నల్గొండ

ప్రభుత్వ శాఖల్లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, జనవరి 5: వివిధ ప్రభుత్వ శాఖల్లో కంప్యూటర్ ఆపరేటర్ కమ్ జూనియర్ అసిస్టెంట్‌గా ఔట్‌సోర్సింగ్ పద్దతిన పనిచేయుటకు అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకోవాలని రామగిరి ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకులు కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏదేని డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ పిజిడిసిఏ కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చని, వివరాలకు నల్లగొండ ఔట్‌సోర్సింగ్ ఏజె న్సీ రామగిరి సెల్‌నెంబర్ 9440137115ను సంప్రదించాలని తెలిపారు.
8న సాగర్‌కు భూటాన్ రాణి రాక
నాగార్జునసాగర్, జనవరి 5: భూటాన్ రాణి, తారాయణ ఫౌండేషన్ అధ్యక్షురాలు అషీ దోర్జి వాంగ్‌మో వాంగ్‌చుక్ పది మంది సభ్యుల బృందంతో నాగార్జు నకొండను ఈనెల 8న సందర్శించనున్నారు. అధికార యంత్రాంగం ఆమె పర్యటనకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేపట్టింది.
ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో తరగతుల బహిష్కరణ
ఆలేరు, జనవరి 5: ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు గురువారం మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు వృత్తివిద్య తరగతులను ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో గురువారం బహిష్కరించారు. ఎన్‌ఎస్ యూఐ మండల అధ్యక్షులు పల్లె సంతోష్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం వి ద్యార్ధుల ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో పేద విద్యార్ధులు విద్యను అభ్యసించడం మానుకునే ప్రయత్నంలో ఉన్నారన్నారు. ప్ర భుత్వం బకాయిలుచెల్లించేవరకు సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. ప్రభుత్వం మొండివైఖరికి నిరసనగా తరగతులను బహిష్కరిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు కిరణ్‌కుమార్, అజయ్‌కుమార్, అక్బర్, రమేష్, రాజేశ్, తదితరులు పాల్గొన్నారు.
విఆర్‌ఏలకు కనీస వేతనాలు అమలుచేయాలి
ఆలేరు, జనవరి 5: రెవెన్యూశాఖలో పనిచేస్తున్న విఆర్‌ఏలకు రూ. 15 వేలు ఇవ్వాలని విఆర్‌ఏ సంఘ నియోజకవర్గ అధ్యక్షులు గుర్రాల బాలకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం స్ధానిక టిఎన్‌జిఒస్ కార్యాలయంలో జరిగిన సంఘ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ విఆర్‌ఏలకు ఇచ్చే వేతనాలు 010 పద్దు కింద చెల్లించాలన్నారు. గత మూడు సంవత్సరాలుగా 010 పద్దు కింద వేతనాలు రాక విఆర్‌ఏలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో విఆర్‌ఏలకు పదోన్నతులు కల్పించాలని, వేతనాలు పెంచాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు యాదగిరి, ఉప్పల య్య, చక్రపాణి, అనిల్, లక్ష్మీ, సంతోష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
సామాజిక సేవే లక్ష్యంగా పనిచేయాలి
* జెడ్పిటిసి తండు సైదులుగౌడ్
తిప్పర్తి, జనవరి 5: చదువుకుంటూ విద్యార్ధులు సామాజిక సేవ కార్యక్రమాలు చేయడం అభినందనీయమని జెడ్పిటిసి సభ్యులు తండు సైదులుగౌడ్ పేర్కొనా నరు. తిప్పర్తి పరిధిలోని సిలారిమియాగూడెంలో గురువారం ఎన్‌ఎస్‌ఎస్ శిక్షణ శిభిరం ప్రారంభమైంది. నల్లగొండలోని నీలగిరి కళాశాల విద్యార్ధులు వారం రోజులపాటు ఎన్‌ఎస్‌ఎస్ శిక్షణ శిభిరాన్ని నిర్వహిస్తున్నారు. సమావేశంలో జెడ్పిటిసి సైదులుగౌడ్ మాట్లాడుతూ సామాజిక సేవే లక్ష్యంగా విద్యార్ధులు పనిచేయాలని కోరారు. తిప్పర్తి గ్రామ పంచాయితీలో వారం రోజులపాటు ఏర్పాటుచేసే కా ర్యక్రమాలకు సేవ చేసి అనుభవాన్ని సాధించాలని కోరారు. స్వచ్ఛ్భారత్, స్వచ్ఛతెలంగాణ కొరకు పనిచేయాలని, బంగారు తెలంగాణ దిశగా నడవాలని కోరా రు. కార్యక్రమంలో తిప్పర్తి సర్పంచ్ జాకటి మోషా, నీలగిరి కళాశాల ప్రిన్సిపల్ నాగేందర్‌రెడ్డి, పిఒ వెంకటేశ్వర్లు, ఎంపిటిసిలు లొడంగి వెంకటేశ్వర్లు, కినె్నర అం జి, లక్ష్మణ్‌రావు, తండు నర్సింహ్మగౌడ్, వార్డు మెంబర్ వింజమూరు వెంకన్న, జల్లెల రవి, వెంకన్న, రంగారెడ్డి, సంపత్, అశోక్, తాందార్‌పల్లి నాగరాజు, మైనం శంకర్, తదితరులు పాల్గొన్నారు.
నగదురహితంపై అవగాహన సదస్సు
గుర్రంపోడు, జనవరి 5: మండల కేంద్రంలోని ఎంపిడిఒ కార్యాలయంలో మండలంలోని ఉపాధ్యాయులందరికీ నగదురహితంపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఎంపిడిఒ పూలమ్మ మాట్లాడుతూ మండలంలోని ఉపాధ్యాయులందరూ నగదురహిత విధానాన్ని అలవర్చుకోవాలని, వారు కూడా వి ద్యార్ధుల యొక్క తల్లిదండ్రులకు పాఠశాల స్ధాయిలో కార్యక్రమాలను ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు.
తహశీల్దార్ సైదులు మాట్లాడుతూ విద్యార్ధుల యొక్క తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు నగదురహితంపై క్షుణ్ణంగా వివరించి వారు నగదురహిత లావాదేవీలు జరిపేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఒ నోము ల యాదగిరి, సదానందం, వెంకటేశ్వర్‌రెడ్డి, ఈఒఆర్‌డి సునీత తదితరులు పాల్గొన్నారు.
విద్యార్ధులకు చిత్రలేఖనం పోటీలు
గుర్రంపోడు, జనవరి 5: మండలంలోని ఎంఆర్‌సి భవన్‌లో పాఠశాల స్ధా యిలో విద్యార్ధులందరికీ ఓటర్ల దినోత్సవం సందర్భంగా చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈసందర్భంగా ఎంఈఒ నోముల యాదగిరి మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరు ఓటు హక్కు కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది యాదగిరి, వెంకటేష్, సిఆర్‌పిలు తదితరులు పాల్గొన్నారు.

