నల్గొండ

సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జనవరి 6: నూతనంగా ఏర్పడిన సూర్యాపేట జిల్లాలో సైబర్ నేరాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు ఎస్పి పరిమళ హనానూతన్ తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని పోలీస్ అధికారులతో నేల వారి నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆధునీక సాంకేతిక పరిజ్ఞానం పెంపొందడం వల్ల సైబర్ నేరాలు పెరిగే అవకాశం ఉన్నందున నియంత్రించేందుకు ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఆన్‌లైన్ లావాదేవీల నిర్వహణ పెరుగుతున్నందున మోసాలు జరగకుండా ప్రజల్లో అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రజల రక్షణ కోసమే పోలీస్ వ్యవస్థ ఉన్నందున ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా పనిచేయాలని కోరారు. స్నేహపూర్వకమైన పోలీస్ విధానాన్ని కొనసాగిస్తూ ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ పోలీసులు అంటే ఉన్న భయాన్ని తొలగించేలా వ్యవహరించాలన్నారు. నగదు రహిత విధానం వల్ల ఆన్‌లైన్ బ్యాకింగ్, నెట్ బ్యాంకింగ్‌ల వినియోగంలో ఎక్కడా మోసపోకుండా ప్రజలు జాగ్రత పడాలని కోరారు. స్నేహపూర్వక పోలీస్ వ్యవస్థలో భాగంగా గ్రామాల్లో సమావేశాలు నిర్వహించడంతో పాటు పల్లెనిద్ర కార్యక్రమాలు నిర్వహించి సైబర్ నేరాలు, సామాజిక అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమదాల నివారణ కోసం ఏర్పాటుచేసిన ఆర్ట్ బృందాలు నమన్వయంతో పనిచేస్తూ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నివారించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల హెచ్చరికలను సూచించే రేడియం స్టికర్లను ఈ సందర్భంగా సిబ్బందికి అందజేశారు.

నగదు రహితంలో ముందుండాలి
* దత్తత గ్రామంలో ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి
నల్లగొండ రూరల్, జనవరి 6: నగదురహిత లావాదేవీల్లో జిల్లా, రాష్టస్ధ్రాయిలో గుండ్లపల్లి గ్రామం ముందుండాలని జిల్లా ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి కోరారు. శుక్రవారం తన దత్తత గ్రామమైన నల్లగొండ మండలం గుండ్లపల్లిలో నగదురహిత లావాదేవీలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడమే కాకుండా ప్రజలకు యూనియన్ బ్యాంకు ఆధ్వర్యంలో ఉచితంగా పాసు పుస్తకాలను, ఎటి ఎం కార్డులను బ్యాంకు డిజి ఎం చిరంజీవి, మేనేజర్ శ్రీరాములుతో కలసి అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత్ డిజిటల్ దేశంగా వెలిగిపోతున్న ఈ తరుణంలో పల్లె నుండి పట్టణం వరకు ప్రజలంతా డిజిటల్ లావాదేవీలపై అవగాహన కలిగి ఉండి నగదురహిత లావాదేవీలు నిర్వహించడం తప్పనిసరి అన్నారు. యూనియన్ బ్యాంకు అధికారులు మాట్లాడుతూ గ్రామంలో ఉచిత ఖాతాలు అందించడమే కాకుండా ఏటి ఎం మిషన్ ఏర్పాటు చేసి ఎస్పీతో పాటు తాము కూడా గ్రామ అభివృద్దికి పాటు పడుతామన్నారు. అనంతరం ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, బ్యాంకు అధికారులు, సర్పంచ్ పనస శంకర్‌గౌడ్‌లు ఆటోలో ప్రయాణించి పేటి ఎంతో డబ్బులు చెల్లించారు. అదేవిధంగా గ్రామానికి చెందిన అందె లవకుమార్, పుష్పవతిల కిరాణం షాపువద్ద నీళ్లబాటిళ్లు కొని నగదురహిత లావాదేవీలు చేశారు. ఈ కార్యక్రమంలో సి ఐలు ఆనంద్‌కిషోర్, ధనుంజయ్‌గౌడ్, ఎస్ ఐ చింత మోతిరాం, ఏ ఎస్ ఐ లచ్చిరెడ్డి, జేపి ఒ శంకర్, కానిస్టేబుల్ యాదగిరి, రమేష్, ఐకెపి ఏసి మోహన్‌రెడ్డి, ఏపిఎం యాదమ్మ, సిసిలు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సుమలత తదితరులు పాల్గొన్నారు.