నల్గొండ

ఆనందోత్సాహంతో నూతన సంవత్సర సంబురం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 1: నూతన సంవత్సరం 2017వేడుకలను నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాల ప్రజలు సంబరంగా జరుపుకున్నారు. శనివారం రాత్రి నుండి ఆరంభమైన వేడుకలు ఆదివారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి. నూతన సంవత్సరం తొలి రోజు ఆదివారం విద్యార్థులు, ప్రజలు,ప్రజాప్రతినిధులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయాలు కిటకిటలాడాయి. సూర్యాపేట, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి జి.జగదీష్‌రెడ్డి, కలెక్టర్‌లు గౌరవ్ ఉప్పల్, సురేంద్రమోహన్‌లు పాల్గొనగా వారికి అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. భువనగిరిలో కలెక్టర్ అనితారామచంద్రన్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిలు వేడుకల్లో పాల్గొనగా అధికారులు, నాయకులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో జనమైత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ఫ్లోరైడ్ బాధితులు, దివ్యాంగులకు ఎస్పీ ఎన్. ప్రకాశ్‌రెడ్డి నూతన వస్త్రాలు, స్వీట్లు అందించారు.
పెండింగ్ కేసులు పరిష్కరించాలి
* అదనపు జిల్లా జడ్జి సునీత
నల్లగొండ లీగల్, జనవరి 1: జిల్లాలోని వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయవాదులు సహకరించాలని అదనపు జిల్లా జడ్జి ఎంఆర్.సునిత అన్నారు. ఆదివారం నల్లగొండ బార్ అసొసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, అన్ని రకాల సివిల్ కేసులను కక్షిదారుల సమ్మతి మేరకు లోక్‌అదాలత్ రాజీ కుదిర్చేందుకు న్యాయవాదులు చొరవ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అసొసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కల్లూరి యాదయ్య, కొండ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మిర్యాల లెనిన్‌బాబు, గ్రంథాలయ కార్యదర్శి ఎన్. భీమార్జున్‌రెడ్డి, న్యాయవాదులు గోలి అమరేందర్‌రెడ్డి, పి.శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.
పంటలు బాగా పండాలి
* నూతన సంవత్సర వేడుకలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతీరెడ్డి
హుజూర్‌నగర్, జనవరి 1: ఆదివారం హుజూర్‌నరగ్‌లో జరిగిన నూతన సంవత్సరం ఉత్సవాలలో కోదాడ ఎంయల్‌ఏ యన్ పద్మావతీ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి చిన్న పిల్లలకు, కాంగ్రెసు పార్టీ కార్యకర్తలకు పంచిపెట్టాను. హుజూర్‌నగర్‌లో గల స్థానిక ఎంయల్‌ఏ, టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నివాసంలో ఆమె 2017 సంవత్సరపు కేక్ కట్ చేసి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. నాగార్జునసాగర్ ఎడమల కాలువ ద్వారా నీరు సరఫరా సక్రమంగా జరిగి వేసంగి పంటలు బాగా పండాలని భగవంతున్ని ప్రార్దించినట్లు చెప్పారు. అనంతరం పట్టణంలోని పలు విద్యా సంస్థలలో, కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పద్మావతీరెడ్డి కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు.
కరెన్సీ ఇక్కట్లపై దశలవారీ ఆందోళన
* పిసిసి అధ్యక్షుడు ఉత్తంకుమార్‌రెడ్డి
మిర్యాలగూడ, జనవరి 1: కేంద్ర ప్రభుత్వం 500, 1,000 నోట్ల రద్దు అనంతరం ప్రజలు పడ్తున్న బాధలను నివారించాలని, ప్రత్యామ్నాయ మార్గాలను చూపాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళన చేయనున్నామని టిపిసిసి అధ్యక్షుడు ఎన్.ఉత్తంకుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక ఎన్‌విఆర్ ఫంక్షన్‌హాలులో టిఆర్‌ఎస్ నుండి దామరచర్ల జడ్పిటిసి కె.శంకర్‌నాయక్‌లు చేరే సభలో ఆయన మాట్లాడుతూ రద్దు అనంతరం ఆర్ధిక మంత్రి 2 వారాల్లో పరిస్థితులు చక్కబడతాయని, ప్రధాన మంత్రి మోడి 50 రోజుల్లో చక్కబడ్తాయన్నారని, నేడు 51 రోజులైన చక్కబడలేదని ఆయన అన్నారు. అదే విధంగా శనివారం చేసిన మన్‌కీబాత్‌లో జన్‌కీ బాత్ లేనే లేదని ఆరోపించారు. నోట్ల రద్దు అనంతరం రాష్ట్రాలకు ఆదాయం తగ్గిందని చిన్న రైతులు, వ్యాపారులు రోడ్డున పడ్డారని ఆయన అన్నారు. రబీలో ఇబ్బంది పడ్డ రైతులకు 20 శాతం సబ్సిడి ఇవ్వాలని ఆయన కోరారు. నోట్ల రద్దు తర్వాత ఇక్కట్లను తీర్చాలని కోరుతూ ఈ నెల 6,7న జిల్లా కలెక్టరేట్‌ల ముట్టడి, 9న మహిళల నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని, అదే విధంగా 11న డిల్లీలో ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాందీతో ప్రజాప్రతినిధులతో సమావేశం ఉంటుందని అనంతరం దేశవ్యాప్త ఆందోళన చేపడ్తామని ఆయన అన్నారు. కేంద్రంలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఇలా ఉంటే రాష్ట్రంలో ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయని ప్రభుత్వం ఉందని తగు రీతిలో పార్టీని బలోపేతం చేసి 2019లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఆయన అన్నారు. సమావేశంలో సిఎల్‌పి నాయకులు కె.జానారెడ్డి, మాజీ మండలి చీఫ్ విప్ భారతిబాయి రాగ్యానాయక్, నాయకులు డి.స్కైలాబ్‌నాయక్ పాల్గొన్నారు.