నల్గొండ

యాదాద్రి ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట రూరల్, జనవరి 22: ప్రాచీన పుణ్యక్షేత్రమైన యాదాద్రిని ప్రభుత్వం ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చి దిద్దటం హర్షనీయమని మాజీ తమిళనాడు గవర్నర్ కొనిజేటి రోశయ్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మైలార్‌గూడెంలో ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంబించారు. తదనంతరం రోశయ్య మాట్లాడుతూ రాబోయే రోజుల్లో యాదాద్రి మహిమాన్విత క్షేత్రంగా వెలుగుతుందని, యాదాద్రి పునః నిర్మాణం ప్రభుత్వం చేపట్టటం అభినందనీయమని అన్నారు. వైశ్యులలో ధనికులు, పేద వారు ఉన్నారని ధనికులు కేవలం వైశ్యుల కోసం కాకుండా ప్రజల కోసం పలు స్వచ్చంద సంస్థల ద్వారా సేవా కార్యక్రమాలు చేయటం మంచి పరిణామమని ప్రతి ఒక్కరు సేవా ధృక్ఫధాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. ఒకరికి సేవ చేసే ఆత్మతృప్తి మరే పని చేసినా కలుగదన్నారు. వైశ్యులలో రకరాకాల పేరులతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ఇది మంచి పరినామని అన్నారు. వ్యాపారంలో పోటీ ఉండటం సహజమని అదే విధంగా సేవా కార్యక్రమాలలో మంచి ఆలోచనతలోఇతరులకు సేవా చేయాలనే సంకల్పంతోపోటీ ఉంటే పర్వాలేదని అన్నారు. కుల,మతాలకతీతంగా సేవా కార్యక్రమాలు జరుగాలన్నారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునిత మాట్లాడుతూ పేద ప్రజలకు సేవ కార్యక్రమాలు చేసే వారికి ప్రభుత్వం అండదందలు ఉంటాయన్నారు. తాను సంపాదించిన దాంట్లో కొంత భాగం పేద ప్రజల కోసం ఖర్చు చేయటంతోమనశాంతి కలుగుతుందని అన్నారు. తదనంతరం ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడిగా తాళ్ల పల్లి విశ్వనాధం గుప్త,ప్రధాన కార్యదర్శిగా వంగపల్లి అంజయ్యగుప్త, మహిళా అధ్యక్షురాలు సముద్రాల కల్పన, కోశాధికారి తడ్క వెంకటేశం, శ్రీనివాస్ గుప్తలను సన్మానించారు.ఈ కార్యక్రమంలోఎంపీపీ గడ్డమీది స్వప్న రవీందర్‌గౌడ్,జడ్‌పిటిసి కర్రె కమలమ్మ, ఐవి ఎఫ్ నేషనల్ ప్రసిడెంట్ రాజవౌళిగుప్త, గంజి ప్రవీణ్ కుమార్, మేఘమాల, శ్రీనివాస్ గుప్త, పబ్బా చంద్రశేఖర్ పాల్గొన్నారు.
జిల్లా జడ్జి రాధారాణికి కలెక్టర్, ఎస్పీల సన్మానం
నల్లగొండ లీగల్, జనవరి 22: జిల్లా జడ్జి జి.రాధారాణి హైద్రాబాద్ నాంపల్లి కోర్టుకు బదిలీయైన సందర్భంగా ఆదివారం కలెక్టర్ బంగ్లాలో ఆమెకు కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ దంపతులు, ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి దంపతులు, జెసి సి.నారాయణరెడ్డి దంపతులు ఆమెను ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు రాధారాణి జిల్లా జడ్జిగా కేసుల సత్వర పరిష్కారానికి చేసిన కృషిని, న్యాయవిజ్ఞాన సదస్సుల ద్వారా చట్టాల పట్ల ప్రజలకు అవగాహాన కల్పించడంలో చూపిన చొరవను అభినందించారు.