నల్గొండ

రేషన్ బియ్యం స్వాధీనం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, డిసెంబర్ 31: దేవరకొండ మండలం మైనంపల్లి గ్రామపంచాయతి పరిధి లోని బ్రిడ్జితండా లో శుక్రవారం రాత్రి డిఎస్‌వో పట్టుకున్న రేషన్‌బియ్యాన్ని శనివారం సివిల్‌సప్లై టాస్క్ఫోర్స్ ప్రత్యేక అధికారి రాజేశ్ పరిశీలించారు. మొదట ఆయన దేవరకొండ పట్టణం లోని సివిల్‌సప్లై గోదాంను పరిశీలించారు. గోదాం ఇన్‌చార్జ్ చంద్రయ్యతో మాట్లాడి గోదాంలో బియ్యం స్టాక్ ఎంత ఉంది అని అడిగి తెలుసుకున్నారు. గోదాం లో ఉన్న స్టాక్ రిజిస్టర్‌ను పరిశీలించారు. బియ్యాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు స్టాక్ చేసిన దేవరకొండ పట్టణానికి చెందిన వ్యాపారి వెంకట్‌రాం పై క్రిమినల్ కేసును నమోదు చేస్తున్నట్లు రాజేశ్ చెప్పారు. అనంతరం బ్రిడ్జితండాకు వెళ్ళి శుక్రవారం రాత్రి అధికారులు పట్టుకున్న రేషన్ బియ్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రత్యేక అధికారి రాజేశ్ మాట్లాడుతూ సివిల్‌సప్లై కమీషనర్ సివి ఆనంద్, పౌరసరఫరాల శాఖ మంత్రి పేషీకి వచ్చిన ఫిర్యాదుల మేరకు గత పదిహేను రోజులుగా దేవరకొండ లో సివిల్‌సప్లై అధికారులతో నిఘాను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి దేవరకొండ మండలం బ్రిడ్జితండాలో అక్రమ రవాణా చేసేందుకు సిద్దంగా ఉన్న 357 బస్తాల రేషన్‌బియ్యం, డిండి మండలం చెర్కుపల్లి గ్రామపంచాయతి పరిధి లోని కుందేలుబాయి తండాలో నిల్వ ఉంచిన 380 బస్తాల రేషన్‌బియ్యాన్ని దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. పట్టుకున్న బియ్యం నిలువలు దాదాపు 400 క్వింటాళ్ళ

నగదు రహితంలో
ఆదర్శంగా నిలుద్దాం
* ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి

