నల్గొండ

ఉపాధి పనుల లక్ష్యాన్ని చేరాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 22: ఉపాధి హామీ పథకం లక్ష్యాల సాధనలో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు సమర్ధవంతంగా పనిచేయాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సూచించారు. ఆదివారం టిటిడిసిలో నిర్వహించిన ఫీల్డ్, టెక్నికల్ అసిసెంట్ల శిక్షణా సమావేశంలో ఆయన మాట్లాడుతు ఉపాధి హామీ కూలీలకు చెల్లింపులు వెంటనే చేసేలా చొరవ తీసుకోవాలన్నారు. క్షేత్ర స్థాయి పనులపై సిబ్బంది సరైన అవగాహాన పెంపొందించుకోవాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, హరిత హారం, డంపింగ్ యార్డులు, పంచాయతీ భవనాల నిర్మాణాలను సకాలంలో పూర్తయ్యేలా చూడాలన్నారు. పనిదినాల కల్పనలో ఫీల్డ్ అసిస్టెంట్లు అవసరమయ్యే పనులు గుర్తించాలన్నారు. సహజవనరులు పెంపొందించే విధంగా పనులు ఎంపిక చేయాలన్నారు. జాబ్‌కార్డుల నవినీకరణ ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో నిర్వహించే విధుల రికార్డులు సక్రమంగా ఉండేలా చూసుకోవాలన్నారు. అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు.

అడవుల రక్షణపై ఫోకస్

నల్లగొండ, జనవరి 22: పర్యావరణ పరిరక్షణ ప్రధాన సమస్యగా మారుతున్న నేపధ్యంలో అడవుల అభివృద్ధిపై దృష్టి పెట్టిన ప్రభుత్వాలు అటవీ ప్రాంతాల ఆక్రమణల నివారణకు, వృక్ష, జంతుసంపద పరిరక్షణకు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాయి. అటవీ శాఖ ఆధ్వర్యంలో కొత్తగా ‘క్షీణత అడవుల సహజ పునరుద్ధరణ’ పథకాన్ని అటవీ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా కొనసాగిస్తున్నారు. పథకంలో భాగంగా రాష్ట్ర అటవీ శాఖ పరిధిలో తెలంగాణ పది జిల్లాల్లో అటవీ భూముల చుట్టు భారీ కందకాల త్రవ్వకం పనులు చేపట్టారు. నల్లగొండ జిల్లాలో నల్లమల అటవీ భూములతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న అటవీ శాఖ భూముల చుట్టు కందకాల త్రవ్వకం పనులు ప్రారంభించారు. 2మీటర్ల వెడల్పు, రెండు మీటర్ల నిలువుతో కందకాల నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లా 90బ్లాక్‌ల్లో 68వేల హెక్టార్లలో అటవీ భూములుండగా అందులో తొలి ఏడాది ప్రయోగాత్మకంగా 11బ్లాకుల్లో 1200హెక్టార్లలో 62లక్షల వ్యయంతో కందకాల త్రవ్వకాలు సాగిస్తున్నారు. రెండో దశ కింద మరో 26బ్లాకుల్లో 5.19కోట్లతో 306కిలోమీటర్ల దూరం కందకాల నిర్మాణాలు సాగిస్తున్నారు. అడవుల్లో పడే విత్తనాలు మొలకెత్తి వృక్షాలుగా మారేందుకు వీలుగా అడవుల్లో మనుషులు, పశువుల సంచారంపై నియంత్రణ, అటవీ భూముల, సంపద ఆక్రమణ నివారణకు ఈ కందకాల నిర్మాణాలు ఉపకరించనున్నాయి.
అలాగే వివిధ ప్రాంతాల్లోని చిట్టడవుల వృక్ష సంపద విస్తరణకు కందకాల నిర్మాణం దోహదం చేస్తుంది. తొలి ఏడాది చిట్యాల, నార్కట్‌పల్లి, మహ్మదాపూర్-1,2,3, శ్రీనివాసపూర్, జనగాం-1,2, వీరారెడ్డిపల్లి, దుబ్బలకట్ట బ్లాక్‌ల్లో కందకాల త్రవ్వకాలు చేపట్టారు. మహబూబ్‌నగర్-నల్లగొండ అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్టు ప్రాంతం చుట్టు కందకాల త్రవ్వకాలు సాగించారు. ఈ ఏడాది సాగర్, నల్లగొండ, మిర్యాలగూడ ఫారెస్టు రేంజ్‌లో 70కిలోమీటర్ల కందకాల నిర్మాణంలో ఇప్పటికే 30కిలోమీటర్లు పూర్తి చేశారు. వీటితో పాటు అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణ చర్యల నేపధ్యంలో అడవుల్లో సిసి కెమెరాల ఏర్పాటు కూడా పెంచారు. ప్రస్తుతమున్న 14సిసి కెమెరాల సంఖ్యను 35పెంచేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. సిసి కెమెరాలతో కలప చోరి, జంతువుల వేట వంటి వాటిపై నిఘా సాగిస్తున్నారు. అలాగే వివిధ జాతుల వన్యప్రాణుల ఉనికిని, సంఛారాన్ని ఈ కెమెరాల ద్వారా గుర్తిస్తున్నారు.