నల్గొండ

బ్యాంకు ఖాతాలు విధిగా తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, డిసెంబర్ 13: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగదు రహిత లావాదేవీలకు ప్రాధాన్యతనిస్తున్న సందర్భంగా ప్రతి కార్మికుడు విధిగా బ్యాంకు ఖాతాలను తీసుకోవాలని కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ ఎం.రాజేంద్రప్రసాద్ కోరారు. చౌటుప్పల్ మండల క్లాత్ అండ్ రెడీమేడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లీడ్ బ్యాంకు సహకారంతో సంఘ భవనంలో మంగళవారం కార్మికులకు బ్యాంకు ఖాతాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో పాల్గొన్న రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ కార్మికులు బ్యాంకు ఖాతాలను ప్రారంభించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు నేరుగా బ్యాంకు ఖాతాలకే వస్తాయన్నారు. బ్యాంకులు సైతం తక్కువ ప్రిమియంతో బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయని వివరించారు. బ్యాంకు ఖాతాలు ప్రారంభించి డెబిట్, క్రెడిట్ కార్డులను పొంది నగదు రహిత లావాదేవీలను నిర్వహించవచ్చని సూచించారు. అధ్యక్షుడు కర్నాటి శ్యాంప్రసాద్ అధ్యక్షతన జరిగిన సదస్సులో రామన్నపేట అసిస్టెంట్ కమిషనర్ ఎం.డి.అహ్మద్, తులసిరాం, జిల్లా బిక్షం, మాలుగు లక్ష్మయ్య, జిల్లా చంద్రం, కర్నాటి శంకరయ్యతో పాటు వివిధ షాపుల్లో పని చేస్తున్న కార్మికులు పాల్గొన్నారు.

పేటకు చేరుకున్న సిక్కుల జాగృతి యాత్ర
సూర్యాపేటటౌన్, డిసెంబర్ 13: సిక్కుల మతగురువు గురుగోవింద్ సింగ్ 350వ జన్మదిన వేడుకలు జనవరి 3నుండి 5వరకు మూడురోజుల పాటు నిర్వహించనున్న సందర్భంగా సెట్రల్ గురుద్వారా సాహెబ్ గౌలిగూడ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఈనెల 13నుండి 17వరకు రాష్టవ్య్రాప్తంగా నిర్వహిస్తున్న జాగృతి యాత్ర మంగళవారం సూర్యాపేటకు చేరుకుంది. ఈ యాత్రకు సూర్యాపేట సిక్కుల ఆధ్వర్యంలో సంప్రదాయ నృత్యాలతో ఘనస్వాగతం పలికారు. సూర్యాపేట సిక్కులు, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో యాత్ర వైభవంగా సాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లుచేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక యాత్రకు స్వాగతం పలకగా సిక్కు మత పెద్దలు ఆమెచే సిక్కు సాంప్రదాయ పద్ధతిలో పూజలు చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిక్కులు వారి గురుదేవస్థానం కోసం రాష్ట్ర విద్యుత్, దళిత అభివృద్ది శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని సంప్రదించగా దేవస్థానం నిర్మాణానికి స్థలం కేటాయింపుపై తాను సానుకూలంగా స్పందించారన్నారు. పట్టణంలో అన్ని మతల వారు తమ దేవుళ్లను పూజించుకుంటూ అన్ని మతాలను గౌరవించే సంప్రదాయం ఉందన్నారు. సిక్కు మత పెద్దలు మాట్లాడుతూ యాత్ర ప్రారంభం నుండి ప్రతిచోట యాత్రకు ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారన్నారు. సిక్కులు కూడా హిందూ మత సిద్ధాంతాలనే పాటిస్తారన్నారు. సూర్యాపేట నుండి జనగామ మీదుగా పలు జిల్లాలు తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటుందన్నారు. ఈ వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు అన్ని చోట్ల ప్రత్యేక ఏర్పాట్లు, బందోబస్తు కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఆకుల లవకుశ, నిమ్మల వెంకన్న, బీరవోలు శేఖర్‌రెడ్డి, కొండా నాగయ్య, ఏకాంబరం, సిక్కు ప్రతినిధులు మోహన్‌సింగ్, చైన్‌సింగ్, బాదల్‌సింగ్, చమన్‌సింగ్, లోల్యసింగ్, ప్రతాప్‌సింగ్, గురుబచ్చన్‌సింగ్, చతుర్‌సింగ్, త్రిలోచన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.