నల్లగొండ, డిసెంబర్ 31: నగదు రహిత లావాదేవిల్లో గుండ్లపల్లి గ్రామస్తులు ఆదర్శంగా నిలువాలని వెంటనే ఈ ప్రక్రియపై అవగాహాన పెంచుకోవాలని జిల్లా ఎస్పీ ఎన్. ప్రకాశ్‌రెడ్డి కోరారు. శనివారం గుండ్లపల్లి గ్రామస్తులతో నిర్వహించిన నగదురహిత అవగాహాన సదస్సులో ఆయన మాట్లాడుతు బ్యాంకు అకౌంట్లు లేని 30 శాతం మంది గ్రామస్తులు వెంటనే అకౌంట్లు తెరువాలన్నారు.
20 మంది ఆధార్‌కార్డులుకూడా లేవని సర్వేలో గుర్తించామన్నారు. వారికి ఆధార్‌కార్డులు అందిస్తామన్నారు. గ్రామానికి కావాల్సిన వసతులపై కలెక్టర్‌కు నివేదిక అందిస్తామన్నారు. మొబైల్, నెట్ బ్యాంకింగ్, క్యాష్‌లెస్ లావాదేవిలపై అందరు అవగాహాన పెంచుకుని నగదురహిత గ్రామంగా మార్చే విధంగా కృషి చేయాలన్నారు. గ్రామంలోని గ్రంథాలయానికి 5 వేల రూపాయలు పోలీస్ పునర్వాస్ పథకం కింద విరాళంగా అందించారు.వరకు ఉంటుందని ఆయన చెప్పారు. దేవరకొండ ప్రాంతానికి చెందిన ఓ రాజకీయనాయకుని అండతో యదేశ్చగా రేషన్‌బియ్యం వ్యాపారం కొనసాగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని రాజేశ్ చెప్పారు. పట్టుకున్న బియ్యం ప్రభుత్వం సరఫరా చేసిన బియ్యం సంచుల్లోనే ఉన్నాయని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు తాము అనేక దాడుల్లో పట్టుకున్న బియ్యం వేరే సంచుల్లో ఉండగా పట్టుబడ్డాయని దేవరకొండ ప్రాంతంలో పట్టుబడ్డ బియ్యం నేరుగా గోదాముల్లోకి పంపించే సంచుల్లోనే పట్టుబడడం చూస్తుంటే ఈ ప్రాంతంలో రేషన్‌బియ్యం అక్రమ వ్యాపారం ఏ స్ధాయిలో ఉందో అర్ధం అవుతోందన్నారు. పేదలకు పంచాల్సిన రేషన్‌బియ్యాన్ని కొంత మంది వ్యాపారులు కొనుగోలు చేసి మిల్లర్లకు సరఫరా చేస్తున్నారని మిల్లర్లు ఇవే బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి ప్రభుత్వానికి తిరిగి అమ్ముతున్నారని ఈ క్రమంలో లక్షల రూపాయలను వ్యాపారులు దండుకుంటున్నారని ఆయన తెలిపారు. దేవరకొండ, హాలియా లతో పాటు జిల్లా సరిహద్దుల్లోని కల్వకుర్తి, జడ్చర్ల ప్రాంతాల్లోని మిల్లులకు రేషన్‌బియ్యం ఎక్కువగా అక్రమ రవాణా జరుగుతోందని తమ దృష్టికి వచ్చిందని సివిల్‌సప్లై టాస్క్ఫోర్స్ ప్రత్యేక అధికారి రాజేశ్ చెప్పారు. ఈ ప్రాంతాలపై కూడా తాము నిఘా పెట్టామని ఆయన తెలిపారు. దేవరకొండ, డిండి మండలాల్లో పట్టుబడ్డ బియ్యం సివిల్‌సప్లై గోదాం నుండే నేరుగా ఇక్కడికి చేరుకున్నాయా లేక డీలర్ల నుండి సేకరించారా అన్ని విషయమై పూర్తిగా విచారణ చేసి కమీషనర్‌కు నివేదిక అందజేస్తామని రాజేశ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో డి ఎస్‌వో ఉదయ్‌కుమార్, సివిల్‌సప్లై అధికారులు విద్యాసాగర్‌రెడ్డి, దేవరకొండ తహశీల్దార్ గణేశ్ పాల్గొన్నారు.

