నల్గొండ

విద్యుదాఘాతంతో బిహార్ యువకుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోత్కూరు, జనవరి 20: పొట్టకూటి కోసం బిహార్ నుండి వలస వచ్చి పనిచేస్తున్న యువకుడికి విద్యుత్ షాట్‌సర్య్కూట్ రూపంలో మృత్యువు కబలించిన సంఘటన శుక్రవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మృతుని స్నేహితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మోత్కూరు నుండి పాతిమట్ల వరకు డబుల్ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా బీహార్‌లోని జలద ప్రాంతానికి చెందిన జన్‌దార్ పింట్‌కుమార్ (22) సృజన కన్‌స్ట్రక్షన్‌కు చెందిన టిప్పర్ హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. మోత్కూరు, కొండగడప మధ్య టిప్పర్‌లోని మట్టిని అన్‌లోడింగ్ చేస్తున్న క్రమంలో టిప్పర్ ట్రాలీ ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లను తగలడంతో రోడ్డుపైన ఉన్న పింట్‌కుమార్ టిప్పర్‌ట్రాలీని పట్టుకొని ఉండటంతో షాట్ సర్య్కూట్ జరిగి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఎస్‌ఐ రవికుమార్, ఏఎస్‌ఐ సాయినాధ్, పోలీసు సిబ్బందితో సంఘటన స్ధలానికి చేరుకొని దర్యాప్తు చేశారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విద్యుత్ తీగలు కిందకు ఉండటంతోనే షాట్ సర్య్కూట్ జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు.

బైపాస్ రోడ్డు పనులు ఆపండి
* మంత్రి తుమ్మలకు రైతులు విజ్ఞప్తి
కోదాడ, జనవరి 20: కోదాడ-ఖమ్మం మధ్య ప్రతిపాదిస్తున్న నాలుగువిడతల రహదారి నిర్మాణంలో భాగంగా కోదాడ మండలం తమ్మర, అల్వాలపురం, బొజ్జగూడెం తండల మద్య బైపాస్ రోడ్డు నిర్మించేందుకు చేస్తున్న సర్వే పనులను గత కొద్ది రోజులనుండి అడ్డుకొంటున్న రైతులు శుక్రవారం మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు ఆద్వర్యంలో హైద్రాబాద్‌లో రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును కలిశారు. మూడుపంటలు పండే తమ భూమినుండి బైపాస్ రోడ్డును నిర్మించడం మానుకొని ప్రస్తుతం వున్న ఖమ్మం రోడ్డును విస్తరించాలని రైతులు మంత్రికి వివరించారు. రైతుల విజ్ఞప్తిపై మంత్రి తుమ్మల స్పందించి ప్రస్తుతం బైపాస్ సర్వే పనులను నిలిపేందుకు హమీ ఇచ్చినట్లు మాజీ ఎమ్మెల్యే చందర్రావు చెప్పారు. పాత ఖమ్మం రోడ్డు విస్తరణ, భూముల్లోనుండి బైపాస్ ఏర్పాటు ఈ రెండింటిని అంచనా వేయించి ఏది వీలుగా వుంటే దాన్ని అమలుచేయిస్తానని మంత్రి హమీ ఇచ్చారని వివరించారు. పాతరోడ్‌ను సర్వేచేసిన తరువాత అందరి సమక్షంలో రైతుల అనుమానాలను తొలగించిన తరువాతనే పనులు మొదలుపెడతామని, ఏ ఒక్క రైతుకు నష్టం జరగకుండా చూస్తామని మంత్రి తుమ్మల హమీ ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే చందర్రావు చెప్పారు.