నల్గొండ

పార్టీ బలోపేతానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మునుగోడు, జనవరి 2: గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలోపితానికి కార్యకర్తలు కృషి చేయాలని నల్లగొండ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని చల్మడ గ్రామంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు వేమిరెడ్డి జితేందర్‌రెడ్డి ఆద్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలకు ఆయన ముఖ్య అతిదిగా హజరైయ్యారు. ఈ సందర్బంగా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాను అవిష్కరించి రాజీవ్‌గాంధీకి విగ్రహానికి పూల మాల వేసి అనంతరం కేక్ కోసి నాయకులకు తినిపించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. పులిపలుపుల గ్రామంలోని ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రత్తుపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాను అవిష్కరించి పలు అబివృద్ది పనులకు శంఖుస్థాపన చేశారు. గ్రామంలో పలువురి పించన్ రావడంలేదని ఆయన దృష్ఠి తీసుకెళ్ళారు. వెంటనే పోన్ ద్వారా అదికారులతో మాట్లాడారు. గ్రామాలలో అర్హులైన వారికి పించన్ ఇవ్వకపోవడంతో ఇబ్బందులకు గురౌతున్నారని అన్నారు. అధికారులు అదార్ కార్డు, రెషన్‌కార్డులో వయస్సు కాకుండా మనుషులను చూసి పించన్ మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి అధికార ప్రతినిధి పున్న కైలాస్‌నేత, జెడ్పీటిసి జాజుల అంజయ్యగౌడ్, జిల్లా నాయకులు నన్నూరి విష్ణువర్ధన్‌రెడ్డి, పాల్వాయి రాంరెడ్డి, కాంగ్రెస్ జిల్లా మహిళ ఉపాధ్యక్షురాలు ముంగి చంద్రకళ, ఎంపిటిసి పందుల భాస్కర్, నకరకంటి స్వామిగౌడ్, సర్పంచులు మాదగోని రాజేష్‌గౌడ్, కంభంపాటి వెంకటయ్య, యువజన నాయకులు పాల్వాయి జితేందర్‌రెడ్డి, జంగిలి నాగరాజు, బీసం విజయ్,నాయకులు కర్నాటి రామకృష్ణ, కొంక రాజు, గాదేపాక యాదయ్య, మాదగోని బిక్ష్మం, బాతరాజు సత్తయ్య, ఐతరాజు వెంకటేష్, దోటి నారాయణ, తదితరులు పాల్గోన్నారు.

మెరుగైన సేవలు అందించాలి
* కలెక్టర్ గౌరవ్ ఉప్పల్
నల్లగొండ టౌన్, జనవరి 2: మున్సిపల్ పరిధిలోని ప్రజలందరికీ మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. సోమవారం మున్సిపాలిటీలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రజావాణి ద్వారా వచ్చిన అర్జీలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియను సైతం ప్రారంభించి మాట్లాడారు. పట్టణ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వీధిలైట్లు, డ్రైనేజీ, తాగునీటి వసతులను మెరుగు పర్చేందుకు మున్సిపల్ సిబ్బంది మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు. మున్సిపాలిటీ పరిధిలో ఏయే సమస్యలు ఉన్నాయో అందరికీ తెలిసినా అధికారుల స్పందనలో అలసత్వం కనబడుతుందని, ఇప్పటి నుండి ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా పరిష్కరించాలని కోరారు.