నల్గొండ

క్రీడలతో మానసిక ఉల్లాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, డిసెంబర్ 17: క్రీడలతో శరీర ధారుడ్యంతో పాటు మానసిక ప్రశాంతత చేకూరుతుందని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, సిఎల్పీ ఉపనేత, స్ధానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు విద్యార్ధులకు సూచించారు. శనివారం చర్లపల్లిలోని విపశ్య పాఠశాల నందు అండర్-14 బాలబాలికల జాతీయ స్ధాయి లాంగ్ టెన్నీస్ పోటీలను మున్సిపల్ చైర్‌పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీశ్రీనివాస్, ఎంజీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఖాజా అల్త్ఫా హుస్సేన్‌లతో కలసి ప్రారంభించి మాట్లాడారు. చిన్నతనం నుండే చదువుతో పాటు విద్యార్ధులను క్రీడల్లో ప్రోత్సహిస్తే జాతీయ, ప్రపంచ స్ధాయిలో భారతదేశానికి గుర్తింపుతో పాటు ఉన్నత ఉద్యోగాలు సాధించవచ్చని అందుకు అన్ని రంగాల్లో వారు నిష్ణాతులయ్యేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల వెన్నుదన్ను అవసరమన్నారు. అనంతరం క్రీడలను ఆడి పోటీల్లో పాల్గొనే విద్యార్ధులకు స్ఫూర్తినందించారు. అందుకు విద్యార్ధులు ఓటమిని సైతం కుంగిపోకుండా క్రీడాస్ఫూర్తితో జయించాలన్నారు. నాకౌట్ మెథడ్‌లో నిర్వహించే ఈ టోర్నమెంట్‌లో దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి సుమారు 60 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని, హైద్రాబాద్ మినహా టెన్నీస్ టోర్నమెంట్ నిర్వహించడం తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారి అన్నారు.
ఇందులో గెలుపొందిన బాల బాలికలు జాతీయస్ధాయి అధికారిక టెన్నీస్ ర్యాంకింగ్‌లోకి అనుమతించబడుతారని, ఆలిండియా టెన్సీర్ అసోసియేషన్ గుర్తింపు పొందిన ఈ పోటీలను జిల్లా లాంట్ టెన్సీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు నూకల నర్సింహ్మారెడ్డి, లాంగ్ టెన్నీస్ అసోసియేషన్ అధ్యక్షులు బండారు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి మంగారెడ్డి, వెంకన్న, సభ్యులు విక్రమ్‌రెడ్డి, విజయ్‌కుమార్, న్యాయ నిర్ణేతలుగా శ్రీకర్, శంభు, లక్ష్మణ్, శౌరిరెడ్డి, సచిన్‌లు వ్యవహరిస్తారని నిర్వాహకులు తెలిపారు.

నోట్ల మార్పిడి ముఠాలు అరెస్ట్
* రూ.10 లక్షల కొత్త నోట్లు, రెండుకార్లు స్వాధీనం
* 9మందికి రిమాండ్
* వివరాలు వెల్లడించిన ఎస్పీ పరిమళ
సూర్యాపేట, డిసెంబర్ 17: పెద్దనోట్ల రద్దు నేపధ్యంలో కమీషన్ పద్దతిపై నోట్ల మార్పిడి చేసే రెండు ముఠాలకు చెందిన తొమ్మిదిమంది సభ్యులను పోలీసులు అరెస్ట్‌చేసి వారి వద్ద నుంచి రూ.10లక్షల కొత్త నోట్లు, రెండు కారులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలకు సంబంధించిన వివరాలను శుక్రవారం జిల్లాకేంద్రంలోని పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఎస్పీ పరిమళ హనానూతన్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్టానికి చెందిన ఆరుగురు నోట్ల మార్పిడి చేసేందుకు జిల్లాకేంద్రానికి వచ్చినట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పట్టణ ఇన్స్‌స్పెక్టర్ వై.