ఉన్నత చదువులకు దూరమవుతున్న పేద విద్యార్థులు
* ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలపై టి.జెఎసి చైర్మన్ కోదండరాం

నల్లగొండ, జనవరి 5: ప్రభుత్వం కో ట్లాది రూపాయల ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలను సకాలంలో చెల్లించకపోవడంతో పేద వర్గాల విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని టి.జెఎసి చైర్మన్ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మహాత్మగాంధీ యూనివర్సిటీలో తెలంగాణ విద్యార్ధి ఉద్యమవేదిక నిర్వహించిన ఫీజురీయంబర్స్‌మెంట్, ప్రైవేటు యూ నివర్సిటీల అనుమతులపై నిర్వహించి న విద్యార్ధిలొల్లి సదస్సులో ఆయన మాట్లాడారు. చదువుతో విజ్ఞానం, స మాజానికి సేవచేసే భావం, ప్రశ్నించే హక్కు విద్యార్థుల్లో అలవాడుతాయన్నారు. తాను ప్రభుత్వ విద్యరంగంలో చదివి ఎదిగినవాడినని, ప్రభుత్వ విద యలో సమానత్వం ఉంటుందని ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యారంగం బలోపేతానికి, అందరికి ఒకే విద్యకు చర్యలు తీసుకోవాల్సివుందన్నారు. ప్రైవేటు యూనివర్సిటీల్లో నాణ్యమైన విద్య అందకపోగా అధిక ఫీజుల వసూళ్లతో పేద విద్యార్థులు ఉన్నత చదువులు అందని దుస్థితి తలెత్తుతుందన్నారు. ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీల అ నుమతుల విధానాలకు స్వస్తి పలకాలన్నారు. నిజాం కళాశాల ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం మాట్లాడుతు తెలంగాణ ఎంజి యూనివర్సిటీ నామమాత్రంగా మారిందని ఉన్నత విద్యాప్రమాణాలు లోపించి ఇద్దరు ప్రొఫెసర్ల తో యూనివర్సిటీ సాగుతుండటం ఆవేధనకరమన్నారు. జిల్లాకొకటిగా ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపే తం చేయాల్సింది మాని ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతి ంచి కోట్లు ఖర్చుపెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. టివియువి రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతు స్వరాష్ట్రంలో ఉజ్వల భవిష్యత్ కాంక్షిస్తు బలిదానాలతో పోరాడి విద్యార్థులు తెలంగాణ సాధించగా సీఎం కెసిఆర్ ఉద యమ సమయంలో, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి విద్యార్ధి వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాడన్నారు. ప్రె వేటు యూనివర్సిటీల అనుమతిని ప్ర భుత్వం ఉపసంహరించుకోవాలని, ఫీజురీయంబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రైవేటు కళాశాలల యాజమాన్యం చైర్మన్ వై.ప్రభాకర్‌రెడ్డి, టివియువి నాయకులు బాలకృష్ణ, సైసదులు, జిల్లా అధ్యక్షుడు ధీరావత్ వీరానాయక్, టియువి జిల్లా ప్రధాన కార్యదర్శి పందుల సైదులు, నిరుద్యోగ జె ఎసి చైర్మన్ పాల్వాయి రవి, ఎంజి జె ఎసి నాయకులు దేవేందర్, బాలు, విని త్, సతీష్‌గౌడ్, రఫీలు పాల్గొన్నారు.