ధాన్యం సేకరణలో ముందంజ

నల్లగొండ, డిసెంబర్ 31: జిల్లాల పునర్ వ్యవస్థీకరణ పిదప చిన్న జిల్లాల్లో పరిపాలన పారంగా పలు శాఖలు మెరుగైన ఫలితాలు అందుకుంటుండగా ఈ దిశలో పౌరసరఫరాల శాఖ ముందంజలో ఉంది. ఖరీఫ్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాగుతుండగానే పెద్దనోట్ల రద్ధు దెబ్బకు మిల్లర్లు, కమిషన్ వ్యాపారులు ధాన్యం కొనుగోలులో వెనుకడుగు వేసిన నేపధ్యంలో ఆందోళనకు గురైన రైతాంగానికి అండగా మేమున్నామంటు ఐకెపి, పిఏసిఎస్ కేంద్రాల ద్వారా జిల్లాల్లో పౌరసరఫరాల సంస్థ ధాన్యం కొనుగోలు సాగించింది. ఆన్‌లైన్‌లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు చెల్లించింది. విత్‌డ్రా సందర్భంగా రైతులకు కావాల్సిన మొత్తం బ్యాంకర్లు ఇవ్వని సమస్య అటుంచితే ధాన్యం కొనుగోలు, చెల్లింపుల సమస్యలు లేకుండా మాత్రం రైతులకు పౌరసరఫరాల సంస్థ అండగా నిలబడిన తీరు ప్రభుత్వ రంగ సంస్థల ప్రాధాన్యతను చాటినట్లయింది. నల్లగొండ జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 55ఐకెపి, పిఏసిఎస్ కేంద్రాల ద్వారా 9,269మంది రైతుల నుండి 61కోట్ల 42లక్షల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందులో మరో 162మంది రైతులకు 21లక్ష 80వేలు మాత్రమే చెల్లించాల్సివుంది. ఖరీఫ్ ధాన్యం మార్కెట్‌కు రావడం తుది దశకు చేరడంతో జనవరి 5వ తేదిలో కొనుగోలు ప్రక్రియను నిలిపివేస్తున్నారు. మరోవైపు జిల్లాలో ఐకెపి సంఘాలకు ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించి చెల్లించాల్సిన కమిషన్ గత రబీ బకాయిలు 7కోట్లను విడుదల చేస్తు ఉత్తర్వులు జారీ చేయడం సంఘాలకు ఊరటనిచ్చింది. ఈ ఖరీఫ్ కమిషన్ 1కోటి 57లక్షల బకాయిలే వారికి చెల్లించాల్సివుంది. కాగా జిల్లాలో ముందెన్నడు లేని రీతిలో ఈ దఫా కస్టమ్ మిల్లింగ్ కూడా గడువుకు ముందే 90శాతంకు పైగా పూర్తవ్వడం విశేషం. పౌరసరఫరాల సంస్థ రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లర్లకు ధాన్యం అప్పగిస్తుండగా ఎప్పుడు 15రోజుల గడువులోగా తిరిగి మిల్లర్లు బియ్యం ఇవ్వకపోవడం మరోసీజన్ ధాన్యం వచ్చేదాకా బియ్యాన్ని తమవద్ధ ఉంచుకుంటు సొంత వ్యాపారాలు చేసుకోవడం సమస్యగా తయారైంది. అందుకు భిన్నంగా ఈ దఫా ఖరీఫ్ ధాన్యం కస్టమ్ మిల్లింగ్‌లో నల్లగొండ జిల్లా యంత్రాంగం మిల్లర్ల వెంట పడి గడువుకు ముందే లక్ష్యాన్ని అందుకుంది.

నగదు రహితంలో పేట ప్రథమ స్థానం
* కలెక్టర్ సురేంద్రమోహన్
సూర్యాపేట, డిసెంబర్ 31: నగదు రహిత లావాదేవీల నిర్వహణలో సూర్యాపేట జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచినట్లు జిల్లా కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్ తెలిపారు. ఈ మేరకు ఐటిశాఖ నుండి సమాచారం అందిందని పేర్కొన్నారు. జిల్లాలో తొలి డిజిటల్ గ్రామంగా ఆవిర్భావిస్తున్న సూర్యాపేట మండలపరిధిలోని గాంధీనగర్ గ్రామాన్ని శనివారం సందర్శించారు. చౌక ధరల దుకాణం, కిరాణా దుకాణాల్లో పేటియం వాడకాన్ని పరిశీలించారు. కొత్తగా మంజూరీచేసిన డెబిట్ కార్డులను ఖాతాదారులకు పంపిణిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలపై అవగాహన కార్యక్రమాల్లో భాగస్వామ్యులైన అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రి, ఎంపి, ఎమ్మెల్యేల
నూతన సంవత్సర శుభాకాంక్షలు
నల్లగొండ టౌన్, డిసెంబర్ 31: రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి జి.జగదీష్‌రెడ్డి నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. స్వరాష్ట్రంలో సుపరిపాలన జరుపుకుంటున్న మనం సాధించుకున్న విజయం విద్యుత్ సరఫరా అని తెలిపారు. సి ఎం కెసి ఆర్ పరిపాలన నూతన రాష్ట్రంలో బంగారు తెలంగాణ సాధనే దిశగా ముందడుగు వేసేందుకు జిల్లా ప్రజలంతా సహాకరించాలని కోరారు. స్వరాష్ట్రంలో నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో దేశం, రాష్ట్రం, ఉమ్మడి జిల్లా అభివృద్ది పథంలో సాగాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేరి సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. కాగా నూతన సంవత్సరం ప్రజల ఆకాంక్షలు నేరవేర్చి వారి జీవితాల్లో సంతోషం నింపాలని సిఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆకాంక్షిస్తూ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

కమ్మేసిన మంచు
చౌటుప్పల్, డిసెంబర్ 31: చౌటుప్పల్ మండలాన్ని శనివారం తెల్లవారుజామున మంచు కమ్మేసింది. సూర్యుడు ఉదయించకుండా మంచు దట్టంగా కురిసింది. వర్షాన్ని తలపించే విధంగా మంచు కురియడంతో ప్రజలు ఉదయం 9.00 గంటల వరకు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. బయటకు వస్తే రెయిన్ కోట్‌లు వేసుకోవడం, గొడుగులు పట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్లు, ద్విచక్ర వాహనాలు హైవేపై వెళ్లలేక పక్కన ఆపుకోవలసి వచ్చింది. పెద్ద వాహనాలకు లైట్లు వేసుకున్న రోడ్డు కనిపించకుండా మంచు కమ్ముకుపోవడంతో రెండు గంటల పాటు ఉక్కిరిబిక్కిరయ్యారు. మంచుతో పాటు చలి తీవ్రత కూడా అధికంగా ఉండటంతో ప్రజలు వణికిపోయారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆరబోసిన ధాన్యంపై మంచు కురియడంతో రైతులు పాలితిన్ కవర్లను కప్పుకున్నారు. ఉదయం తొమ్మిది గంటల తర్వాత క్రమంగా మంచు తొలగడంతో ప్రజలు ఊపిరి పీల్చుకోని రోడ్డెక్కారు.
మంచం పట్టిన మార్తవారిగూడెం
* ప్రబలిన విష జ్వరాలు
* 16 మంది ఆసుపత్రి పాలు
* గ్రామాన్ని సందర్శించిన ఆర్డీవో
కట్టంగూర్, డిసెంబర్ 31: అపరిశుభ్రం కారణంగా మండలంలోని అయిటిపాముల గ్రామపంచాయతీ పరిధిలోని మార్తవారిగూడెంలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. ఆరుబయట మలవిసర్జన, కలుషిత నీటి కారణంగా గత నెలరోజులుగా గ్రామస్తులకు జ్వరాలు సోకుతూ ఆసుపత్రుల పాలవుతున్నారు. గత వారంరోజులుగా విషజ్వరాలు తీవ్రం కావడంతో 16మంది గ్రామస్తులు మంచం పట్టారు. వీరిని కుటుంబసభ్యులు నల్లగొండ జిల్లాకేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఐసియూలో చికిత్స అందిస్తుండగా మిగిలిన వారు ఆసుప్రతిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఐదుగురికి జ్వరాలు తగ్గడంతో శనివారం గ్రామానికి చేరుకున్నారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే విషజ్వరాలు సోకి నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న వారిని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని, గ్రామంలో పారిశుద్ద్య చర్యలను చేపట్టాలని ఆదేశించారు. దీంతో నల్లగొండ ఆర్డీవో ఇ.వెంకటాచారి, జిల్లా వైద్యాఆరోగ్యశాఖాధికారి డాక్టర్ భానుప్రసాద్ నాయక్, జిల్లా పంచాయతీ అధికారి పటోళ్ల ప్రభాకర్‌రెడ్డిలు గ్రామంలో పర్యటించారు. గ్రామంలో ఉన్న అన్ని ఇండ్లలోకి వెళ్లి నీటి సంపులను పరిశీలించగా సంపులు శుభ్రంగా లేకపోవడాన్ని గమనించి తక్షణమే అన్ని ఇండ్లలోని నీటిసంపులను పరిశుభ్రం చేయాలని ఆదేశించారు. గ్రామంలో మొత్తం 64 నివాసగృహాలుండగా 29మందికే వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్నాయని, మరుగుదోడ్లు ఉన్నవారు సైతం వాటిని ఉపయోగించుకోకుండా ఆరుబయటే మలవిసర్జన చేస్తుండటంతో ఆపరిశుభ్రత కారణంగా నెలరోజులుగా విషజ్వరాలు వ్యాప్తి చెందుతున్నట్లు చెప్పారు. గ్రామంలోని వీధులు, మురికికాల్వలను తక్షణమే శుభ్రం చేయించారు. గ్రామంలో జ్వరాలు వ్యాప్తి చెందుతుండటం వల్ల గత నెలరోజులుగా వైద్యశిభిరం నిర్వహించడం జరుగుతుందని డిఎంహెచ్‌వో తెలిపారు. గ్రామంలో పారిశుద్ద్యాన్ని మెరుగుపర్చడంతో పాటు అన్ని నివాసగృహాల్లో నీటిసంపులను శుభ్రం చేయిస్తున్నామని ఈ సందర్భంగా ఆర్డీవో తెలిపారు. అదేవిధంగా గ్రామంలోని నీటిట్యాంకులన్నింటిని క్లోరినేషన్ చేస్తున్నట్లు చెప్పారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదోడ్లు నిర్మించుకోవాలని, ఇందుకు తక్షణమే నిథులు మంజూరీ చేస్తున్నట్లు తెలిపారు. మరుగుదొడ్లు ఉన్నవారు వాటిని సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. గ్రామంలో జ్వరాలు ప్రభలకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని అన్నారు. వారి వెంట ఆర్‌డబ్ల్యుఎస్ ఈఈ పాపారావు, ఎంపిడివో గోన మోహన్‌రావు, డిటి వెంకటరమణ, మండల వైద్యాధికారి డాక్టర్ లోకసాని వేణుగోపాల్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్ ఎఇ నిహారిక, గ్రామ సర్పంచ్ పెద్ది మంగమ్మచుక్కయ్య, వైస్ ఎంపిపి బోడ్డుపల్లి జానయ్య పాల్గొన్నారు.
కస్తూర్బా పాఠశాల సిబ్బందిపై వేటు..
ఇద్దరు అధికారుల సస్పెన్షన్

నల్లగొండ, డిసెంబర్ 31: జిల్లాలోని శాలిగౌరారం కస్తూరిభా పాఠశాల ప్రత్యేక అధికారి విజయలక్ష్మీ, అకౌంటెంట్ అరుణలను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు డిఈఒ చంద్రమోహన్ తెలిపారు. పాఠశాల సిబ్బంది అక్రమాలపై అందిన ఫిర్యాదుల మేరకు శనివారం స్వయంగా పాఠశాలను సందర్శించిన కలెక్టర్ విద్యార్ధులతో చర్చించిన పిదప ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లుగా డిఈఒ తెలిపారు.
అభివృద్ధి బాటలో సాగాలి
* కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో కలెక్టర్, ఎమ్మెల్యేలు

నల్లగొండ, డిసెంబర్ 31: ప్రభుత్వ సంక్షేమ పథకాల సహాయంతో అభివృద్ది చెందేందుకు ప్రజలు ప్రయత్నించాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. శనివారం శాలిగౌరారం మండల కేంద్రంలో నిర్వహించిన కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ సమావేశంలో ఆయన స్థానిక తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌తో పాటు హాజరై 43మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతు శాలిగౌరారం మండలం సమగ్రాభివృద్ధికి ప్రభుత్వ పరంగా కృషి చేస్తామన్నారు. మండల అభివృద్ధి, సమస్యలపై అవసరమైన ప్రణాళికలు రూపొందించి జిల్లా ప్రణాళికలో పొందుపరుస్తామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో, పాఠశాలల్లో వౌలిక సదుపాయల కల్పనకు, పంచాయతీల వారిగా ప్రణాళికలు తయారుచేస్తామన్నారు. ఎమ్మెల్యే గాదరి కిషోర్ మాట్లాడుతు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వ సహకారంతో ముందడుగువేస్తున్నామన్నారు. నిరుపేద కుటుంబాల ఆడపిల్లల సంక్షేమానికి సీఎం కెసిఆర్ కల్యాణలక్ష్మి పథకం అమలు చేస్తున్నారన్నారు. మండల రైతులకు సాగునీరందించే ఆసఫ్‌నహర్ కాలువ మరమ్మతులకు 10కోట్లు మంజూరు చేయించామన్నారు.

