్ ఎంపిటీసిలు చిక్కారు. సిఎల్పీ నేత కె.జానారెడ్డి ముఖ్య అనుచరులు మాజీ ఆప్కాబ్ చైర్మన్ ఎడవెల్లి విజయేందర్‌రెడ్డి బృందం గులాబీ తీర్ధం పుచ్చుకుని మరుసటి రోజునే మరో ఇద్దరు జానా వర్గం ఎంపిటీసిలు టిఆర్‌ఎస్‌లో చేరడం విశేషం. సాగర్ నియోజవర్గం పెద్దవూరా మండలం పోతునూరు ఎంపిటీసి పొనుగోటి సుగుణమ్మ, మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని త్రిపురారం మండలం మాటూరు ఎంపిటీసి పగడోజు జయమ్మలతో పాటు తుంగతుర్తి నియోజకవర్గ నూతనకల్ మండలం మిర్యాల ఎంపిటీసి పట్టెటి జయప్రద, తుంగతుర్తి ఎంపిటీసి అంకూరి సత్తెమ్మలు శనివారం నల్లగొండలో మంత్రి జి.జగదీష్‌రెడ్డి సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ సిఎం కెసిఆర్ నాయకత్వంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజాసంక్షేమ, అభివృద్ధి పనులకు ఆకర్షితులై ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. వలసలపై విపక్షాల రాద్ధాంతం ఏడుపుగొట్టు దివాళకోరు రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, సాగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి నోముల నరసింహయ్య, జిల్లా టిఆర్‌ఎస్ అధ్యక్షుడు బండ నరేందర్‌రెడ్డి, మాజీ ఆప్కాబ్ చైర్మన్ ఎడవెల్లి విజయేందర్‌రెడ్డి ప్రభృతులు ఉన్నారు.
సాగర్‌లో జానా మంత్రాంగం
వలసలకు అడ్డుకట్టపై ప్రతి వ్యూహం
సిఎల్పీ నేత కె.జానారెడ్డి శనివారం రాత్రి నాగార్జున సాగర్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. సాగర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ మండలాల నుండి పెద్ద సంఖ్యలో పలువురు టిఆర్‌ఎస్‌లో చేరుతుండటాన్ని నివారించేందుకు ఆయన సాగర్‌లో తన అనుచరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన పార్టీకి చెందిన పలువురు ఎంపిటీసిలు, జడ్పీటీసిలు, కౌన్సిలర్లతో చర్చలు జరిపి వారు పార్టీ మారకుండా ఉండాలని వారికి ఎలాంటి కష్టనష్టాలు రాకుండా తాను అండగా ఉంటానన్నారు. టిఆర్‌ఎస్ ఆకర్ష్ నీటి బుడగ లాంటిదని, ఆ పార్టీ ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లొంగకుండా ఉండాలని హితవు పలికారు.