నల్గొండ

రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్యాల, జనవరి 16: రోడ్లపై కార్లు భారీగా నిలిచాయి..అవును..విదేశంలో రోడ్లపై కాదు కార్లు నిలిచింది..నిజంగా చిట్యాలలోని జాతీయ రహదారిపై కార్లు భారీగా నిలిచాయి. రోడ్డుపై భారీగా కార్లు నిలిచిన దృష్యాలను చూస్తే ఎక్కడో ఏదో దేశంలో రోడ్డుపై కార్లు భారీగా నిలిచినట్లుగా ఉన్నది. రహదారిపై భారీసంఖ్యలో కార్లు, వాహనాలు నిలవడంతో విదేశీరోడ్లను జాతీయరహదారి తలపించింది. సంక్రాంతి పండుగ ముగియడంతో మూడురోజులుగా విశ్రాంతి తీసుకున్న జాతీయరహదారి మళ్ళీ రద్దీగా మారింది. జాతీయ రహదారిపై వీపరీతంగా కార్లు, బస్సులు, ప్రైవేటు వాహనాలు భారీ సంఖ్యలో రహదారిపై ప్రయాణించడం కనిపించింది. సంక్రాంతి సెలవులకు హైదరాబాద్‌లో నివసించే వారు తెలంగాణరాష్ట్రంలోని జిల్లాలతో పాటుగా ఆంధ్రప్రదేష్ రాష్ట్రంలోని పలు జిల్లాలకు రహదారిపై స్వగ్రామాలకు వెళ్ళగా సంక్రాతి సెలవులు పూర్తయినందున స్వస్థలాల నుండి తిరిగి హైదరాబాద్‌కు వెళ్ళేందుకు కార్లు, వాహనాల్లో, బస్సుల్లో ప్రయాణంచేయగా చిట్యాలలో రహదారిపై రద్దీగామారి వాహనాలు భారీగా నిలిచాయి. ఉద్యోగాలు చేసే ఉద్యోగులు, పాఠశాలలకు కళాశాలలకు విద్యార్థులు సోమవారం హాజరయ్యేందుకు ముందస్తుగా వెళుతుండడంతతో రహదారిపై రద్దీ విపరీతంగా పెరిగింది. రహదారిపై వాహనాల రాకపోకలు విపరీతంగా పెరుగనున్నందున ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా నివారణ చర్యలకు జాతీయ రహదారిపై భారీకేడ్‌లను పోలీసులు రోడ్డుపై ఏర్పాటు చేశారు. సంక్రాంతి సెలవులను ముగించుకున్న వారు రహదారిపై వెళ్ళే వాహనాలు చిట్యాల పోలీస్‌స్టేషన్ ప్రాంతానికి రాగానే నిదానంగా వెళ్ళేందుకు పోలీసులు తగు చర్యలను తీసుకున్నారు. వాహనాలు అట్టి ప్రాంతానికి రాగానే నిదానంగా వెళ్ళాల్సిన అవసరమున్నందున భారీసంఖ్యలో కార్లు, వాహనాలు వస్తుండగా ఎదురుగా వెళుతున్న వాహనాలు నిదానంగా వెళుతూ కొంత సమయం పాటుగా ఆగడంతో వెనుకనుండి వచ్చే కార్లు, వాహనాలు, బస్సులు పెద్దఎత్తున ఆగిపోయి ట్రాఫిక్‌జాం అయ్యింది. రహదారిపై నాలుగు వరుసలుగా కార్లు, వాహనాలు, బస్సులు నిలిచిపోవడంతో భారీస్థాయిలో ఒక్కసారిగా ట్రాఫిక్‌జాం అయ్యింది. ఒకేసారిగా వాహనాలు వేగంగా వెళితే ప్రమాదాలు జరిగే ఆస్కారముండడంతో పోలీసులు వాహనాలు నిదానంగా వెళ్ళేందుకు వేగనియంత్రణ చర్యలను తీసుకున్నారు. పోలీసులు రహదారిపై భారీసంఖ్యలో కార్లు, వాహనాలు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలను క్రమబద్దీకరించారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ వైపుకు భారీగా వాహనాలు వెళుతుండగా ట్రాఫిక్‌జాం కావడంతో హైదరాబాద్ వైపుకు వెళ్ళే రోడ్డు వాహనాలు నిలిచి రద్దీగా ఉండగా మరోవైపు రోడ్డు వాహనాలు లేక బోసిపోయి ఖాళీగా దర్శనమిచ్చింది.
పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ
చౌటుప్పల్, జనవరి 16: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు ముగించుకున్నవారిలో చాలామంది హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. 65వ నెంబర్ జాతీయ రహదారిపై వాహనాలు హైదరాబాద్ వైపు పరుగులు పెడుతున్నాయి. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు పెద్దఎత్తున బారులు తీరాయి. జిఎంఆర్ ప్రతినిధులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ టోల్‌ప్లాజా వద్ద ఎప్పటికప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంది. సంక్రాంతి పండుగకు వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో హైదరాబాద్ నుంచి దాదాపు 5 నుంచి 6 లక్షల మంది వేడుకల్లో పాల్గొనేందుకు సుమారు 25 వేల వాహనాలలో తరలి వెళ్లారు. మంగళవారం నుంచి విద్యాసంస్థలు పునర్‌ప్రారంభం కావడంతో కుటుంబాలతో రాజధానికి చేరుకుంటున్నారు. వాహనాల తాకిడిని తట్టుకొని ఎప్పటికప్పుడు ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకు టోల్‌ప్లాజా వద్ద ప్రత్యేకంగా నాలుగు అదనపు టోల్‌గేట్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ వైపుకు 12 టోల్‌గేట్లు ఏర్పాటు చేయగా విజయవాడ వైపు నాలుగింటిని మాత్రమే తెరిచి ఉంచారు. వాహనాలు టోల్‌ప్లాజా వద్ద సక్రమ పద్ధతిలో పంపించేందుకు జీఎంఆర్ సంస్థ ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసింది. అయినప్పటికీ టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. ఒక్కో వాహనానికి సుమారు అరగంటకు పైగా సమయం పడుతోంది. మరింత రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. చౌటుప్పల్ ఎసిపి ఎన్. స్నేహిత పర్యవేక్షణలో సిఐ నవీన్‌కుమార్ సారధ్యంలో జాతీయ రహదారి వెంట ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.