నల్గొండ

వ్యక్తి నిర్మాణంతోనే దేశ నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, డిసెంబర్ 26: వ్యక్తి నిర్మాణం ద్వారానే దేశ నిర్మాణం బలోపేతమవుతుందని ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ సహసంఘ్‌చాలక్ గార్లపాటి వెంకటయ్య, విభాగ్ కార్యవాహ నన్నూరి రాంరెడ్డిలు అన్నారు. రెండు రోజుల పాటు జిల్లా కేంద్రం విపస్య పాఠశాలలో నిర్వహించిన ఆర్ ఎస్ ఎస్ బాల శిభిరం ముగింపు కార్యక్రమంలో వారు మాట్లాడుతూ దేశభక్తి శారీరక, మానసిక వికాసం పెంపొందించే దిశగా స్వయం సేవకులకు శిభిరాలు నిర్వహిస్తుందన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో రెండు రోజుల బాల శిభిరం నిర్వహించామన్నారు. జిల్లా వ్యాప్తంగా వేలాది మంది విద్యార్ధులు బాల శిభిరంలో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా వక్త లక్ష్మణ్‌రావు, జిల్లా సంఘ్‌చాలక్ ఇటుకాల కృష్ణలు మాట్లాడుతూ బాల దశ నుండే దేశభక్తిని, దేశ సంస్కృతి, సనాతన సాంప్రదాయలను, ధర్మాలను అవగాహన కల్పించి ఉత్తమ శీల, వ్యక్తిత్వాలతో తీర్చిదిద్దడం ద్వారా ఉన్నత భారత నిర్మాణానికి దోహదం చేసినట్లు అవుతుందన్నారు. ఈ దిశగా ఆర్ ఎస్ ఎస్ బాల శిభిరం చేసిన కృషికి స్పందించి జిల్లా వ్యాప్తంగా వేలాది మంది బాలలు ఆర్ ఎస్ ఎస్ డ్రెస్‌కోడ్‌తో హాజరుకావడం హర్షనీయమన్నారు. ముగింపు సందర్భంగా పట్టణంలోని వీధుల గుండా ఆర్ ఎస్ ఎస్ బాలల స్వయం సేవకులతో ఘోష్‌తరంగ్ (ప్రదర్శన) వాయిద్యాలతో కవాతు నిర్వహించారు. పట్టణ వాసులను ఈ ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ముగింపు కార్యక్రమానికి డిఈఒ చంద్రమోహన్, సంఘ్ జిల్లాకార్యవాహ సుర్వి యాదగిరితో పాటు బిజెపి జిల్లా నాయకులు హాజరయ్యారు.

కొనసాగుతున్న జాతీయ కబడ్డీ పోటీలు
నల్లగొండ టౌన్, డిసెంబర్ 26: నల్లగొండ ఎన్‌జి కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న 62వ పాఠశాల జాతీయ స్థాయి అండర్ 17కబట్డీ పోటీలు మూడో రోజు సోమవారం హోరాహోరిగా సాగాయి. ఉదయం జాయింట్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలంగాణ-కర్ణాటకల బాలుర జట్ల మధ్య పోటీని ప్రారంభించి ఇరుజట్ల ఆటగాళ్లతో కరచాలనం చేసి ఉత్సాహపరిచారు. ఈ పోటీలో తెలంగాణ జట్టు గెలుపొందింది. అనంతరం ఒరిస్సా-తెలంగాణ బాలిక జట్ల పోటీలో తెలంగాణ గెలుపొందగా, మహారాష్ట్ర-చత్తీస్‌ఘర్, పంజాబ్-యూపి జట్ల మధ్య హోరాహోరిగా పోటీ సాగింది. కబడ్డీ పోటీలను తిలకించేందుకు పట్టణ వాసులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అయితే బారికేడ్లు దాటి మైదానంలోకి వచ్చి పోటీలు చూస్తుండటంతో క్రీడాకారులకు ఇబ్బందికరంగా మారగా వారిని నియంత్రించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టకపోవడం, క్రీడాకారులకు డ్రెస్సింగ్ రూమ్, ఇతర సదుపాయలు సక్రమంగా కల్పించకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి.
సెమీస్‌కు చేరిన కబడ్డీ పోటీలు
నల్లగొండ రూరల్, డిసెంబర్ 26 : 62వ జాతీయ పాఠశాల అండర్-17 కబడ్డీ ఛాంపియన్‌షిప్ పోటీలు సెమీస్ దశకు చేరుకున్నాయి. మూడవ రోజు సోమవారం జరిగిన క్వార్టర్స్ ఫైనల్స్ బాలుర విభాగంలో పంజాబ్‌జట్టు మహారాష్టప్రై, గుజరాత్ జట్టు విద్యాభారతిపై విజయం సాధించి సెమీ ఫైనల్‌కు చేరాయి. బాలికల విభాగంలో ఢిల్లీ జట్టు తెలంగాణపై, హరియానా జట్టు మధ్యప్రదేశ్‌పై విజయం సాధించి సెమీస్‌కు చేరాయి. నేడు సాయంత్రం సెమీఫైనల్ పోటీలు నిర్వహించనున్నారు. ఫైనల్ మ్యాచ్‌లు ఈనెల 28వ తేదీన జరుగుతాయి. ఈ పోటీలను డిఈఓ చంద్రమోహన్,క్రీడల ఆర్గనైజింగ్ సెక్రెటరీ కుంభం నర్సిరెడ్డి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి పుల్లయ్య, వైస్ కన్వీనర్ కే.శివకుమార్‌లు పర్యవేక్షిస్తున్నారు.