నల్గొండ

మోదీ పాలనలోనే సాహసోపేత నిర్ణయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేటటౌన్, జనవరి 19: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాడని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. భద్రాచలంలో నిర్వహిస్తున్న బిజెపి రాష్టస్థ్రాయి సమావేశాలకు వెళ్తున్న ఆయన సూర్యాపేటలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు నివాసంలో కాసేపు ఆగారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ ప్రధాని మోదీ పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్ చేయడం, నల్లధనాన్ని అరికట్టేందుకు పెద్దనోట్లను రద్దుచేయడం చారిత్రక నిర్ణయాలు అన్నారు. సర్జికల్ స్ట్రైక్ నిర్ణయంతో పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లి అక్కడి ఉగ్రశిబిరాలను మన సైనికులు ధ్వంసం చేయడం ద్వారా దేశ ప్రజల్లో ఆత్మస్థైర్యం కల్పించారన్నారు. నోట్ల రద్దుతో తాత్కాలికంగా ప్రజలు తమ డబ్బును తాము తీసుకునేందుకు కొంత ఇబ్బందిపడప్పటికి ప్రధాని నిర్ణయాన్ని స్వాగతించారని దాని ఫలితాలు పేదలకు చేరుతున్నాయన్నారు. ఇప్పటికే బ్యాంకుల్లో వడ్డీ రేట్లు తగ్గాయని, గర్భిణీలకు ఆర్థిక చేయూతనివ్వడం వంటి సంక్షేమ పథకాలు వచ్చాయన్నారు. పండిట్ దీన్‌దయాల్ ప్రవచనం ప్రకారం దేశంలోని అట్టడుగున ఉన్న పేదలు సంతోషంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయి పేదలకు 100శాతం దక్కెలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. శుక్ర, శనివారాల్లో పార్టీ రాష్టస్థ్రాయి సమావేశాలు నిర్వహిస్తున్నామని ప్రతి మూడు నెలలకు ఒకసారి రాష్ట్ర, జిల్లా, మండలస్థాయి సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర, జిల్లాస్థాయి సమావేశాలు 100శాతం పూర్తిచేయగలిగామని మండలస్థాయి సమావేశాలు మాత్రం 80శాతం మాత్రమే జరిగాయన్నారు. రానున్న సమావేశాల్లో అవి కూడా 100శాతం పూర్తిచేస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి పివి సుభాష్, నాయకులు రంగరాజు రుక్మారావు, కొణతం సత్యనారాయణరెడ్డి, హబీద్, నల్లకుంట్ల అయోధ్య, వాసుదేవరెడ్డి, చల్లమల్ల నర్సింహ్మ, రంగినేని లక్ష్మణ్‌రావు, జీడి భిక్షం తదితరులు పాల్గొన్నారు.

కృష్ణా జలాల అక్రమ కనెక్షన్ తొలగింపు
- ఆంధ్రభూమి వార్తకు స్పందన -
నాంపల్లి, జనవరి 19 : మండలంలోని దేవత్‌పల్లి గ్రామ పంచాయితీ పరిధిలోని బొంతతండ పేరున ప్రధాన లైను నుండి ఇచ్చిన అక్రమ కనెక్షన్ నుండి నీటిని వృథా చేస్తున్నారని ఆంధ్రభూమిలో ఇచ్చిన వార్తకు అధికారులు స్పందించారు. గురువారం కృష్ణాజలాల డి ఈ, ఏ ఈ తమ సిబ్బంది సహాయంతో కనెక్షన్‌ను తొలగించి నీటి సరఫరాను నిలిపివేశారు. అయితే అక్కడికి వెళ్లగా అక్కడ ఇటుక బట్టీలు, వ్యవసాయ పనులు జరుగుతున్న మాట వాస్తవమేనని అందులో 200 మంది కార్మికులు కూలీలుగా పనిచేస్తుండటంతో తాగునీటి కోసం మాత్రమే కనెక్షన్ తీసుకున్నామని గ్రామ మాజీ సర్పంచ్ శంకర్‌నాయక్ పేర్కొన్నారు. కూలీలు కూడా తాగునీటి అవసరాల కోసమే దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ లేఖ సహకారంతో కనెక్షన్ తీసుకున్నామని పేర్కొన్నారు. అయతే అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కనెక్షన్ తొలగించి చేతులు దులుపుకొన్నారని పలువురు ఆరోపిస్తున్నారు.