నల్గొండ

తెరాస పాలనపై పోరాటం ఉధృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 7: తెరాస ప్రభుత్వ పాలనవైఫల్యాలపై కాంగ్రెస్ పార్టీ ప్రజా పోరాటాలను ఉదృతం చేస్తుందని, అన్ని వర్గాల ప్రజలు కలసిరావాలని సి ఎల్పీ నేత కె.జానారెడ్డి, ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు అన్నారు. శనివారం కోమటిరెడ్డి నివాసంలో వారు ముగ్గురు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జానారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమవుతుందన్నారు. మాటలు చెబుతూ కాలం వెల్లదీస్తుందని, ఎన్నికల హామీల అమలుకు కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తుందని, ప్రభుత్వం తగిన సమాధానాలు చెప్పకుండా దాటవేస్తుందని మండిపడ్డారు. సీఎల్పి ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలసికట్టుగా నిలదీస్తామన్నారు. రైతు రుణమాఫీ, ఫీజు రీయంబర్స్‌మెంట్, డబుల్ బెడ్‌రూం, మూడు ఎకరాల భూమి పంపిణీపై ప్రభుత్వం విఫలమైందన్నారు. అనవసర ఖర్చు పెడుతూ రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్న ప్రభుత్వం రైతులకు, విద్యార్ధులకు మాత్రం డబ్బులు లేవంటూ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ పోరాటాలతో కలసిరావాలని పిలుపునిచ్చారు. పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి వల్లనే మూడవ విడత రుణమాఫీ విడుదల చేశారన్నారు. మార్చిలో ఏకకాలంలో రుణమాఫీ పూర్తిచేస్తామని చెప్పిన కేసి ఆర్ ఇప్పుడు మాట తప్పారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉద్యమించిన విద్యార్ధులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేయడం శోఛనీయమన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను దారి మళ్లించిందని, ఎన్నికల హామీల్లో ప్రభుత్వం విఫలమైందన్నారు.

మండల విద్యార్థికి లాంగ్‌జంప్‌లో బంగారు పతకం
చిట్యాల, జనవరి 7: మండలంలోని చిన్నకాపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఆవుల ధనలక్ష్మి లాంగ్‌జంప్‌లో బంగారు పతకం సాధించింది. నల్లగొండలోని మేకల అభినవ్ స్టేడియంలో ఖేల్‌ఇండియా ఆధ్వర్యంలో అథ్లెటిక్ అండర్-14 విభాగంలో నిర్వహించిన లాంగ్‌జంప్ పోటీల్లో ధనలక్ష్మి పాల్గొని ఉత్తమ ప్రతిభను కనబరిచి తన తోటి పోటీదారులను వెనుకంజలో వేసి ప్రథమస్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రథమస్థానాన్ని కైవసం చేసుకోవడమేకాకుండా బంగారు పథకాన్ని సాధించి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు దేనికి తీసిపోరని నిరూపించింది. అంతేకాకుండా రాష్టస్థ్రాయికి ఎంపికైనది. ఈ సందర్భంగా పలువురు ఆమెను అభినందించారు.