పెద్దగట్టు జాతరకు పటిష్ట ఏర్పాట్లు
* సమీక్షా సమావేశంలో కలెక్టర్ సురేంద్రమోహన్

సూర్యాపేట, జనవరి 5: తెలంగాణలోని రెండవ అతిపెద్ద జాతరగా పే రొందిన దురాజ్‌పల్లి పెద్దగట్టు జాతర కు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుం డా పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్ అధికారుల ను ఆదేశించారు. గురువారం తన చాంబర్‌లో జాతర నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావే శం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 12 నుండి 16 వరకు నిర్వహించే జాతర ఏర్పాట్లకు ప్రభుత్వం రూ. 1.70 కోట్ల నిధులను మంజూరీ చేసినట్లు తెలిపా రు. ఏర్పాట్ల కోసం ప్రభుత్వం ముందస్తుగా నిధులు మంజూరీ చేసినందున చేపట్డాల్సిన పనులకు సంబంధించిన పరిపాలన పరమైన ఉత్తర్వులను జారీచేసినట్లు తెలిపారు. జాతర ఏర్పాట్ల పనులను పటిష్టంగా చేపట్టాలని నా ణ్యత ప్రమాణాలు పాటించాలని స పష్టం చేశారు. జాతర ఏర్పాట్ల పనులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూర్యాపేట ఆర్డీవో మోహన్‌రావును ఆదేశించారు. జాతరకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు సదుపాయాల కల్పన కోసం తాత్కాలికంగా రైతుల నుండి తీసుకు న్న 22 ఎకరాల భూములకు ఎకరాలకు రూ. 25 వేల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు తెలిపారు. తాగునీరు, వి ద్యుత్, మరుగుదొడ్ల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించా రు. రూ. 10 లక్షలను యాదవుల సాం ప్రదాయ వస్త్రాలను, సాంప్రదాయ వా యిద్యాలు అందించేందుకు వినియోగించాలన్నారు. గుట్టపై చేపట్టాల్సిన ఏర్పాట్లను వేగవంత చేయాలని దేవాదాయ శాఖ కమీషనర్ సులోచకు ఆదేశించారు. సమావేశంలో సిపివో సుబ్బారావుతో పాటు, ఆర్‌అండ్‌బి, ఆర్‌డబ్ల్యుఎస్, పంచాయితీరాజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మాజీ మార్కెట్ చైర్మన్ మోహన్‌రెడ్డి మృతి

