నల్గొండ

సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే విధంగా చూడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాంపల్లి, డిసెంబర్ 15 :తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ పథకాలు ప్రజలకు అందేవిధంగా అధికారులు పర్యవేక్షించాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి, నాంపల్లి మండల ప్రత్యేక అధికారి ఎస్. ఉదయ్‌కుమార్ అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. అధికారులంతా గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు నిర్ధేశించి గడువులో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా దీపం కనెక్షన్లు మంజూరైన లబ్దిదారులను గుర్తించి వారికి గ్యాస్ కనెక్షన్లు అందజేయాలన్నారు. గ్రామాల్లో వౌళిక వసతులు కల్పించి ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారులు స్పందించి వేగవంతంగా పనులను పూర్తి చేయాలన్నారు. అనంతరం మండల కేంద్రంలొ ఛౌక ధరల దుకాణాలను తనిఖీ చేశారు. డీలర్లు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినియోగదారులకు బియ్యం సక్రమంగా సరఫరా చేయాలని, ఆయా ప్రభుత్వ పాఠశాలలకు, వసతి గృహాలకు సన్నబియ్యం సజావుగా సరఫరా చేయాలన్నారు. ప్రతి సోమవారం అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో తహశీల్దార్ ఎండి.ఖలీల్, ఎంపిడిఒ హనుమాన్‌ప్రసాద్, శేషగిరిరావు, ఆర్ ఐ రఘుపతిరావు, సీనియర్ అసిస్టెంట్ యాకుబ్ ఆలీ, విఆర్‌ఒలు, పంచాయితీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
నగదు రహిత జిల్లాగా ముందడగు
అన్ని మండలాలకు ప్రత్యేక అధికారులు * రెండు, మూడు గ్రామాలకు ఒక ఫెసిలిటేషన్ సెంటర్
కలెక్టర్ సురేంద్రమోహన్
సూర్యాపేట, డిసెంబర్ 15: జిల్లాను నగదురహితంగా మార్చేందుకు ఈనెలఖారులోగా వ్యవస్థపరమైన ఏర్పాట్లు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గాంధీనగర్, కాసరబాద గ్రామాలను డిజిటల్ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన చర్యలను పరిగణలోకి తీసుకొని జిల్లా అంతటా నగదురహిత విధానాన్ని అమలుపర్చే విధంగా ముందుకు సాగనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ప్రతి మండలానికి జిల్లాస్ధాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించనున్నట్లు వెల్లడించారు. ప్రతి మండలాన్ని నాలుగు, ఐదు క్లస్టర్‌లుగా విభజించి మండలస్ధాయి అధికారులను ఇంచార్జీలుగా నియమించనున్నట్లు పేర్కొన్నారు. గ్రామాల వారీగా కుటుంబాల సంఖ్య, బ్యాంకు ఖాతాలు ఉన్నవారి వివరాలు, ఆయా గ్రామాల్లో ఉన్న వర్తక, కిరాణదుకాణదారులు, వారి బ్యాంక్‌ఖాతాలు, బ్యాంకు ఖాతాలులేని కుటుంబాలు, దుకాణదారుల వివరాలు సేకరించనున్నట్లు చెప్పారు.
గ్రామాల వారీగా ఆర్ధిక కార్యకలాపాల నివేధికను రూపొందిస్తామన్నారు. బ్యాంకు ఖాతాలు ఉన్నప్పటికీ డెబిట్, క్రెడిట్‌కార్డులు పొందని వారి వివరాలు, ఆధార్‌కార్డులు ఉన్నవారు, లేనివారు, కుటుంబాల్లో ఉన్న స్మార్ట్ఫోన్‌లు, సాధారణ సెల్‌ఫోన్‌లు, ఫోన్‌లు లేనివారి వివరాలు సేకరించనున్నట్లు తెలిపారు. సర్వీసు ఏరియా శాఖల వివరాలను నమోదు చేస్తామన్నారు. ఆ వివరాల ప్రకారం అన్ని కుటుంబాలకు నగదురహిత లావాదేవిలా పరిధిలోకి తెచ్చేందుకు అందరికీ బ్యాంకు ఖాతాలు తెరవడం, డెబిట్‌కార్డులు జారీచేయడం, సెల్‌ఫోన్ యాఫ్‌ల సహయంతో నగదుబదిలీ ప్రక్రియపై ప్రతి కుటుంబానికి అవగాహన కల్పించేందుకు రెండు, మూడు గ్రామాలకో ఒక ఫెసిలేటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సిద్దిపేట అనుభావలను దృష్టిలో ఉంచుకొని డిఆర్‌డిఎ-డ్వామా అకౌంటెంట్లు, బ్యాంకు ఉద్యోగులు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రతి గ్రామానికి కొంతమంది వాలంటీర్‌లను నియమించి అన్ని కుటుంబాలకు నగదురహిత ప్రక్రియలపై అవగాహన కల్పించేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వచ్చే నెలలో తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.