మొగిలయ్య ఆధ్వర్యంలో గురువారం కొత్తబస్టాండ్ సమీపంలో అనుమానస్పదంగా కన్పించిన ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా నోట్ల మార్పిడి చేసేందుకు వచ్చినట్లుగా గుర్తించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా పరుచూరు మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన దొప్పలపూడి రాఘవరావుతో పాటు గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పెద్దపులి వార్ గ్రామానికి చెందిన దేవరకొండ నాగేశ్వర్‌రావు, ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పసుపుగాళ్లు గ్రామానికి చెందిన చింతల రాజారెడ్డి, కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన మునుపల్లి జీవన్‌కుమార్, హైదరాబాద్‌లోని కృష్ణానగర్‌కు చెందిన గిల్లపల్లి నారాయణ, హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన కమ్మరి రామలింగాచారిలు కలిసి సూర్యాపేటలో నల్లడబ్బు ఉన్న వారు అధికంగా ఉన్నారని, వారికి 15శాతం కమీషన్‌పై డబ్బు మార్పిడి చేయాలని రాఘవరావు వద్ద ఉన్న 5లక్షల కొత్త 2000 రూపాయల నోట్లతో ఇక్కడికి వచ్చి పట్టుబడినట్లు తెలిపారు. వీరివద్ద 5లక్షల విలువైన కొత్త నోట్లు, కారు, ఐదు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
అదేవిధంగా శుక్రవారం ఉదయం పట్టణంలోని మరో ముగ్గురు నోట్ల మార్పిడి ముఠాను పట్టుకొని వారి వద్ద నుండి రూ.5లక్షల కొత్తనోట్లను స్వాధీనం చేసుకున్నమన్నారు. కడప జిల్లాకు చెందిన ఒంటెద్దు హర్షలింగేశ్వర్‌రెడ్డి, హైదరాబాద్‌మవది మోతీనగర్‌కు చెందిన దూళిపాళ్ళ అనిల్‌కుమార్, హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ కృష్ణానగర్‌కు చెందిన మొగల్ల నరేశ్‌కుమార్‌లు కమీషన్ పద్దతిపై నోట్ల మార్పిడి చేసేందుకు రాగా అందిన సమాచారం మేరకు వారిని అరెస్ట్‌చేసి రూ.5 లక్షల కొత్త నోట్లు, ఇండికా కారు, మూడు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ విలేఖరుల సమావేశంలో డిఎస్పీ వి. సునీతామోహన్, సిఐ వై. మొగిలయ్య, ఎస్‌ఐ సంతోష్‌కుమార్, ఐడిపార్టీ సిబ్బంది కరుణాకర్, సిహెచ్. వెంకన్న, కృష్ణ, శ్రీనివాస్, రాజు పాల్గొన్నారు.
పెద్ద నోట్ల రద్ధు విఫల ప్రయోగం
* సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, డిసెంబర్ 17: నల్లధనం నివారణ, ఉగ్రవాద నియంత్రణ కోసమంటు ప్రధాని నరేంద్రమోదీ చేసిన పెద్దనోట్ల రద్ధు చర్య అమలులో వైఫల్యం కారణంగా విఫల ప్రయోగమైందని ఇప్పటిదాకా నల్లధనం బయటరాకపోగా ప్రజలు కష్టాల్లో నెట్టబడ్డారని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి ఆరోపించారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సిపిఐ జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన హాజరై మాట్లాడారు. నోట్ల రద్ధు ఆశించిన లక్ష్యాలను చేరుకోకపోవడంతో నగదు రహిత విధానమంటు మోదీ కొత్త పల్లవి అందుకున్నారన్నారు. భారత్ వంటి వర్ధమాన దేశాల్లో నగదు రహిత విధానం ఇప్పట్లో సాధ్యం కాదని అప్పటిదాకా చిన్ననోట్లను విస్తృతంగా ముద్రించి సరఫరా చేసి ప్రజల ఇబ్బందులు తొలగించాలన్నారు. నోట్ల రద్ధుతో పేదలు, రైతులు, గ్రామీణ కూలీలు, అణగారిన వర్గాలు, గిరిజనులు, ఆదివాసిలు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారన్నారు. నల్లధన నిర్మూలన చర్యలను సిపిఐ స్వాగతిస్తుందని, ప్రణాళిక లేకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా మోదీ చేసిన నోట్ల రద్ధు చర్య ప్రజలనే ఇబ్బందులు పెడుతుండగా నల్లబాబులు ఎవరు బయటపడటం లేదన్నారు. రాష్ట్రంలోని సీఎం కెసిఆర్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో వైఫల్యం చెంది పార్టీ ఫిరాయింపులు, ప్రాజెక్టుల రీడైజన్లు, మిషన్ కాకతీయ, భగీరథ పనుల్లో కమిషన్ల పర్వంలో మునిగి పోయిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక చర్యలను, వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు సిపిఐ శ్రేణులు ప్రజాతంత్ర ఉద్యమాలను ఉదృతం చేయాలన్నారు. డిసెంబర్ 26నుండి సిపిఐ 91వ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించడం ద్వారా ప్రజల్లో సిపిఐ బలోపేతానికి కృషి చేయాలన్నారు. గ్రామగ్రామాన పార్టీ పతకాలను ఆవిష్కరించాలన్నారు.

