నల్గొండ

పల్స్ పోలియో పకడ్బందీగా చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, జనవరి 17: ఆరోగ్య శాఖ, పల్స్‌పోలీయో టాస్క్ఫోర్స్ శాఖ అధికారులు సమన్వయంతో ఈ నెల 29న పల్స్‌పోలీయో కార్యక్రమాన్ని పకడ్భందీగా నిర్వహించాలని మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ అనితారామచంద్రన్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలో 0-5సంవత్సరాలను పిల్లలను గుర్తించి ప్రతీ ఒక్కరికి పోలీయో చుక్కలు వేసే విధంగా ప్రణాళిక రూపొందించాలని అన్నారు. జనసమర్ధమైన ఆర్‌టిసి బస్టాండ్, రైల్వేస్టేషన్‌లతో పాటు ఇటుక బట్టీల ప్రాంతాలలో పిల్లలకు పోలీయో చుక్కలు వేయాలని అన్నారు. పల్స్‌పోలీయో విజయవంతం చేసేందుకు ఆయా శాఖల అధికారులు విసృత ప్రచారం నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యా శాఖాధికారి రోహిణి, జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ కాళిదాస్, మాతాశిశుసంక్షేమ శాఖ అధికారి శారద, గిరిజన సంక్షేమ శాఖ అధికారి రమణనాయక్, ఎస్సీ అభివృద్ధి అధికారి రామారావు తదితరులు పాల్గొన్నారు. మండల ప్రజాపరిషత్తు అభివృద్ధి కార్యాలయంలో డిఆర్‌డిఏ పిడి వెంకట్రావ్ ఆధ్వర్యంలో నగదు రహిత లావాదేవీలు, అసంపూర్తి మరుగుదొడ్ల నిర్మాణాలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో కలెక్టర్ అనితారామచంద్రన్ ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడుతూ గ్రామాల్లో నగదు రహిత లావాదేవీలను ప్రొత్సహించాలన్నారు.

విద్యుత్ బకాయిల వసూళ్లలో..
నూరుశాతం లక్ష్యం సాధించాలి
* సిఎండి రఘుమారెడ్డి
నల్లగొండ టౌన్, జనవరి 17: విద్యుత్ బకాయిల వసూళ్లలో నూరుశాతం లక్ష్యాలు సాధించాలని విద్యుత్ శాఖ అధికారులను సి ఎండి రఘుమా రెడ్డి ఆదేశించారు. మంగళవారం శాఖ కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాణ్యమైన, మెరుగైన విద్యుత్‌ను అందించేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వినియోగదారులకు క్షేత్రస్ధాయిలో అందుబాటులో ఉంటూ లూజ్‌లైన్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సరిచేయాలన్నారు. విద్యుత్ సరఫరాలో రైతులకు ఎంతమాత్రం ఇబ్బందులు లేకుండా కాలిపోయిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల స్ధానంలో సకాలంలో నూతన ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. విరిగిన, పాతబడిన, వంగిన స్ధంభాల స్ధానంలో నూతన స్ధంభాలను, అవసరం ఉన్నచోట కొత్త స్ధంభాలను ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. వినియోగదారుల నుండి వచ్చే ఫిర్యాదులకు స్పందించి వారి సమస్యల పరిష్కారానికి సంబంధిత ఉన్నతాధికారుల సలహాలు, సూచనలతో కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆయా మండలాల ఏ ఈలు, డిఈలు, సి జిఎం శ్రీనివాసులు, డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.