నల్గొండ

విద్యుత్ ఆదా దిశగా అడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, డిసెంబర్ 15 : పట్టణంలో విద్యుత్ బిల్లులను ఎల్ ఈడి బల్బులు ఏర్పాటు చేసి ఆదా చేసే దిశలో పట్టణ మున్సిపాలిటీ తీర్మానంతో ముందడుగు వేసింది. గురువారం మున్సిపల్ చైర్‌పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ అధ్యక్షతన జరిగిన పాలకవర్గ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పట్టణంలో విద్యుత్ బిల్లుల ఆదా చేసేందుకు ప్రస్తుత ట్యూబ్‌లైట్ల స్ధానంలో ఎల్ ఈడి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసేందుకే ప్రతిపాదించగా కౌన్సిలర్లు ముక్తకంఠంతో స్వాగతిస్తున్నామని, కానీ తమ వార్డుల్లో సర్వే నిర్వహించినప్పుడు తక్కువ స్ధంభాలు ఉన్నాయని, ప్రస్తుతం సర్వే నిర్వహించి నాలుగు నెలలు జరిగిందని, ఇప్పుడు స్ధంభాలు అదనంగా వేశారని, వాటి మాటేమిటని ప్రశ్నించారు. ఎండి.సలీం, ఖయ్యుంబేగ్, ధనలక్ష్మీ, నూకల వెంకటనారాయణరెడ్డి, గుమ్ముల రాధిక, దుబ్బ అశోక్‌సుందర్, అవుట రవీందర్‌లు తమ వార్డులలో సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ప్రజల ఎదుటికి వెళ్లే పరిస్థితి కరువైందని, పట్టణంలో భూగర్భడ్రైనేజీ పనులు ఆగిపోయి, మ్యాన్‌హోల్స్ సరిగ్గా లేక ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని, విలీన గ్రామాల్లో సైతం త్రిఫేస్ కరెంట్ లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీకి సంబంధించి ఏ యంత్రం రిపేర్‌కు వచ్చినా నెలలు నెలలుగా దాన్ని మరమ్మత్తుల పేరుతో కొత్తది కొనేంత నిధులు కేటాయిస్తున్నారని రావుల శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. అందుకు అవసరమైన పరికరాలు సైతం అధిక నిధులు విడుదల చేస్తూ ట్రాక్టర్లకు పోసే డిజిల్ సైతం దుర్వినియోగం అవుతుందని ఆరోపించారు. శానిటేషన్ బకాయిలు కోటి రూపాయలు ఉన్నాయని, ఇంతకుముందు రెండు కోట్లు ఇచ్చినా, మళ్లీ కార్మికులకు పి ఎఫ్ రూపంలో 70 లక్షలు, ఈ ఎస్ ఐ రూపంలో 30 లక్షలు బకాయిలుగానే ఉన్నాయని, కార్మికులకు ఏదైనా వైద్యం అవసరమైతే ప్రైవేటుకు వెళ్లవలసి వస్తుందని, వారి గురించి పట్టించుకుంటేనే వారు పనులు చేయగలుగుతారని ఎండి.సలీం హితవు పలికారు. ఈఈ సత్యనారాయణ వివరణ ఇస్తూ విద్యుత్ ఆదా చేసే దిశగా పట్టణ ప్రజలకు మేలు చేసేందుకే ప్రైవేటు సంస్ధతో ఒప్పందం జరిగిందని, 50శాతం వరకు పట్టణ ప్రజలకు విద్యుత్ ఆదా అవుతుందని తెలిపారు. ఈ సమావేశంలో డి ఈ వెంకటేశ్వర్లు, విద్యుత్ ఏడి, అసిస్టెంట్ కమీషనర్ అరుణ, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అకడమిక్ సెనెట్ విజయవంతం
నల్లగొండ టౌన్, డిసెంబర్ 15 : మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో ఉపకులపతి ఆచార్య ఖాజా అల్త్ఫా హుస్సేన్ అధ్యక్షతన గురువారం అకాడమిక్ సెనెట్ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైస్ చాన్సలర్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం బి-గ్రేడు రాష్ట్ర ప్రభుత్వంతో విశ్వవిద్యాలయాల గ్రాంట్ కమిషన్ గుర్తింపు పొందిందని నాప్ ద్వారా బి-గ్రేడు పొందినట్లు వివరించారు. ఈ విశ్వవిద్యాలయానికి 191 అనుబంధ కళాశాలలు ఉన్నట్లు తెలిపారు. విశ్వవిద్యాలయంలో ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్, అకాడమిక్ సెనెట్, ఫైనాన్స్ కమిటీ, ప్లానింగ్, మానీటరింగ్ బోర్డులు ఉన్నాయని ఆయన తెలిపారు. కమ్యునికేషన్ కోసం విద్యార్ధులకు ఆంగ్ల శిక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేగాకుండా లైబ్రేరీ భవనం సైతం ఏర్పాటు చేశామన్నారు. సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు అందించారు. ఈ సమావేశంలో వాణిప్రసాద్, మాజీ వీసిలు సులేమాన్, కట్ట నర్సింహ్మారెడ్డి, ఎంజియు రిజిస్ట్రార్ ఉమేష్‌కుమార్, భాగ్యనారాయణ, మల్లేషం, ప్రిన్సిపల్ నాగేందర్‌రెడ్డి, అనుబంధ కళాశాలల ప్రిన్సిపల్స్ బాబురావు, అంజిరెడ్డి యాదగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

లారీని ఢీకొన్న మినీ గూడ్స్ వ్యాన్
ఇద్దరు దుర్మరణం
* ఒకరికి గాయాలు
చౌటుప్పల్, డిసెంబర్ 15: చౌటుప్పల్ మండల కేంద్రానికి సమీపంలో శ్రీని పరిశ్రమ వద్ద 65వ జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సిఐ నవీన్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... హైదారాబాద్ నుంచి భద్రాచలం సిమెంటు రేకులతో వెళ్తున్న లారీ శ్రీని పరిశ్రమ సమీపంలో చెడిపోయింది. ఎ లాంటి ముందుజాగ్రత్తలు తీసుకోకుండా రోడ్డు పక్కన ఆపి ఉంచారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపుకు వేళ్తున్న మినీ గూడ్స్ వ్యాన్ అతివేగంగా వచ్చి నిలబడి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొటింది. ఈ ప్రమాదంలో విజయనగరంకు చెందిన వ్యాన్ డ్రైవర్ నాయుడు శ్రీనివాస్‌రావు (40), వ్యాన్‌లో వెనక భాగంలో ఉన్న శ్రీకాకుళం జిల్లా దునుమూరు మండలం టెక్కలిపాడు గ్రామానికి చెందిన ధర్మాన రమణ (35)లు అక్కడికక్కడే మరణించారు. వ్యాన్‌లో ఉన్న టెక్కలిపాడుకు చెందిన ఉమాశంకర్ తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన ఉమాశంకర్‌ను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకోని సిఐ నవీన్‌కుమార్ దర్యాప్తు చేస్తున్నారు.
చెల్లని చెక్కు కేసులో ఆరు నెలల జైలు
* రూ. 15 లక్షల జరిమాన
నల్లగొండ లీగల్, డిసెంబర్ 15 : మునుగోడు మండలం వెల్మకనె్న గ్రామానికి చెందిన కంపె ఎల్లయ్య చెల్లని చెక్కు ఇచ్చినందుకు ఆయనకు ఆరు నెలల జైలుశిక్ష, రూ. 15 లక్షల జరిమానాను విధిస్తూ నల్లగొండ ప్రధమ శ్రేణి న్యాయమూర్తి ఎన్.ప్రశాంతి గురువారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు ఇలా వున్నాయి. నల్లగొండకు చెందిన కట్ట యాదగిరి వద్ద ఎల్లయ్య 1.7.2011న 7.50 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఆ తరువాత అప్పు తీర్చడంలో భాగంగా 28.12.2012న 10 లక్షల విలువ గల ఏపిజివిబి బ్యాంకుకు చెందిన చెక్కును కట్ట యాదగిరికి ఇవ్వగా అట్టి చెక్కును నాచారంలోని ఇండియన్ బ్యాంకులో వేయగా అట్టి చెక్కుకు సరిపడ డబ్బులు లేవని బ్యాంకు వారు తెలిపారు. ఈ విషయంపై నల్లగొండ కోర్టులో కేసు వేయగా వాదప్రతివాదనలు విన్న న్యాయమూర్తి తీర్పునిస్తూ కంపె ఎల్లయ్య ఏడల నేరం రుజువైనందున శిక్ష, జరిమాన విధించారు.