మునుగోడు, జనవరి 5: ఉకొండి గ్రామానికి చెందిన మాజీ మార్కెట్ చైర్మన్ గుమ్మి మోహన్‌రెడ్డి బుధవారం గుండెపోటుతో మృతిచెందాడు. గురువారం మండల పరిధిలోని ఉకోండి గ్రామంలో జరిగిన మోహన్‌రెడ్డి అంత యక్రియలకు వివిధ పార్టీలకు చెందిన నాయకులు హాజరై ఆయన మృతదేహ ంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డి, బండా రు నర్సింహ, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నెల్లికంటి సత్యం, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, మాజీ ఎంపీపీ పోలగోని సత్యంగౌడ్, జడ్పీటీ సీ జాజుల అంజయ్యగౌడ్, సర్పంచి దొడ్డి యాదగిరి, ఆప్కో డైరెక్టర్ కర్నాటి వెంకటేశం, టీడీపీ రాష్ట్ర నాయకులు బండారు నర్సింహ్మ, యడవెల్లి సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ వార్షిక బడ్జెట్‌ను పునః సమీక్షించాలి
నల్లగొండ టౌన్, జనవరి 5: నల్లగొండ మున్సిపాలిటీ 2016-17 వార్షిక బడ్జెట్‌ను ప్రజల ఆకాంక్ష మేరకు, వా స్తవ పరిస్థితులకు విరుద్దంగా ఉన్నందున వెంటనే పునఃసమీక్షించి కౌన్సిల్ లో ప్రవేశపెట్టాలని బిజెపి మున్సిపల్ ఫ్లోర్‌లీడర్లు నూకల వెంకటనారాయణరెడ్డి, కౌన్సిలర్లు మొరిశెట్టి నాగేశ్వర్‌రా వు, రావుల శ్రీనివాస్‌రెడ్డి, బొజ్జ నాగరాజులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్ర భుత్వం నుండి 13, 14వ ఆర్ధిక సం ఘం అమృత్ పథకాల ద్వారా రూ. 140 కోట్ల నిధులు వచ్చినా బడ్జెట్‌ను సరైనరీతిలో రూపొందించలేదని వారు ఆరోపించారు.

మెయిన్‌రోడ్డు విస్తరణకు మోక్షం

* మరోరెండు రోజుల్లో పనులు ప్రారంభం * వ్యాపారులతో మున్సిపల్ అధికారుల చర్చలు * అడ్డుకునేందుకు వ్యాపారుల యత్నాలు