పెట్రోల్ ధరల పెంపుపై వామపక్షాల నిరసన
సూర్యాపేట, డిసెంబర్ 17: కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం పట్ల నిరసన వ్యక్తంచేస్తూ శనివారం జిల్లాకేంద్రంలో సిపి ఐ, న్యూడెమోక్రసీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సిపి ఐ ఆధ్వర్యంలో రాఘవఫ్లాజా వద్ద ఆటోను తాళ్లతో లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ కార్యదర్శి బొమ్మగాని శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌చేశారు. కేంద్రం పెట్రోల్ లీటర్‌కు రూ. 2.99పైసలు, డీజిల్ రూ. 1.76పైసలు పెంచడం వల్ల పరోక్షంగా అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగి పేదలపై భారంపడుతుందన్నారు. మోదీ ప్రభుత్వం సంపన్నుల సంక్షేమానికు కృషిచేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దోరెపల్లి శంకర్, ఖమ్మంపాటి అంతయ్య, కౌన్సిలర్ అనంతుల మల్లీశ్వరి, పార్టీ నాయకులు దంతాల రాంబాబు, రాజారాం, చలమంద, బూర వెంకటేశ్వర్లు, శివరాం, సిరిపంగి నాగరాజు, పొదిల లింగయ్య, భగవాన్, పాపయ్య, సోమేష్ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ జిల్లాకేంద్రంలోని కొత్తబస్టాండ్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధంచేసి నిరసన తెలిపారు. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ కార్యదర్శి గంట నాగయ్య, నాయకులు కారింగుల వెంకన్న, మైబెల్లి, ఎర్ర అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

యాసంగి సాగులో రైతులకు సూచనలివ్వాలి
* వ్యవసాయ అధికారులకు కలెక్టర్ గౌరవ్ ఉప్పల్
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, డిసెంబర్ 17: జిల్లాలో మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద యాసంగి పంటలకు సాగునీటి విడుదల చేస్తున్నందునా పంటల సాగులో రైతులకు అవసరమైన సూఛనలందించి ఆరుతడి పంటలు వేసుకునేలా ప్రొత్సహించాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆదేశించారు. జిల్లా వ్యవసాయ, అనుబంధ శాఖలు, ఆత్మ గవర్నింగ్ బాడి సమావేశంలో ఆయన మాట్లాడుతు మూసీ నది నీటిని ఆదివారం నుండి విడుదల చేస్తారని, సాగర్ నీటిని మార్చి 31వరకు విడుతల వారిగా విడుదల చేస్తారని అందుకు అనుగుణంగా పంటల సాగు చేపట్టేలా రైతుల్లో చైతన్యం కల్పించాలన్నారు. రైతులకు యాసంగి పంటల సీజన్‌లో 470కోట్లు పంట రుణాలివ్వాల్సివుండగా ఈ దిశగా ఆశించిన పురోగతి లేకపోవడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రుణమాఫీ ప్రయోజనాలు, కొత్త రుణాలు రైతులకు సరిగా అందుతున్నాయో లేదో పరిశీలించి బ్యాంకర్ల ద్వారా రైతుల సమస్యలు పరిష్కరించడంలో వ్యవసాయ అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. జిల్లాలో 77శాతం వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారని, వారికి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సమర్ధవంతంగా అందించేలా అధికార యంత్రాంగం కృషి చేయాలన్నారు. రైతులకు పంటల సాగులో, పథకాల అమలులో సరైన సమాచారం అందించాలన్నారు. అప్పుడే వ్యవసాయ రంగ లక్ష్యాలు సాధించబడుతాయన్నారు. భూసార ఆరోగ్య కార్డులు, సబ్సిడీ పథకాలు రైతులకు సక్రమంగా అందించాలన్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి ఏఈవోల పనితీరును పరిశీలిస్తామన్నారు.

