నల్గొండ

చెరువుల్లోకి చర్లగూడెం ప్రాజెక్టు నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంస్థాన్‌నారాయణపురం, జనవరి 22: చర్లగూడెం ప్రాజెక్టు నీటిని సంస్థాన్‌నారాయణఫురం మండలంలోని అన్ని ప్రధాన చెరువుల్లోకి నింపడానికి రిటైర్డ్ ఇంజనీర్ల బృందంతో పాటు, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్, అఖిలపక్షనాయకులు, రైతులు ఆదివారం మండలంలోని చెరువులను పరిశీలించారు. చర్లగూడెం ప్రాజెక్టు కుడికాలువ ద్వారా సాగునీరు సంస్థాన్‌నారాయణపురం మండలంలోని పలుచెరువులను నింపేందుకు ఎక్కడ లిఫ్టు ఏర్పాటు చేయాలి వంటి వంటి అంశాలను పరిశీలించారు. చిల్లాపురం పెద్దచెరువు, జనగాం మొల్కచెరువు, సంస్థాన్‌నారాయణపురం మేళ్ళచెరువు, మహ్మాదాబాద్ నీల్లకొండ చెరువులను స్వయంగా పరిశీలించారు. ఈకాలువ ద్వారా వచ్చే నీరు మండలంలోని చిల్లాపురం, వావిల్లపల్లి, జనగాం, సంస్థాన్‌నారాయణఫురం, మహ్మదాబాద్, చిమిర్యాల, గుడిమల్కాపురం, రాచకొండ గ్రామపంచాయతీలతో పాటు, పలు గిరిజన తండాలకు సాగునీరు అందించాలని వాటి సాద్యాసాధ్యాలను పర్యవేక్షించారు. ఈగ్రామాలన్నీ కాలువకు పైభాగంలో ఉన్నాయి. చర్లగూడెం ప్రాజెక్టు కాలువ ద్వారా వచ్చేనీటికి 11వ కిలోమీటర్ వద్ద జనగాం గ్రామపరిధిలో లిప్టును ఏర్పాటు చేసి మొల్కచెరువు, సంస్థాన్‌నారాయణపురంలోని మేళ్ళ చెరువులోకి 2టిఎంసీల నీటిని నింపాలని ప్రతిపాదించారు. మొల్కచెరువు నుంచి గ్రావిటీద్వారా చిల్లాపురం పెద్దచెరువు, వావిల్లపల్లిలోని చెరువులు, పలుగిరిజనతండాలకు సాగునీటిని అందించనున్నారు. అలాగే మేళ్ళచెరువు నుంచి నవాబుచెరువు, నీల్లకొండచెరవు, సిద్దోంకోని చెరువు, తంగడపల్లి చెరువులతోపాటు అనేక ఇతర చెరువులను నింపుతూ కాలువులను తవ్వాలని నిర్ణయించారు. ఈకార్యక్రమంలో రిటైర్డ్ ఇంజనీర్ల బృందం రాష్ట్ర కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డి, రమణానాయక్, సత్యనారాయణ, లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ బొల్ల శివశంకర్, ఎంపిపి వాంకుడోతు బుజ్జీనాయక్, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహాక కార్యదర్శి జక్కలి అయిలయ్యయాదవ్, బిజెపి జిల్లా ప్రధానకార్యదర్శి దోనూరి వీరారెడ్డి, సిపిఎం, సిపిఐ జిల్లా కమిటి సభ్యులు దోనూరి నర్సిరెడ్డి, కె. లింగయ్య, సింగిల్‌విండో చైర్మన్‌లు గడ్డం మురళీధర్‌రెడ్డి, ఏర్పుల సుదర్శన్, పాశం ఉపేందర్‌రెడ్డి, కత్తుల లక్ష్మయ్య, జక్కిడి ధన్వంతరెడ్డి, మందుగుల బాలకృష్ణ, జక్కిడి బాల్‌రెడ్డి, ఏపూరి సతీశ్, బద్దుల కృష్ణయ్య, బచ్చనగోని గాలయ్య, గుంటోజు శ్రీనివాసాచారి, తుమ్మల నర్సిరెడ్డి, కుక్కల నర్సింహ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
సాగర్‌ను సందర్శించిన
యువజన సర్వీసుల శాఖ డైరెక్టర్
నాగార్జునసాగర్, జనవరి 22: నాగార్జునసాగర్‌ను ఆదివారం నాడు తెలంగాణ రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ డైరెక్టర్ అబ్ధుల్ అజీమ్ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా నాగార్జునకొండ మ్యూజియాన్ని, ఎత్తిపోతల జలపాతాన్ని, సాగర్ డ్యాం, బుద్ధవనంను సందర్శించారు. వీరితోపాటు నల్లగొండ జిల్లా స్పోర్ట్స్ అధికారి మన్సూర్ అబ్ధుల్, యువజన సర్వీసుల మేనేజర్ ధనుంజయ, గైడ్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు. అదేవిధంగా బుద్ధవనం ప్రాజెక్టును టూరిజం శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి చందనాఖన్ సందర్శించారు. ఆమెతోపాటు అమెరికాకు చెందిన ఇద్దరు బౌద్ధమతస్థులు ఆసక్తిగా బుద్ధవనం ప్రాజెక్టును వీక్షించారు. వీరితోపాటు శ్యాంసుందర్, ఆంజనేయులు, సాయి ఉన్నారు.
ప్రతి ఎకరాకు సాగునీరు
సంస్థాన్‌నారాయణఫురం, జనవరి 22: చర్లగూడెం ప్రాజెక్టు ద్వారా మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీటిని అందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌లు అన్నారు. మండలంలోని ప్రధాన చెరువుల్లోకి సాగునీటిని ఎలా నింపాలనే విషయాలను రిటైర్డ్ ఇంజనీర్ల బృందం, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిలపక్షనాయకులు కలిసి ఆదివారం చెరువులను పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలో అఖిలపక్షసమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యం స్పష్టంగా ఉందన్నారు. సాగునీటినికి నోచుకోని ఇక్కడి ప్రజలకోరికను తీర్చడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. అందుకోసం ఈరోజు సాగునీటిని అందించేందుకు కావాల్సిన లిఫ్టు, చెరువుల భౌగోళిక పరిస్థితిని పరిశీలించామన్నారు. చర్లగూడెం ప్రజెక్టు కుడికాలువతో 1.20వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. సంస్థాన్‌నారాయణఫురం, చౌటుప్పల్ మండలాలలోని పలుగ్రామాలకు సాగునీరుకు ఏర్పాట్లను పరిశీలిన చేసినట్లు తెలిపారు. ఈ కాలువకు 11వ కిలోమీటర్ వద్ద లిఫ్టును ఏర్పాటు చేసి మొల్కచెరువు, మేళ్ళచెరువు, పెద్దచెరువు, నవాబుచెరువు, నీల్లకొండ, తంగడపల్లికి నీరిస్తామన్నారు.