సూర్యాపేట, జనవరి 5: ఇటీవలే జిల్లాకేంద్రంగా మారిన సూర్యాపేటలో రోడ్ల విస్తరణకు మోక్షం కలగనుంది. గత రెండు దశాబ్దాలుగా వాయిదాపడుతూ వస్తున్నా పాత జాతీయ రహదారి (మెయిన్‌రోడ్డు)ను వెడల్పు చేసే ప్రక్రియను మున్సిపల్ అధికారులు ముమ్మరం చేస్తున్నారు. మరో రెండురోజుల్లో ఈ పనులను ప్రారంభించనున్నారు. ఈ రోడ్డును విస్తరించడంవల్ల రోడ్డుకు ఇరువైపులఉన్న పలు దుకాణాలు కూల్చివేతకు గురికానుండడం, వివిధవర్గాల వ్యాపారులు సుమారు 300 మంది వీధినపడనుండడంతో రో డ్డు విస్తరణను వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత నాలుగురోజులుగా మున్సిపల్ అధికారులు దుకాణాదారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వ్యాపారపరంగా, పారిశ్రామికంగా, వి ద్యాపరంగా పట్టణం దినదినాభివృద్ది చెందింది. అందువల్ల పట్టణంలో జనా భా పెరగడంతోపాటు అదే స్థాయిలో ట్రాఫిక్ కూడా తీవ్రంగా పెరిగిపోయి ంది. ఈ పరిస్థితులను గుర్తించి 20ఏళ్ల క్రితమే గత టిడిపి ప్రభుత్వ హయాం లో పట్టణంలోని రహదారులంన్నిటిని విస్తరించేందుకు చర్యలు చేపట్టగా వా యపారులు ప్రభుత్వంపై వత్తిడితెచ్చి అడ్డుకున్నారు. ఆతర్వాత మరో 10 ఏళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ను మరోమారు రోడ్డు విస్తరణ చేపట్టేందుకు రంగం సిద్దం చేయగా వ్యాపారు లు కోర్టును ఆశ్రయించి కూల్చివేతల ను అడ్డుకున్నారు. ఆతర్వాత ఈ అం శం మరుగున పడగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సూర్యాపేట జిల్లాకేంద్రంగా మారడంతో పట్టణాభివృద్ది పై మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సా రించారు. ఈక్రమంలో పట్టణంలో ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందు కు ప్రధాన రహదారులను, కూడళ్లను విస్తరించేందుకు చర్యలు చేపట్టారు. అత్యధిక రద్దీ ఉండే కోర్టు చౌరస్తా, శం కర్‌విలాస్ సెంటర్ చౌరస్తాలను విస్తరి ంచడంతోపాటు కొత్తగా ట్రాఫిక్ సిగ్నల్స్‌ను సైతం ఏర్పాటుచేశారు. పట్టణ ంలో ప్రధాన రహదారిగా పేరొందిన కోర్టు చౌరస్తా నుండి పూల సెంటర్, పొట్టి శ్రీరాములు సెంటర్ మీదుగా తే జా థియేటర్ వరకు రోడ్డును విస్తరించాలని నిర్ణయించారు. ఈమేరకు మ ంత్రి జగదీశ్‌రెడ్డి దుకాణాదారులతో గ తంలో సమావేశం నిర్వహించి పట్టణాభివృద్ది దృష్ట్యా రోడ్డు విస్తరణకు సహకరించాలని విజ్ఞప్తిచేశారు. అందుకు కొందరు సమ్మతించగా మరికొందరు వ్యతిరేకించారు. తాజాగా పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణపై జిల్లా కలెక్టర్, ఎస్పీలు దృష్టిసారించి రోడ్డు విస్తరణ కోసం మార్కింగ్ వేయడంతోపాటు దుకాణదారులకు నోటీసులు అందించారు. దీంతో వ్యాపారులు ఆందోళన చెందుతూ తాము ఉపాధి కోల్పొయి రోడ్డున పడుతామంటూ వ్యతిరేకిస్తుండగా అధికారులు వారితో సమావేశాలు నిర్వహిస్తున్నారు. 60్ఫట్ల వరకు రోడ్డు విస్తరించేందుకు కొందరు వ్యాపారులు అంగీకారం తెలపగా అధికారులు మా త్రం 100్ఫట్స్ మేర రోడ్డును విస్తరించాల్సిఉందని తేల్చిచెప్పారు. నిర్వాసితులకు ప్రత్యామ్నాయంగా స్థలం కేటాయించాలని డిమాండ్‌చేస్తున్నారు. దు కాణాలు కోల్పొయేవారికి పాత మా ర్కెట్ స్థలాన్ని కాని మరోచోట కాని స్థలాలను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. దుకాణాదారులు 60్ఫట్స్ వరకు రోడ్డును విస్తరించేందుకు అంగీకరించినట్లు అధికారులు చెబుతున్నారు.దశాబ్దాలుగా వాయిదాపడుతూ వస్తున్న మెయిన్‌రోడ్డు విస్తరణ ఈసా రి ఖచ్చితంగా జరుగుతుందని భావిస్తున్న వ్యాపారులు మరోమారు అడ్డుకునేందుకుగాను హైకోర్టును ఆశ్రయించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

1.3 కోట్ల మొక్కలతో హరితహారం

* అడవుల విస్తీర్ణం పెంపొందించాలి * వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ సురేంద్రమోహన్

