నల్గొండ

యువతకు ఉపాధి అవకాశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, డిసెంబర్ 20: యువతకు ఉపాధి అవకాశాలు అందించేందుకు ప్రభుత్వం వైపు, స్వచ్చందంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు అన్నారు. మంగళవారం ప్రతీక్ మోమొరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా టాటాస్ట్రైవ్, ప్రతీక్ ఫౌండేషన్‌ల ఆధ్వర్యంలో నిరుద్యోగులకు నిర్వహించిన ప్లేస్‌మెంట్ ఫోగ్రాం-శిక్షణా సదస్సులో వారు మాట్లాడారు. నారాయణరెడ్డి మాట్లాడుతు మొదటి విడతగా 500మందికి ఉపాధి శిక్షణా అందించి ఉద్యోగాలు కల్పిస్తారన్నారు. వారందరికి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారానే శిక్షణా కాలంలో వసతి, భోజన సౌకర్యం ఆర్ధిక భాగస్వామ్యం ఉంటుందన్నారు. చిన్నా చితక ఉద్యోగం అనుకోకుండా ముందుగా ఉద్యోగంలో చేరాలన్నారు. విద్యార్హత, నైపుణ్యాల మేరకు వారికి ఉద్యోగాలు కల్పిస్తారన్నారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా దేశ్‌పాండే ఫౌండేషన్ సహకారంతో విద్యార్థులకు ఆర్ధిక చేయూత, రైతులకు పంటల సాగులో సహకారం అందిస్తున్నట్లుగా కోమటిరెడ్డి తెలిపారు. తన కుమారుడి జ్ఞాపకార్ధం విద్యార్థుల ఉన్నత చదువులకు, రైతుల సంక్షేమానికి, నియోజకవర్గ అభివృద్ధిలో అంకితమయ్యానన్నారు. విద్యార్థులకుచదువులను, నిరుద్యోగులకు ఉపాధి కల్పనను అందించడం ద్వారా తన కుమారుడిని తాను వారిలో చూసుకుంటున్నానన్నారు. ఇటువంటి ఉపాధిశిక్షణ, కల్పన సదస్సులను, ప్రాంగణ ఎంపికలను, జాబ్ మేళలను విద్యార్థులు, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని కార్పోరేట్ కంపనీలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి ప్రతి నెల కొందరికి ఉద్యోగ, ఉపాధి కల్పించే చర్యలు కొనసాగిస్తానన్నారు. ఈ శిక్షణా సదస్సుకు 1000మంది నిరుద్యోగులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రతీక్ ఫౌండేషన్ సిఈవో గోనారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి, ప్రిన్సిపాల్స్ ఎర్ర అంజయ్య, అశోక్‌రెడ్డి, నర్సిరెడ్డి, అధ్యాపకులు సుధారాణి, ఉమామోహన్‌రెడ్డి, టాటాస్ట్రైట్స్ ప్రతినిధులు మురళీకృష్ణ, సందీప్, జడ్పీటీసి శ్రీనివాస్‌గౌడ్, మాజీ జడ్పీటీసి మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వచ్చే నెలాఖరులోగా..
ఆన్‌లైన్ నగదు లావాదేవీలు
* కలెక్టర్ సురేంద్రమోహన్
సూర్యాపేట, డిసెంబర్ 20: వచ్చే నెలాఖరులోగా నగదు లావాదేవీలు ఆన్‌లైన్‌లో పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్ తెలిపారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాయంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక అధ్యక్షతన జరిగిన ఆన్‌లైన్ నగదు లావాదేవాల చెల్లింపులపై ఏర్పాటుచేసిన స్విపింగ్ మిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసి మాట్లాడుతూ ప్రజలు ఆన్‌లైన్ బ్యాకింగ్ చేయుటకు వ్యాపారసంస్థల్లో, వార్డులల్లో అవగాహన నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఆన్‌లైన్ లావాదేవీలపై అవగాహ నిర్వహించేదుకు 2500 మంది వాలెంటర్లను నెలాఖరులోగా నియమిస్తున్నట్లు తెలిపారు. నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలలోలో ఆదాయపు పన్ను అధికారులచే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ చెల్లింపుల ద్వారా వ్యాపారస్థులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఇట్టి విషయంలో ఎవరైనా అధికారులు ఇబ్బందులు కలిగిస్తే తమ దృష్టికి తీసుకొస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కువగా నగదు లావాదేవీలు జరుగుతున్న విద్యాసంస్థలు, పెట్రోల్‌బంకులు, గ్యాస్ కేంద్రాల్లో ముందుగా స్వైపింగ్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలోని మీసేవ కేంద్రాల్లో తనిఖీ చేశారు. ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. వైస్‌చైర్‌పర్సన్ నేరేళ్ల లక్ష్మి, వార్డు కౌన్సిలర్లు, ఆన్‌లైన్ రిసోర్స్‌పర్సన్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.