నల్గొండ

పేటలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, డిసెంబర్ 25: క్రైస్తవుల ఆరాధ్యదైవం ఏసుక్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పండుగను ఆదివారం జిల్లాకేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని సెయింట్‌నరీ బాప్టిస్ట్ చర్చి, మన్నాచర్చి, గోపాలపురం చర్చి, తెలుగు బాప్టిస్ట్‌చర్చి, సిఎస్‌ఐచర్చిలతో పాటు నిష్కలంకమాత ఆలయాల్లో క్రిస్మస్ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవులు చర్చిలకు వెళ్ళి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. పట్టణంలోని పలు చర్చిల్లో నిర్వహించిన కిస్మస్ వేడుకల్లో రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కిస్మస్ కేక్‌ను కట్‌చేసి క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలను తెలిపారు. సెయింట్‌నరీ బాఫ్టిస్ట్‌చర్చిలో చర్చి ఫాస్టర్ డాక్టర్ ప్రభుదాస్ పండుగ సందేశమిచ్చారు. ఏసుక్రీస్తు ప్రపంచానికి అందించిన అహింస, ప్రేమఅనే మార్గాలను ప్రతి ఒక్కరు అనుసరించాలన్నారు. ఏసుక్రీస్తు ప్రభోదించిన బోధనలు నేటితరానికి ఆదర్శమన్నారు. యువత క్రీస్తు బోధనలు అనుసరించడం ద్వారా సమాజంలో శాంతి నెలకొనేందుకు తమ వంతు బాధ్యత నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక, సిపిఎం జిల్లా కార్యదర్శి ముల్కలపల్లి రాములు, టిఆర్‌ఎస్ నాయకులు వై.వెంకటేశ్వర్లు, కట్కూరి గన్నారెడ్డి, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, , గండూరి ప్రకాశ్, బిజెపి నాయకులు రంగరాజు రుక్మారావు,కొణతం సత్యనారాయణరెడ్డి,బిజెపి పట్టణ అధ్యక్షుడు అబీద్, జీడి భిక్షం తదితరులు పాల్గొని క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక నివాసంలో క్రిస్మస్ సందర్భంగా ప్రవళికతో పాటు కోదాడ చైర్‌పర్సన్ వంటిపులి అనితలు కేక్‌కట్‌చేశారు.

బిసి ఉద్యోగుల పదోన్నతిపై కౌన్సిల్లో చర్చిస్తా
* ఎమ్మెల్సీ పూల రవీందర్
నల్లగొండ టౌన్, డిసెంబర్ 25: బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించే విషయమై శాసనమండలిలో చర్చిస్తామని ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు. ఆదివారం పట్టణంలో జరిగిన బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ బిసి ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చక్రహరి రామరాజు మాట్లాడుతూ బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, గృహ వసతి కల్పించాలని, బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా కార్యవర్గం నూతన అధ్యక్షులుగా ఎన్.పిచ్చయ్యగౌడ్, కార్యనిర్వాహణ అధ్యక్షులుగా ఓలి సమీర్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా చింతల వెంకటేశ్వర్లు, కోశాధికారిగా కత్తెరపల్లి శేషయ్య, ఉపాధ్యక్షులుగా పోలగోని యాదయ్యలు ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో నేలపట్ల సత్యనారాయణ, పి ఆర్‌టియు అధ్యక్షులు సుంకరి భిక్షంగౌడ్, బిసి సంఘం నాయకులు కాశయ్యగౌడ్, మల్లయ్య, శ్యాంసుందర్, వీరహరి, పరమేష్, దయానంద్, వైద్యుల సత్యనారాయణ, వైద్యుల వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, రాములు, బిసి యువజన సంఘం అధ్యక్షులు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.