నల్గొండ

ఆడ శిశువును తల్లిదండ్రులకు అప్పగించిన ఐసిడిఎస్ అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాంపల్లి, జనవరి 22: నాల్గవ కాన్పుకు కూడా ఆడపిల్ల పుట్టిందని కన్నబిడ్డను ఇతరులకు అప్పగించి చనిపోయిందని ప్రచారం చేసిన ఘటనను గుర్తించిన ఐసిడిఎస్ అధికారులు శిశువు ఆచూకిని తెలుసుకొని కౌన్సిలింగ్‌తో తిరిగి తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన ఆదివారం వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. పస్నూరు గ్రామ పంచాయితీలోని నామానాయక్‌తండా గ్రామానికి చెందిన వర్తె వల్లి, నగేష్‌ల దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు కలరు. ఇందులో దంపతులు పిల్లలను సరిగ్గా సాకకపోవడంతో ఒక అమ్మాయి చనిపోయింది. మరల ఇటీవల కాన్పు జరుగగా మరో ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో ఆ శిశువును కూడా సాకలేమనే సాకుతో వెంకటేశ్వర్‌రావు అనే వ్యక్తి సహాయంతో హైద్రాబాద్‌కు చెందిన నర్సింహ్మ అనే దంపతులకు బిడ్డను అప్పగించారు. గత నెల 28వ తేదీన నామానాయక్‌తండాకు చెందిన ఐసిడిఎస్ అధికారులు శిశువుని చూసేందుకు వెళ్లగా శిశువుకనపడకపోవడంతో తల్లిదండ్రులను ఆరా తీశారు. అయితే శిశువు చనిపోయిందని తప్పుడు సమాచారం అందించారు. దీంతో విచారించిన ఐసిడిఎస్ అధికారులు శిశువు హైద్రాబాద్‌లో ఉన్నట్లుగా గుర్తించారు. ఈ విషయాన్ని స్దానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శిశువుని తీసుకొని వచ్చి తల్లిదండ్రులను స్ధానిక పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. తల్లిదండ్రులు శిశువుని తీసుకునేందుకు తొలుత నిరాకరించడంతో అధికారులు జిల్లా శిశువిహార్‌కు అప్పగించే ప్రయత్నం చేశారు. చివరకు కౌన్సిలింగ్ పిదప తమ బిడ్డను సాదుకుంటామని స్టేషన్‌లో తల్లిదండ్రులు అంగీకరించడంతో శిశువును వారికి అప్పగించారు.
చెట్ల పొదల్లో పసిబాలుడు
కట్టంగూర్, జనవరి 22: చెట్ల పొదల్లో పసిబాలుడు దొరికన సంఘటన నకిరేకల్ మండలపరిధిలోని మంగళపల్లి గ్రామపంచాయితీ ఆవాసం నర్సింహ్మపురం గ్రామంలో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నర్సింహ్మపురం గ్రామసమీపంలోని కల్వర్టు వద్ద ఉన్న చెట్ల పొదల మధ్య ఓ పసికందును వదిలేశారు. గ్రామానికి చెందిన రామలింగయ్య మార్గమద్యలో పిల్లాడి ఏడ్పు వినిపించగా అక్కడికి వెళ్లి పరిశీలించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులకు సమాచారం అందించగా వారు సంఘటన స్థలానికి చేరుకొని శిశువును ఐసిడిఎస్ అధికారులకు అప్పగించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స నిర్వహించారు.