నల్గొండ

ఘనంగా నేతాజీ జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, జనవరి 23: నేతాజీ సుభాష్ చంద్రబోస్ 120వ జయంతి వేడుకలు సోమవారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఎబివిపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వేడుకలలో ఆర్డీవో వెంకటాచారి, ఎబివిపి సమాజిక సమరసత వేదిక ప్రాంత సంఘటన కార్యదర్శి అప్పాల ప్రసాద్, బిజెపి జిల్లా అధ్యక్షులు నూకల వెంకట నర్సింహ్మరెడ్డి, టిఆర్‌యస్ నాయకులు దుబ్బాక నర్సింహ్మరెడ్డి,ట్రెజరీ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షులు కర్నాటి విజయ్‌లు ముఖ్య అతిధులుగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా వారు నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని, వారి అడుగుజాడలలో ముందుకు వెళ్లాలన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో నేతాజీ సేవలు మరువలేనివన్నారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి జిల్లా కన్వీనర్ నేరంటి రమేష్, జానీపాష పాల్గొన్నారు.
చిట్యాల: ధైర్యసాహసాలకు, పట్టుదలకు మారుపేరు నేతాజి సుభాష్ చంద్రబోస్ అని, ఆయన ఆశయాలను యువత సాధించాలని గుండ్రాంపల్లి సర్పంచ్ రాచకొండ లావణ్యకిష్టయ్య అన్నారు. నేతాజి సుభాష్‌చంద్రబోస్ జయంతి సందర్భంగా సోమవారం మండలంలోని గుండ్రాంపల్లి గ్రామంలో నేత్ర యువజన సంఘం ఆధ్వర్యంలో నేతాజి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నేతాజి చిత్రపటానికి సర్పంచ్ లావణ్య, ఉపసర్పంచ్ నార్సింగ్ వెంకటేశం, ఎంపిటిసి బండ గిరిజఅంజయ్య, సంఘం అధ్యక్షుడు గోపగోని చల్మయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ దేశం కోసం నిస్వార్ధంగా పోరాడిన మహనీయుడు నేతాజి అని, అలాంటి మహనీయుని చరిత్ర నేటికి యువకులంతా ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సమాజంలో యువకులు మార్గదర్శకులుగా ఎదిగేందుకు నేతాజి జీవితం ఆదర్శమన్నారు, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో దేశానికి ఆయన ఎంతో సేవ చేశారని, యువకులు నేతాజి ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పంచాయతి కార్యదర్శి కృష్ణయ్య, సంఘం ప్రధానకార్యదర్శి మహ్మద్ అఖిల్, పిల్లి మహేష్, బొడిగె రాజేష్, గాదరి పవన్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు గుండెబోయిన సైదులు, కొత్తపల్లి నవీన్, కొత్తూరు రాము, కొల్లోజు శ్రీనివాస్, వాసు, నర్సింహ పాల్గొన్నారు.
మిర్యాలగూడ టౌన్: ఆజాద్ హింద్ సేనాని నేతాజీ సుభాష్‌చంద్రబోస్ ఆశయ సాధనలో ప్రతి యువకుడు ముందుండాలని హైద్రాబాద్ నగర గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. సోమవారం స్థానిక హిందువాహిని ఆధ్వర్యంలో నేతాజీ జయంతిని నిర్వహించారు. స్థానిక ఎన్‌విఆర్ ఫంక్షన్ హాలులో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ నేతాజీ దేశానికి చేసిన సేవలు మరవరానివన్నారు. దేశ స్వాతంత్య్రానికై ఆయన చేసిన వీరోచిత పోరాటం మరవరానిదన్నారు. ఆయన త్యాగాన్ని ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని కోరారు. ఆయన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలన్నారు. దేశంలో యువతకు ఉపాధి కల్పించేందుకు గాను ప్రధాని మోడి తీవ్ర కృషి చేస్తున్నారని అన్నారు. నోట్ల రద్దు అనంతరం కాంగ్రెస్ చేస్తున్న ఆందోళన అర్ధరహితమన్నారు. తొలుత స్థానిక తెలంగాణా చౌరస్తా వద్ద నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రదర్శనగా భారీ జెండాలతో అంబేద్కర్ రోడ్డు, రాజీవ్ చౌక్, కలాల్‌వాడ, హౌజింగ్‌బోర్డు గుండా ఫంక్షన్‌హాలుకు చేరుకున్నారు. కార్యక్రమంలో వాహిని రాష్ట్ర అధ్యక్షుడు రాజవర్ధన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పి.వెంకటరమణ, రామకృష్ణారెడ్డి, బిజెపి నాయకులు మదన్‌మోహన్ పాల్గొన్నారు. అదే విధంగా నేతాజీ స్కూల్‌లో నేతాజీ జయంతిని ఘనంగా జరిపారు. విద్యార్ధులు ఊరేగింపుగా వెళ్లి గాంధీనగర్‌లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీపతి శ్రీనివాస్, ఎంఇఓ చంప్లానాయక్, ప్రధానోపాధ్యాయులు భీమ్లానాయక్, శ్రీదేవి, భవాని, నూరిబేగం, అలివేలు, శైలజ, సునిత, శ్రీను, కుమార్, రమేష్, రాజు, సురేష్, హరి, సుమన్‌లు పాల్గొన్నారు. అదే విధంగా కెఎన్‌ఎం డిగ్రీ కళాశాలలో నేతాజీ చిత్రపటానికి ప్రిన్సిపల్ పి.రవీందర్, అధ్యాపకులు ఎస్‌కె.గాలిబ్, కృష్ణయ్య, ప్రభాకర్‌రావు, వెంకట్‌రెడ్డిలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎబివిపి ఆధ్వర్యంలో నేతాజీ చిత్రపటానికి పూలమాలలు సిఐ బిక్షపతి, ఆర్‌ఎస్‌ఎస్ కార్యనిర్వాహక్ శ్రీ్ధర్ నివాళులర్పించారు.
కోదాడ: యువత నేతాజీని స్ఫూర్తిగా తీసుకొని త్యాగం, పట్టుదలను అలవర్చుకొని ముందుకుసాగాలని తెలుగుదేశం నాయకులు కట్టా సతీష్, తెలుగుయువత నాయకులు మైసా రమేష్ కోరారు. నేతాజీ 120 జయంతి ఉత్సవాలను కోదాడలో సోమవారం తెలుగుయువత ఘనంగా నిర్వహించింది. నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.