నోట్ల మార్పిడికి పాల్పడితే కఠిన చర్యలు
* డిసిపి యాదగిరి వెల్లడి
* 4 లక్షల కొత్తనోట్లు స్వాధీనం, ఆరుగురు అరెస్టు
భువనగిరి, డిసెంబర్ 17: అక్రమంగా 4 లక్షల రూపాయల విలువచేసే 2000వేల రూపాయల కొత్తనోట్లను తరలిస్తున్న అక్రమ నగదు మార్పిడి బృందాన్ని పోలీసులు అరెస్టు చేసి నోట్లతో పాటు ఆల్టోకారు, రెండు బైకులు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లుగా భువనగిరి జోన్ డిసిపి పాలకుర్తి యాదగిరి తెలిపారు. శనివారం డిసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చౌటుప్పల్ మండల కేంద్రం నుండి వలిగొండ మండల కేంద్రానికి అక్రమంగా కమీషన్ కోసం కక్కుర్తిపడి నోట్ల మార్పిడి చేపట్టి తరలిస్తుండగా చౌటుప్పల్ ఏసిపి స్నేహిత బృందం మాటు వేసి పట్టుకున్నారు. నోట్లను తరలిస్తున్న నిందితులు హయత్‌నగర్ బస్‌డిపోకు చెందిన గుండె నాగరాజు, ఎల్‌బినగర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ బ్రోకర్ కోసిక శంకర్, గుర్రాల ఎల్లయ్య, గంప రాజేష్, మునిపంపులకు చెందిన చెరుకు శేఖర్, ఆధోని నర్సింహ్మలను అరెస్టు చేశామని మరో నిందితులు వలిగొండకు చెందిన గుంజ మల్లయ్య, ఎల్‌బినగర్‌కు చెందిన దంతోజు శ్రీనివాస్‌చారిలు పరారీలో ఉన్నారని త్వరలోనే పట్టుకుంటామని డిసిపి తెలిపారు. నిందితులు 20 శాతం కమీషన్‌కోసం ఆశపడి నోట్ల మార్పిడికి పాల్పడినట్లుగా విచారణలో తేలిందన్నారు. అక్రమంగా నోట్ల మార్పిడికి పాల్పడిన వారిపైన, బ్యాంకు అధికారులుపైన కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి కోర్టులో హాజరుపరుస్తున్నట్లుగా తెలిపారు. ఈ సమావేశంలో చౌటుప్పల్ ఏసిపి స్నేహిత, వలిగొండ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది ఉన్నారు. నోట్ల మార్పిడి బృందాన్ని చాకచక్యంగా పట్టుకున్న సిబ్బందికి రివార్డు కోసం పైఅధికారులకు సిఫార్సు చేస్తున్నట్లుగా తెలిపారు.

చర్చకు బెదిరే మా ఎమ్మెల్యేల సస్పెన్షన్
* సిఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, డిసెంబర్ 18: ప్రజా సమస్యలపై చర్చలకు బెదిరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రభుత్వం అసెంబ్లీ నుండి సస్పెండ్ చేసిందని సిఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 19మందికి సీఎం రిలిఫ్ ఫండ్ చెక్కులను ఆయన శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతు సిఎల్పీ నేత కె.జానారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేల బహిష్కరణను నిరసించారని, రేపటి నుండి అసెంబ్లీలో అనుసరించే వ్యూహాలకు మరింత పదను పెడుతామన్నారు. ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకాన్ని నిర్విర్యం చేస్తుండటంతో పేదలకు ఖరీదైన వైద్యం అందక ఇబ్బందులు ఎదుర్కోంటున్నారన్నారు. గతంలో 108,104ల ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలందించామని, ఆరోగ్యశ్రీతో కార్పోరేట్ వైద్యాన్ని పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అందించిందన్నారు. టిఆర్‌ఎస్ పాలనలో ప్రభుత్వాసుపత్రుల ద్వారా పేదలకు సరైన వైద్యం అందడం లేదన్నారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల పరిధిలో ఎన్‌హెచ్-65, 163జాతీయ రహదారులున్నందునా ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు జిల్లా కేంద్ర ఆసుపత్రిని 500పడకలకు పెంచి మెడికల్ కళాశాల ఏర్పాటు చేసినట్లయితే ప్రమాదాల బారిన పడే వారికి అత్యవసర చికిత్సలు అందుతాయన్నారు.
పరిశోధనలతో
ప్రజలకు మెరుగైన వైద్యం
నార్కట్‌పల్లి, డిసెంబర్ 17: జెనెటిక్ మాలిక్యులర్ డయాగ్నోసిస్ ఇన్ మోడరన్ మెడిసిన్ పేరుతో నార్కట్‌పల్లిలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ వైద్యుల సమ్మేళనంకు భారీ స్పందన లభిస్తుంది. శనివారం రెండవ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వైద్యులు ఈ సమ్మేళనంలో పాల్గొని తమ నైపుణ్యాన్ని, ముందుగా రోగాన్ని గుర్తించి తీసుకోవల్సిన నివారణ చర్యలపై యువ శాస్తవ్రేత్తలకు, విద్యార్ధులకు, వైద్యులకు వివరించారు. సమ్మేళనంలో జన్యుపరమైన వ్యాధులను నియంత్రించడమే కాకుండా సామాన్యప్రజలకు ఖరీదైన వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకే అందించే దిశగా సమ్మేళనంలో సమగ్రంగా చర్చించి దృష్టి సారించారు. రెండవ రోజు సదస్సులో పాల్గొన్న లండన్‌కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ దావేంద్రకుమార్ మాట్లాడుతూ వైద్య మేధావులు, నిష్ణాతులు సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించి నూతన వైద్య విధానంపై ఎప్పటికప్పుడు పరిశోధనలు జరుపుతూ జన్యు పరమైన వ్యాధుల నియంత్రనకు, నివారణకు తగు కృషి చేయాలని సూచించారు. ఇలాంటి సమ్మేళనాలతో డాక్టర్ల మధ్య సంబంధాలు పెరిగి సత్ఫలితాలు సాధించే దిశగా అడుగులు వేయవచ్చన్నారు.
పెన్షనర్ల సంక్షేమానికి కృషి
* కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడి
నల్లగొండ టౌన్, డిసెంబర్ 17: పెన్షనర్స్ ఉద్యోగుల సంక్షేమానికి తనవంతు కృషి చెస్తానని సిఎల్పీ ఉపనేత, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. అఖిల భారత పెన్షనర్ దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా కేంద్రం పెన్షనర్స్ భవన్‌లో నూతనంగా మూడో అంతస్తు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 70సంవత్సరాలు దాటిని పెన్షనర్లను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు గతంలో తాను పెన్షనర్స్ భవనానికి ఐదు లక్షలు అందించానన్నారు. ఇప్పుడు కూడా భవన నిర్మాణా పూర్తికి మరో 10లక్షలు అందిస్తానన్నారు. లిఫ్ట్ నిర్మాణంకు సహకరిస్తానన్నారు. తన కుమారుడిని పొగొట్టుకున్నా తాను ప్రజా సంక్షేమానికి పనిచేస్తు ఆ బాధను మరిచిపోతున్నానన్నారు. వైఎస్సార్ ప్రభుత్వ హాయంలో ఎంజి యూనివర్సిటీ మంజూరు చేయించానని, ఎస్‌ఎల్‌బిసికి 3వేలకోట్లు, బ్రాహ్మణ వెల్లంలకు 700కోట్లు మంజూరు చేయించానన్నారు. మెడికల్ కళాశాల ప్రయత్నం చివరి దశలో ఆగిందన్నారు. మున్సిపాల్టీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నియోజకవర్గంలో ప్రతి మండలంలో సబ్ స్టేషన్లు నిర్మింపచేశానన్నారు. రైతు సంక్షేమమే తన ప్రాధాన్యతన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి, రిటైర్డ్ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్, పెన్షనర్స్ అసొసియేషన్ జిల్లా అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, అజిజ్, రవిందర్‌రెడ్డి, యాదగిరిగౌడ్, రాములు, లక్ష్మినారాయణరెడ్డి, సుధాకర్, గాయం నారాయణరెడ్డి, ఆర్.అమృతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పెట్రో ధరల పెంపు పెనుభారంచిట్యాల, డిసెంబర్ 17: పెట్రోల్ డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచడం దారుణమని సామాన్యులపై పెట్రోమంటను కేంద్ర ప్రభుత్వం పెడుతున్నదని యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కందాటి రమేష్‌రెడ్డి అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు నిరసనగా శనివారం మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆటోకు ఫ్లెక్సీబ్యానర్‌ను కట్టి రహదారిపై నిలిపి నిరసనను వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈసందర్భంగా రమేష్‌రెడ్డి మాట్లాడుతూ సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పరిపాలనను అందించాల్సిన కేంద్ర ప్రభుత్వం పెట్రోధరల పెంపుపై సామాన్య ప్రజల నడ్డివిరుస్తుందన్నారు. ఇదివరకు చమురు ధరలు దేశీయంగా తగ్గినా కూడా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించకుండా మిన్నుకుండిపోయిందని అన్నారు.

యాసంగి సాగులో రైతులకు సూచనలివ్వాలి
* వ్యవసాయ అధికారులకు కలెక్టర్ గౌరవ్ ఉప్పల్
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, డిసెంబర్ 17: జిల్లాలో మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద యాసంగి పంటలకు సాగునీటి విడుదల చేస్తున్నందునా పంటల సాగులో రైతులకు అవసరమైన సూఛనలందించి ఆరుతడి పంటలు వేసుకునేలా ప్రొత్సహించాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆదేశించారు. జిల్లా వ్యవసాయ, అనుబంధ శాఖలు, ఆత్మ గవర్నింగ్ బాడి సమావేశంలో ఆయన మాట్లాడుతు మూసీ నది నీటిని ఆదివారం నుండి విడుదల చేస్తారని, సాగర్ నీటిని మార్చి 31వరకు విడుతల వారిగా విడుదల చేస్తారని అందుకు అనుగుణంగా పంటల సాగు చేపట్టేలా రైతుల్లో చైతన్యం కల్పించాలన్నారు. రైతులకు యాసంగి పంటల సీజన్‌లో 470కోట్లు పంట రుణాలివ్వాల్సివుండగా ఈ దిశగా ఆశించిన పురోగతి లేకపోవడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రుణమాఫీ ప్రయోజనాలు, కొత్త రుణాలు రైతులకు సరిగా అందుతున్నాయో లేదో పరిశీలించి బ్యాంకర్ల ద్వారా రైతుల సమస్యలు పరిష్కరించడంలో వ్యవసాయ అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. జిల్లాలో 77శాతం వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారని, వారికి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సమర్ధవంతంగా అందించేలా అధికార యంత్రాంగం కృషి చేయాలన్నారు. రైతులకు పంటల సాగులో, పథకాల అమలులో సరైన సమాచారం అందించాలన్నారు. అప్పుడే వ్యవసాయ రంగ లక్ష్యాలు సాధించబడుతాయన్నారు. భూసార ఆరోగ్య కార్డులు, సబ్సిడీ పథకాలు రైతులకు సక్రమంగా అందించాలన్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి ఏఈవోల పనితీరును పరిశీలిస్తామన్నారు.