కలెక్టర్ పాఠశాలల తనిఖీ

నల్లగొండ, డిసెంబర్ 31: శాలిగౌరారం మండలం బచ్చువారిగూడెం పాఠశాల భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. శుక్రవారం పాఠశాలను సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు. గతంలో పాఠశాల నిధులు మంజూరైన స్థలం లేక భవనం నిర్మించలేకపోయామని, స్థలం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని గ్రామస్తులు తెలిపారు. పాఠశాలలో వసతులు లేక విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు వెలుతున్నారని తెలిపారు. ఆసుపత్రికి వెళ్లాలంటే సరైన రోడ్లు లేక, తాగునీటి చేతి పంపులు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతు అక్కడి నుండి డిఈవో చంద్రమోహన్‌తో మాట్లడి నిధులున్నందునా తాత్కాలికంగా షెడ్‌కు, భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. విద్యార్థుల సంఖ్యను పెంచాలని సూచించారు.
బిటి రోడ్డు ప్రతిపాదనలు అందించాలని, హ్యాండ్ పంప్స్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం శాలిగౌరారం కస్తూరిభా పాఠశాలను కలెక్టర్ ఉప్పల్ సందర్శించారు. మధ్యాహ్నా భోజనం వంటకాలను పరిశీలించి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వంట మనిషి, పాఠశాల ఎస్‌వో సరుకులను తరలిస్తున్నారన్న ఆరోపణలున్నాయని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
నూతన సంవత్సర వేడుకలకు
ముస్తాబైన యాదాద్రి
యాగిరిగుట్ట,డిసెంబర్ 31:మహిమాన్విత క్షేత్రం యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం 2017 వేడుకలకు అదికార్లు పెద్ద ఎత్తున ముందస్తు చేపట్టారు.రంగు రంగుల విద్ద్యుత్ ద్దీపాలు,రక రకాల పూలమాలలతో యాదాద్రి నూతన శోభను సంతరించుకుంది. కొండపైన ఎటు చూసినా పండుగ వాతావరణం కనిపిస్తుంది. శ్రీ వారి ప్రసాదాలను భక్తుల కోసం పెద్ద ఎత్తున సిద్దం చేశారు.స్వామి వారి ఆలయాన్ని తెల్లవారు జామున 3 గంటలకే తెరుస్తున్నారు. సుప్రభాతం, ఆరాధన, బాలబోగం, తిరుప్పావై అనంతరం ఉదయం 5 నుండి 7.30 గంటల వరకు సర్వదర్శనాలకు అనుమతిస్తామని దేవస్ధానం కార్యనిర్వహణాధికారి ఎన్.గీత తెలిపారు. ఉదయం 7.30 నుండి 8.15 వరకు నిజాభిషేఖం, 8.15 నుండి 9.00 వరకు అర్చన, 9.00 నుండి భక్తులకు దర్శనం అనుమతిస్తారు.

యాదాద్రిలో మోదీ సలహాదారు పూజలు
యాదగిరిగుట్ట, డిసెంబర్ 31: యాదాద్రి క్షేత్రాన్ని భారత ప్రధాని మోడి సలహాదారు రాజేశ్వర్ ప్రసాద్ శనివారం సందర్శించారు. దైవ దర్శణం చేసుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారులు ఆయనకు స్వామి ఆశీస్సులు అందజేశారు. దేవస్ధానం కార్యనిర్వహనాధికారి ఎన్.గీత ఆయనకు స్వామి వారి ప్రసాదాలు అందజేశారు.