సూర్యాపేట, జనవరి 5: హరితహార ం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో నిర్దేశించుకున్న 1.30 కోట్ల మొక్కలను నాటేందుకు అనువైన స్థలాలను గుర్తించాలని కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. గు రువారం జిల్లాపరిధిలోని అన్ని మండలాల అధికారులతో వీడియో కాన్పరె న్స్ నిర్వహించి హరితహారం, అడవుల విస్తీర్ణం, స్వచ్చ్భారత్ మరుగుదొడ్ల నిర్మాణం, నగదు రహిత లావాదేవీలపై వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. 2016లో నాటిన 91లక్షల మొక్కల్లో 70లక్షలకు జీయోట్యాగింగ్ జరిపిన ట్లు తెలిపారు. అటవీ ప్రాంతాల్లో నాటి న మొక్కల మినహా మిగిలిన 16లక్షల మొక్కలకు వారంరోజుల్లో జీయో ట్యా గింగ్ చేయాలని ఆదేశించారు. ఈ ఏ డాది జిల్లాలో 3558 స్థలాల్లో నాటిన మొక్కల్లో ఎండిపోయిన 20లక్షల మొ క్కల స్థానంలో 4లక్షల మొక్కలు మా త్రమే తిరిగి నాటారని ఎన్ని మొక్కలు ఎండిపోయాయే అంతేసంఖ్యలో తిరి గి మొక్కలు నాటించాలని స్పష్టంచేశారు. రాష్ట్రంలోనే జిల్లాలో అతితక్కువగా 3.2 శాతం అడవులు ఉన్నందున పచ్చదనాన్ని 33శాతానికి పెంచేందుకు ప్రభుత్వం నిర్దేశించినవిధంగా ఈ ఏడా ది 1.30కోట్ల మొక్కలను నాటనున్నట్లు తెలిపారు. ఇందుకోసం పక్కా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని సూచించా రు. 50 లక్షల టేకు మొక్కలను నాటేందుకు రైతులను గుర్తించాలని కోరారు. అదేవిధంగా 31లక్షల పెరటి మొక్కలు నాటేందుకు ఇంటింటి సర్వే నిర్వహించాలని ఆదేశించారు. 16 లక్షల పండ్ల, పూలమొక్కలు పంపిణిచేస్తామని, కో రుకున్న మొక్కలను సరఫరా చేసేందు కు సమీపంలోని నర్సరీలను అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. చెర్వుగట్లు, గీతాకార్మిక సంఘాల స్థలాల్లో 6 లక్షల గీతచెట్లను నాటించేందుకు ప్ర ణాళికలు రూపొందించాలని కోరారు. హరితహారం కార్యక్రమాన్ని పటిష్ట ంగా చేపట్టేందుకు ప్రతి మండలాన్ని నాలుగు క్లస్టర్‌లుగా విభజించనున్నట్లు తెలిపారు. ప్రతి మండలంలో మూడు గ్రామాలను మొదటి విడతలో నగదు రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శ్ర ద్ద తీసుకోవాలని ఎంపిడివోలు, ఎంపివోలను ఆదేశించారు. ఈ ప్రక్రియలో డ్వామా, డిఆర్‌డిఏ సిబ్బందిని భాగసా వములు చేయడంతోపాటు బ్యాంకింగ్ కరస్పాడెంట్ల సహకారం సైతం తీసుకోవాలని సూచించారు. గ్రామాల వారిగా ప్రత్యేక ప్రణాళికతో ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు. వీడి యో కాన్పరెన్స్‌లో డిఎఫ్‌వో మోహన్, డిఆర్‌డివో కిరణ్‌కుమార్, ఆర్డీవో మో హన్‌రావు, జిల్లా వ్యవసాయ ఆధికారి జ్మోతిర్మయి, తండు మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.

ప్రతిపక్షాలను మాట్లాడనివ్వకపోవడం సరికాదు
* టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఏనుగు రఘుమారెడ్డి
చిట్యాల, జనవరి 5: విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంటును రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకుండా అసెంబ్లీలో తెదేపా పక్ష నేత రేవంత్‌రెడ్డితోపాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మాట్లాడేందుకు ప్రభుత్వం అవకాశాన్ని ఇవ్వకపోవడం సరికాదని టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఏనుగు రఘుమారెడ్డి అన్నారు. అ సెంబ్లీలో ప్రతిపక్షాలకు ఫీజురీయింబర్స్‌మెంటుపై చర్చించేందుకు అవకాశాన్నివ్వకపోవడాన్ని నిరసిస్తూ మండలంలోని వెలిమినేడులో గురువారం టిఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో రహదారిపై రా స్తారోకో నిర్వహించి సిఎం కెసిఆర్ ది ష్టిబొమ్మను దగ్ధంచేశారు. విద్యార్థులకు సంబంధించిన ఫీజురీయింబర్స్‌ను ప్రభుత్వం విడుదల చేయకపోవడం దానిపై అసెంబ్లీలో తెదేపా పక్ష నేతతో పాటుగా వివిధ ప్రతిపక్షాల ఎమ్మెల్యేల కు చర్చించేందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వకుండా తప్పించుకుంటుందన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అసెంబ్లీ లో చర్చిస్తే ప్రభుత్వ పరువు పోతుంద నే ఉద్దేశంతో అధికారపార్టీ చర్చకు వె నుకాడుతోందన్నారు. విద్యార్థుల సంక్షే మం కోసం పాటుపడుతున్నామంటూ ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతుందని పెండింగ్‌లో ఉన్న ఫీజురీయింబర్స్‌మెంటును విడుదల చేయకుండా ని ర్లక్ష్యం చేయడం ప్రభుత్వానికి తగదన్నారు. ప్రైవేటు కళాశాలల్లో పేద విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని ప్రభు త్వం కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజురీయింబర్స్‌ను విడుదల చేయకుండా జాప్యం చేస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు.