నల్గొండ

నగదు రహిత విధానాన్ని అలవర్చుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, డిసెంబర్ 23: నగదు రహిత పద్దతులపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని జిల్లా సంయుక్త కలెక్టర్ డి. సంజీవరెడ్డి, ఐటి నిపుణులు మనోరంజన్‌లు అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఎస్వి కళాశాల ఆడిటోరియంలో నగదు రహిత లావాదేవీల నిర్వాహణపై జిల్లాస్థాయి ఆశావర్కర్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో వారు మాట్లాడుతూ ఆలోచనలో మార్పు ఉంటేనే కొత్త ఒరవడులు అలవడుతాయన్నారు. నగదు కొరత కారణంగా ప్రజా జీవనం స్థంబించరాదని ఖాతాలో డబ్బులు ఉన్నప్పుడు వాటిని వాడుకొని నిత్యవసరాలను తీర్చుకునే నగదు రహిత పద్దతుల వైపు పయణించాలని సూచించారు. డెబిట్ కార్డులు, సెల్‌ఫోన్‌ల ద్వారా వస్తు సేవల కొనుగోలుతో పాటు డబ్బులను ఇతర ఖాతాలకు బదాలయింపు చేసుకొవచ్చునని వివరించారు. నగదు రహిత ప్రక్రియ నిర్వహణ చాలా సులభమని వివరించారు. ఈ విధానాన్ని అమలుచేయడం వల్ల సమయం ఆధా అవుతుందని ఉన్న చోటు నుండి నగదు బదిలీ చేసుకోవచ్చునని, పలు రకాల బిల్లులను కూడా చెల్లించవచ్చునని చెప్పారు. ఇందుకోసం ప్రతి ఒక్కరికి ఒక బ్యాంక్ ఖాతా ఉండాలని, ఆ ఖాతాలకు సంబంధించిన డెబిట్‌కార్డు పొందాలని, ఆధార్‌కార్డు, సెల్‌ఫోన్ నెంబర్లను సీడింగ్ చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా సంయుక్త కలెక్టర్ డి. సంజీవరెడ్డి మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాను జనవరి నెలాఖరు లోగా నగదు రహిత లావాదేవీల నిర్వాహణ జిల్లాగా మార్చేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు ప్రజలు సహయ, సహకారాలు అందించాలని కోరారు. ప్రతి ఒక్కరికి నగదు రహిత లావాదేవీల నిర్వహణపై అవగాహన కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆశా వర్కర్లు గ్రామస్థాయిలో ప్రతి ఇంటికి తిరిగి ప్రతి కుటుంబానికి ఈ విధానంపై అవగాహన కల్పించేలా పనిచేయాలని సూచించారు. స్మార్ట్ఫోన్‌ల ద్వారా కూడా బిల్లుల చెల్లింపు ప్రక్రియను చేపట్టవచ్చునన్న విషయాన్ని తెలియజెప్పాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ తండు మురళీమోహన్, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ రామకృష్ణ, డిఈఎంవో తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
క్రీస్తు భోదనలు
అనుసరణీయం
* సూర్యాపేట జిల్లా ఎస్పీ పరిమళ
మఠంపల్లి, డిసెంబర్ 23: నిజమైన క్రైస్తవులు బైబిల్ అనుసరిస్తూ శాంతికాముకులుగా ఉంటారని వారికి ఎలాంటి దురుద్దేశాలు ఉండవని సూర్యాపేట జిల్లా ఎస్‌పి పరిమళ అన్నారు. గురువారం రాత్రి మండల కేంద్రంలో జరిగిన సెమిక్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా పలువురు నాయకులు సెమి క్రిస్మస్ వేడుకలను నిర్వహించుకోవడం అభినందనీయమని అన్నారు. అనంతరం దైవభక్తి గీతాలను ఆలాపించారు. ఫాస్టర్లు శాంతిసందేశాన్ని వినిపించారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి బొల్లంమల్లయ్యయాదవ్, బిజెపి హుజూర్‌నగర్ నియోజకవర్గ ఇంచార్జి బొబ్బా భాగ్యరెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లం ప్రభాకర్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర కార్యదర్శి వేముల శేఖర్‌రెడ్డి, మల్లికంటి కృష్ణ, మఠంపల్లి సర్పంచ్ ఆదూరి స్రవంతి, ఎంపిటిసి బుడిగె జయమ్మ, నాయకులు పాల్గొన్నారు.