నల్గొండ

పథకాల అమలు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, జనవరి 17: ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు అమలు వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఎస్‌పి.సింగ్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్సులో ఆయన జిల్లా కలెక్టర్లు, జేసిలతో మాట్లాడుతూ సంక్షేమ పథకాలు కళ్యాణలక్ష్మీ, షాదీముభారక్, భూపంపిణీ, తదితర పథకాలను సమర్ధవంతంగా కొనసాగించాలన్నారు. హరితహారం లక్ష్యాలను సాధించేందుకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, భూసేకరణ, మిషన్ కాకతీయ పథకాల అమలు లక్ష్యాలను నిర్ధేశిత గడువులో పూర్తి చేయాలన్నారు. 45వేల కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని యుద్ద ప్రాతిపధికన పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ సంక్షేమ పథకాల గ్రౌండింగ్ సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జేసి నారాయణరెడ్డి, డిఎఫ్‌ఒ శాంతారాం, డిఆర్‌ఒ కీమ్యానాయక్ పాల్గొన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల కోరుతూ
సిఎం దిష్టిబొమ్మ దగ్ధం
చిట్యాల జనవరి 17: పెండింగ్‌లో ఉన్న ఫీజురీయింబర్స్‌మెంటును విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం చిట్యాలలో తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేధిక ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కార్యక్రమానికి హాజరైన టివియువి రాష్ట్ర కార్యదర్శి బైరు నాగరాజుగౌడ్ మాట్లాడుతూ విద్యార్థులకు సంబంధించిన ఫీజురీయింబర్స్‌మెంటను విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని ధనిక రాష్టమ్రైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో ఫీజురీయింబర్స్‌మెంటు విడుదలకు నిధులు లేవా అని ప్రశ్నించారు. ఎంతో మంది విద్యార్థులు ఫీజురీయింబర్స్‌మెంటుపై ఆధారపడి విద్యనభ్యసిస్తున్నారని ప్రభుత్వం విద్యార్థుపై చిన్నచూపు చూస్తున్నదన్నారు. వసతిగృహాల విద్యార్థులకు మెస్‌చార్జీలను పెంచాలని, ఫీజురీయింబర్స్‌మెంటును విడుదల చేయాలని డిమాండ్ చేశారు.