నల్గొండ

మూడు జిల్లాలకు డిఆర్‌వోల నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, డిసెంబర్ 13: ప్రభుత్వం మంగళవారం పలు జిల్లాలకు డిఆర్‌వోలను నియమించింది. నల్లగొండ డిఆర్‌వోగా ఖిమ్యానాయక్‌ను, సూర్యాపేట డిఆర్‌వోగా యాదిరెడ్డిని, యాదాద్రిభువనగిరి డిఆర్‌వోగా ఆర్.మహేందర్‌రెడ్డిని నియమించింది.
పోచంపల్లిని సందర్శించిన
విదేశీ అధికారుల బృందం
భూదాన్ పోచంపల్లి, డిసెంబర్ 13 : నిమిస్మీ ఆధ్వర్యంలో పలు దేశాలకు చెందిన 20 మంది అధికారుల బృందం మంగళవారం భూదాన్ పోచంపల్లిని సందర్శించారు. చేనేత సహకార సంఘంలో చేనేత వస్త్రాలను తిలకించారు. అనంతరం కార్మికుల గృహాలకు వెళ్లి వస్త్రాల తయారీ విధానాన్ని పరిశీలించారు. కళాకారుల నైపుణ్యాన్ని వారు ప్రశంసించారు.

మహిళల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
నాయిని నర్సింహా రెడ్డి

భువనగిరి, డిసెంబర్ 13: తెలంగాణ రాష్ట్రంలో మహిళల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అదే విధంగా మహిళల సంక్షేమం కోసం పోలీస్‌శాఖలో 32శాతం రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టిందని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి తెలిపారు. మంగళవారం భువనగిరి పట్టణ పోలీస్‌స్టేషన్ ఆవరణలో 25లక్షల రూపాయలతో నిర్మించిన మహిళా పోలీస్‌సిబ్బంది విశ్రాంతి భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళలకు రక్షణ కల్పించేందుకు షీటీమ్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా మహిళా పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని పోలీస్‌స్టేషన్లలో మహిళా పోలీస్‌సిబ్బందికి ప్రత్యేక విశ్రాంతి గదులను కేటాయిస్తున్నామని అన్నారు. వ్యభిచార వృత్తిలో మగ్గుతున్న మహిళలకు ఆసరా పథకం ద్వారా ఉపాధి అవకాశాలను కల్పిస్తు పడుపువృత్తిని మానిపించేందుకు చర్యలు చేపడుతున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎంపి బూర నర్సయ్యగౌడ్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, అడిషినల్ డిజి అంజన్‌కుమార్, పోలీస్ కమీషనర్ మహేష్‌భగవత్, జాయింట్ సిపి శశిధర్‌రెడ్డి, డిసిపి పాలకుర్తి యాదగిరి, ఏసిపి సాధు మోహన్‌రెడ్డి, భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ సుర్వి లావణ్య, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.
పొగిళ్ళ లిఫ్ట్‌స్కీంపై ఎమ్మెల్యే సమీక్ష
దేవరకొండ, డిసెంబర్ 13: చందంపేట మండలం పొగిళ్ళ వద్ద కృష్ణా నదిపై ఏర్పాటు చేయనున్న పొగిళ్ళ లిఫ్ట్ స్కీం పై మంగళవారం ఎమ్మెల్యే రవీంద్రకుమార్ దేవరకొండ పట్టణం లోని తన క్యాంప్ కార్యాలయంలో ఐడిసి, రెవిన్యూ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. దాదాపు 100 కోట్ల రూపాయల ఖర్చు అయ్యే ఈ లిఫ్ట్ స్కీం పూర్తయితే చందంపేట మండలం లోని పొగిళ్ళ, యల్మలమంద, కంబాలపల్లి, కాసరాజ్‌పల్లి, రేకులగడ్డ గ్రామాల పరిధిలో దాదాపు 6 వేల ఎకరాల భూమికి సాగునీరు, ఐదు గ్రామాలకు తాగునీరు అందుతుందని ఐడిసి ఈ ఈ ఎ భాషూనాయక్ ఎమ్మెల్యేకు వివరించారు. పొగిళ్ళ లిఫ్ట్ స్కీం పూర్తి చేస్తే శాశ్వత కరవుపీడిత ప్రాంతాలైన ఐదు గ్రామాలు సస్యశ్యామలం అవుతాయని అధికారులు ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌కు వివరించారు. శాసనసమావేశాలు ఈ నెల 16 నుండి ప్రారంభమవుతున్న నేపధ్యంలో లిఫ్ట్ స్కీంను పూర్తి చేస్తే ఎన్ని వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది, ఆయా గ్రామాలకు చెందిన రైతుల వివరాలు, సర్వే నెంబర్‌లను, గ్రామాలకు చెందిన నక్షాలను వెంటనే ఐడిసి అధికారులకు ఇవ్వాలని ఎమ్మెల్యే రెవిన్యూ అధికారులను ఆదేశించారు. పొగిళ్ళ లిఫ్ట్ స్కీం పూర్తి అయితే దాదాపు 6 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, దీని వల్ల కలిగే ప్రయోజనాలపై ఇప్పటికే తాను నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావుకు చెప్పానని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ చెప్పారు. లిఫ్ట్‌స్కీం వల్ల ప్రయోజనం పొందే గ్రామాలకు చెందిన పూర్తి వివరాలను రెవిన్యూ అధికారులు వెంటనే టి ఎస్ ఐడిసి అధికారులకు అందజేయాలని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ఆదేశించారు. ఐడిసి అధికారులు వెంటనే సర్వే పనులను ప్రారంభించాలని కోరారు. సమావేశంలో టి ఎస్ ఐడిసి ఈ ఈ భాషునాయక్, డి ఇ గణేశ్, ఏ ఇ షేక్ వసీయోద్దిన్, చందంపేట తహశీల్దార్ యాకూబ్, పెద్ద అడిశర్లపల్లి తహశీల్దార్ ధర్మయ్య, పలువురు వీ ఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లాలో 33 పంచాయతీల్లో ప్రయోగాత్మకంగా
నగదురహిత కార్యక్రమం
జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్‌రెడ్డి
మిర్యాలగూడ టౌన్, డిసెంబర్ 13: నల్లగొండ జిల్లాలోని 31 మండలాల్లోని 33 గ్రామపంచాయతీల్లో నగదు రహిత కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి పి.ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఇందుకు గాను ముందుకు వచ్చాయని ఆయన అన్నారు. మిర్యాలగూడ మండలంలో తుంగపాడు గ్రామపంచాయతీని తమిళనాడు మార్కెంటైల్ బ్యాంకుకు దత్తత తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ కోరగా పెద్ద గ్రామపంచాయతీ అని వేరే చిల్లాపురం గాని, బి.అన్నారం గాని దత్తత తీసుకుంటామన్నారని ఆయన అన్నారు. జిల్లాలో సుమారు 19.4 కోట్ల రూపాయలు ఆస్తిపన్ను, నల్లా పన్ను ఇతర బకాయిలుండగా పాత నోట్లతో సుమారు 6 కోట్ల రూపాయ వరకు సేకరించామని ఆయన అన్నారు. మార్చి చివరి నాటికి లక్ష్యాన్ని పూర్తి చేస్తామన్నారు. 14వ ఆర్ధిక సంఘం కింద జిల్లాకు సుమారు 23 కోట్ల రూపాయల మేర నిధులు మంజూరైనాయని ఆయన అన్నారు. త్వరలో ఆయా గ్రామాల్లో అభివృద్ధి, నిర్మాణ పనులను చేపడ్తామని తెలిపారు. సమావేశంలో ఇంచార్జి డివిజనల్ పంచాయతీ అధికారి పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.