నల్గొండ

రైతులను దగా చేస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కనగల్, జనవరి 1: రైతులను టి ఆర్ ఎస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మండలంలోని పగిడిమర్రి గ్రామంలో మాజీసర్పంచ్ అంజిరెడ్డి జ్ఞాపకార్థంగా విగ్రహాన్ని, బస్‌స్టేషన్‌ను ప్రారంభించి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ గతంలో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు పర్చి ప్రజలకు సుపరిపాలన అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. తెలంగాణ ప్రజల కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి అధికారం చేపట్టిన టి ఆర్ ఎస్ పార్టీ ప్రజలకు హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ఏ పథకం కూడా పూర్తిస్ధాయిలో అమలు చేయడంలేదని, ప్రచార ఆర్భాటం చేస్తుందే తప్పా హామీలను అమలు చేయడంలేదని ఆయన ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగిపోయారని, రానున్న 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కనగల్ జెడ్పిటిసి శ్రీనివాస్‌గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భిక్షంయాదవ్, సర్పంచ్ సుంకిరెడ్డి జగాల్‌రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రిలో పూజలు
యాదగిరిగుట్ట, జనవరి 1: యాదాద్రి శ్రీ లక్ష్మినర్సింహ్మస్వామి దేవాలయాన్ని నూతన సంవత్సరం పురస్కరించుకొని ఆదివారం ప్రముఖులు సందర్శించారు.కుకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం క్రిష్ణారావు,మహేశ్వరం ఎమ్మెల్యే తీగల క్రిష్ణారెడ్డి,మాజి మంత్రి మోత్కుపల్లి నర్సింహులు,ఎర్రబెల్లి దయాకర్ రావు వేరు వేరుగా ఆదివారం స్వామి వారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.
వాహనదారుల ఇక్కట్లు..
కొండకింద రోడ్డు విస్తరణ పనులు అస్త వ్యస్తంగా కొనసాగుతుండటంతో భక్తులు ప్రమాదాల భారిన పడుతున్నారు. అనేక మంది భక్తులు గాయాల పాలవుతున్నారు. రోడ్డు మధ్యలో నుండి ఒక్కో వైపు 28్ఫట్ల వెడల్పుతో బిటి రోడ్ వేయాల్సి ఉండగా 28 ఫీట్ల వెడల్పు తో కొన్ని చోట్ల మరికొన్ని చోట్ల 15 ఫీట్ల వెడల్పుతో బిటి రోడ్డు వేయడంతో రోడ్డు ఇరుకుగా ఉండి వాహనదారులు ప్రమాదాలకు గురువుతున్నారు.