నల్గొండ

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోదాడ, జనవరి 19: రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నట్లు జిల్లా రవాణాశాఖ కమీషనర్ యం.చంద్రశేఖర్‌గౌడ్ వెల్లడించారు. అనంతగిరి మండల కేంద్రంలోని అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజీలో గురువారం 28వ, రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా కోదాడ రవాణాఖాఖ నిర్వహించిన అవగాహన సదస్సుకు స్ధానిక యంవిఐ యు.సుభాష్ అద్యక్షత వహించారు. సదస్సుకు ముఖ్యఅతిధిగా హాజరైన జిల్లా రవాణా కమిషనర్ చంద్రశేఖర్‌గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న మరణాల్లో రోడ్డు ప్రమాదాల వలన మృతి చెందుతున్నవారే ఎక్కువగా వున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల్లో 75 శాతం ప్రమాదాలు మానవ తప్పిదాలతోనే జరుగుతున్నాయని మిగిలిన 25 శాతం వాహనం కండీషన్, రోడ్ల నిర్వహణ సరిగాలేకపోవడం వలన జరుగుతున్నాయని వివరించారు. ప్రమాదాల మృతుల్లో ఎక్కువమంది యువత వుండటం విచారకరమని, వాహానాలను మితిమీరిన వేగంతో నడపి యువత ప్రమాదాలకు కారణమవుతున్నదని, వాహనదారులు రోడ్డు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు. వాహనచోదకులు తప్పనిసరిగా హెల్మెట్‌ను ధరించాలని, ట్రిపుల్ రైడింగ్ చేయవద్దని కోరారు. వాహన చోదకులు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడిపితే కఠినచర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. కోదాడ డిఎస్‌పి ఎ.రమణారెడ్డి మాట్లాడుతూ సెల్‌ఫోన్ మాట్లాడుతూ, హెల్మెట్‌లేకుండా వాహనాలను నడుపుతున్న సమయంలో జరిగిన ప్రమాదాలను వివరించారు. మద్యం సేవించి వాహానాలు నడిపితే కఠినచర్యలు తీసుకొంటామన్నారు. పోలీసులు, ట్రాఫిక్, రవాణా, ఆర్‌అండ్‌బి, యన్‌హెచ్ అధికారులు కలిసి సమన్వయంతో రోడ్డుప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. విద్యార్ధులు తమ సమస్యలు ఏమైనా వుంటే తనను నేరుగా కలిసి చెప్పవచ్చని డిఎస్‌పి రమణారెడ్డి సూచించారు. కార్యక్రమంలో ఎంవిఐ సుభాష్, సిఐలు మధుసూదన్‌రెడ్డి, రజితారెడ్డి, అసిస్టెంట్ ఎంవిఐలు బాబా, వీరేంద్రనాయక్, రాములు, అనంతగిరి యస్‌ఐ మంజునాధరెడ్డి, కాలేజీ ప్రిన్సిపాల్ శివప్రసాద్, చిన్న ఈశ్వరయ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు, డ్రైవర్లు, సిబ్బందితో టిడిసి చంద్రశేఖర్‌గౌడ్ ప్రమాణం చేయించారు. మీ భద్రత మీ కుటుంబం సురక్షితం..దయచేసి రోడ్డుపై జాగ్రత్తగా వుండండి అంటూ రూపొందించిన అవగాహన కరపత్రాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు.