నల్గొండ

సమగ్ర ఎరువుల వాడకంతో అధిక దిగుబడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గరిడేపల్లి, డిసెంబర్ 26: రైతాంగం సమగ్ర ఎరువులను వాడటం ద్వారానే పంటలలో అధికదిగుబడులను సాధించవచ్చని గడ్డిపల్లి కెవికె శాస్తవ్రేత్తలు బి.లవకుమార్, ఎం.రంగారెడ్డిలు పేర్కొన్నారు. మండలంలోని గారకుంటతండ గ్రామంలో సోమవారం కెవికె ఆధ్వర్యంలో రైతు శిక్షణా శిభిరాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామం శివారులోని రైతులు సాగుచేసిన వివిధ పంటలను వారు పరిశీలించారు. అనంతరం రైతులనుద్దేశించి మాట్లాడుతు రైతులు సమగ్ర ఎరువులైన సేంద్రియ, జీవన ఎరువులు, రసాయినిక ఎరువులతో పాటు ఉపసూక్ష్మ పోషకాలను తగు మోతాదులో వాడటం ద్వారా పంటలలో అధికదిగుబడులను సాధించవచ్చని తెలిపారు. జైకిసాన్ జైవిజ్ఞాన్ వారోత్సవాల్లో భాగంగా రైతులకు ఆధునిక సాంకేతిక విజ్ఞాన విషయాలలో సరైన శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. సమగ్ర ఎరువుల యాజమాన్యంపై రైతులకు అవగాహన కల్పించారు. వరిలో అధిక దిగుబడికి నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకుని జీవసంబంధ మందులైన సూడోమోనాస్, ట్రైకోడర్మా విరిగిలతో విత్తనశుద్ది చేసుకుని నారును పెంచుకోవాలన్నారు. శిక్షణ అనంతరం గ్రామపరిధిలో రైతులు సాగుచేసిన కంది, దొండ, కాకర, ఆపిల్, రేగు క్షేత్రాలను సందర్శించి పరిశీలన చేసి అవసరమైన సూచనలిచ్చారు. కార్యక్రమంలో పి ఏ సి ఎస్ డైరక్టర్ బాబునాయక్, రైతులు హచ్చు, శ్రీనివాస్, బాలు, నాగు, పూలు, వీరస్వామి, సింగ్‌లతో పాటు 30మంది రైతులు పాల్గొన్నారు.

రెవెన్యూ వ్యవస్ధ బలోపేతంతోనే..
విఆర్‌ఒల సమస్యల పరిష్కారం
* రాష్ట్ర అధ్యక్షుడు గరిక ఉపేంద్రరావు
నల్లగొండ టౌన్, డిసెంబర్ 26: రెవెన్యూ వ్యవస్ధ బలోపేతంతోనే గ్రామ రెవెన్యూ అధికారుల సమస్యలు పరిష్కారమవుతాయని సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరిక ఉపేంద్రరావు అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఉదయాధిత్య భవన్‌లో జరిగిన జిల్లా విఆర్‌ఒల సంక్షేమ సంఘం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సమగ్ర భూసర్వే ద్వారానే రెవెన్యూ వ్యవస్ధ బలోపేతమవుతుందన్నారు. ఇప్పటికే వి ఆర్ ఒలు జిల్లా కలెక్టర్ల మాదిరిగా అన్ని శాఖల విధులు నిర్వర్తిస్తూ పని భారానికి లోనవుతున్నారన్నారు. కారుణ్య నియామకాలకు తాజాగా సి ఎం కేసి ఆర్ ఆదేశాలు ఇవ్వడం హర్షనీయమన్నారు. ఇదేరీతిలో పెండింగ్ ప్రమోషన్ల జీవోను అమలు చేయాలని, సిపిఎస్ పెన్షన్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వి ఆర్ ఒల సంక్షేమ సంఘం బలోపేతానికి అన్ని జిల్లాల్లో మహాసభలు నిర్వహించి కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా వి ఆర్ ఒలకు సంబంధించిన 186, 514, 10 జివోలను అమలు చేయాలని పార్ట్‌టైం వి ఆర్ ఒలకు 20వేల వేతనం ఇవ్వాలని, హెల్త్‌కార్డులు, ఇండ్ల స్ధలాలు ఇవ్వాలని తీర్మాణించారు. ఇందుకోసం ఆందోళనలు చేయాలని నిర్ణయించారు. ఖాళీగా ఉన్న 4463 పోస్టులు భర్తీ చేయాలని, కంప్యూటర్ డిజిటల్ శిక్షణ అందించాలని, ప్రొటోకాల్స్ ఖర్చులు ప్రభుత్వమే భరించాలని తీర్మాణించారు. ఈ సందర్భంగా వి ఆర్ ఒల సంఘం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా రంగరాజు శ్రీనివాసులు, అసోసియేట్ అధ్యక్షులుగా ఎన్.శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా జస్టిన్, ప్రధాన కార్యదర్శి ఎర్రమాద విఘ్నేశ్వర్‌రెడ్డి, కార్యదర్శులుగా ఎం.యాదయ్య, రామస్వామి, కోశాధికారిగా పూర్ణచందర్‌రాజు, రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా డానియల్ నియమితులయ్యారు. ఈసమావేశంలో సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు విజయ్‌రామారావు, కోశాధికారి అశోక్‌కుమార్, రాష్ట్ర, జిల్లా నాయకులు ప్రభంజన్‌రావు, దయాకర్‌రెడ్డి, కృష్ణ, నాగుల్‌మీరా తదితరులు పాల్గొన్నారు.