నల్గొండ

నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 24: జిల్లాలో నేడు బుధవారం జాతీయ ఓట్లర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషిలో ప్రజలు, యువత, విద్యార్థులు, పార్టీలు భాగస్వామ్యం కావాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లో జెసి సి.నారాయణరెడ్డితో కలిసి నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు జాతీయ ఓటర్ల దినోత్సవం 2017సందర్భంగా కలెక్టరేట్ నుండి నల్లగొండ గడియారం సెంటర్ వరకు 2017అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. అనంతరం గడియారం సెంటర్‌లో ఓటర్ల దినోత్సవం సదస్సు నిర్వహిస్తామన్నారు. అదే విధంగా జిల్లాలోని 1537పోలింగ్ కేంద్రాల్లో, అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ర్యాలీలు, 2కెరన్‌లు, ప్రచార కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ప్రజలతో ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ నిర్వహింపబడుతుందన్నారు. ఇదే రోజు 26వ తేదిన నీతి అయోగ్ కార్యక్రమం కింద జిల్లాలోని 502గ్రామపంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించాలని సర్పంచ్‌లను, కార్యదర్శులను, ఎంపిడివోలను ఆదేశించామన్నారు. నీతి అయోగ్ కింద 15సంవత్సరాల విజన్ డాక్యుమెంట్ లక్ష్యాల రూపకల్పన చేసుకునేందుకు ఈ గ్రామసభలు నిర్వహించాల్సివుందన్నారు. గ్రామసభల్లో గ్రామాభివృద్దికి, వౌలిక వసతుల కల్పనకు అవసరమైన పనులు, ప్రణాళికలు రూపొందించి నివేధికలను సమర్పించాలన్నారు. వాటిని నీతి అయోగ్‌కు పంపిస్తామన్నారు. విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత, వౌలిక వసతులు, కృషి వికాస్ కార్యక్రమాల నిర్వాహణ ప్రణాళికలను గ్రామసభలో నిర్ధేశించుకోవాల్సివుంటుందన్నారు. గతంలో ఉన్న ఐదేళ్ల పంచవర్ష ప్రణాళికల స్థానంలో నీతి అయోగ్ ప్రణాళికను కేంద్రం రూపొందిస్తుందన్నారు. జిల్లాలో జాతీయ బాలికాదినోత్సవం విజయవంతంగా నిర్వహించుకున్నామన్నారు. జిల్లాలో గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా సాగుతున్న ఆడశిశువుల విక్రయాలు, భ్రూణ హత్యల నివారణకు మా ఇంటి లక్ష్మి పథకాన్ని జిల్లా యంత్రాంగం ప్రారంభించిందన్నారు. ఈ పథకం కింద కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన స్ర్తి, శిశు సంక్షేమపథకాలను సమర్ధవంతంగా అమలు చేసేందుకు జిల్లా మహిళాధికారులతో కమిటీలు, గ్రామ, మండల కమిటీలు కృషి చేస్తాయన్నారు.
భద్రతపై విద్యార్థుల అద్భుత ప్రదర్శన
నార్కట్‌పల్లి, జనవరి 24: రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రతి వ్యక్తి భద్రతపై అవగాహన పెంచుకోవాలని కోరుతూ నార్కట్‌పల్లిలో విద్యార్ధినీ, విద్యార్ధులు నిర్వహించిన అద్భుత ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. మంగళవారం రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ఆర్టీసి ఆధ్వర్యంలో నిర్వహించిన భద్రత వారోత్సవాల ర్యాలీలో విద్యార్ధులు పాల్గొని జాతీయ రహదారిపై ప్లేకార్డులతో ర్యాలీ నిర్వహించి బస్టాండ్ ప్రయాణికుల ప్రాంగణంలో ప్రమాదాలు జరుగుతున్న తీరును, నివారణ తీసుకోవల్సిన జాగ్రత్తలపై ప్రదర్శనలు ఇచ్చారు. విద్యార్ధులు అద్భుతంగా ట్రాఫిక్‌లో నేటి సమాజం ప్రయాణికులు, వాహనదారులు సెల్‌ఫోన్లతో డ్రైవింగ్ విధానం, ట్రాఫిక్ నిబంధనలకు వ్యతిరేకంగా వాహనాలను నడిపే విధానం, హెల్మెట్ ధరిస్తే కలిగే రక్షణపై సమగ్రంగా నృత్య ప్రదర్శన చేశారు. ఆర్టీసి డ్రైవర్లు, ప్రైవేటు వాహనడ్రైవర్లు నిబంధనలకు వ్యతిరేకంగా వాహనాలు నడపడం వల్ల బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు రక్షణ లేకుండా పోతుందని, ప్రయాణికులకు భరోసా ఇచ్చేందుకు డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలని కూడా విద్యార్ధులు ప్రదర్శనలో వివరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిపొ మేనేజర్ చంద్రమోహన్ మాట్లాడుతూ విద్యార్ధులు ఇచ్చిన అద్భుత ప్రదర్శన తమ ఆర్టీసి కార్మికుల మనస్సులు చలించిపోయాయన్నారు. ప్రమాదాలను కంటికి కనపడినట్లుగా చిత్రీకరించడంతో తామంతా ముగ్దులమయ్యామన్నారు. ఇదే సమయంలో ప్రతి విద్యార్ధులు, కార్మికులంతా సమైఖ్యంగా ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు యూసుఫ్, అలీ, నారాయణ, తదితరులు పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ సాంస్కృతిపై సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.