నల్గొండ

వరుసగా చిక్కుతున్న అవినీతి చేపలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 27: ప్రభుత్వం భారీగా వేతనాలు పెంచినప్పటికి ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల్లో అవినీతి సొమ్ముకు ఆశపడే అలవాటు తగ్గడం లేదు. తమ వద్ధకు వివిధ పనుల కోసం వచ్చే ప్రజలను, రైతులను, వ్యాపారులను, కాంట్రాక్టర్లను లంచం సొమ్ము కోసం పీడిస్తు చివరకు అవినీతి సొమ్ము ఎరకు బలై ఎసిబి చిక్కుతున్నా అధికారులను చూసైనా మిగతా అధికారుల్లో మార్పు రాకపోవడంతో ఎసిబి వలకు చిక్కుతున్న అవినీతి చేపల సంఖ్య రానురాను పెరిగిపోతుంది. జిల్లాలో ఈ నెల 12న రైస్‌మిల్లర్ల నుండి లక్ష రూపాయలు లంచం తీసుకుంటు ఏకంగా విజిలెన్స్ ఎస్పీ భాస్కర్‌రావు ఎసిబి చిక్కిన ఉదంతం మరువకముందే మరో జిల్లా అధికారియైన ఆర్‌డబ్ల్యుఎస్, మిషన్ భగీరథ ఎస్‌ఈ రమణనాయక్ ఎసిబి దాడులకు గురవ్వడం అధికారుల అవినీతి పర్వానికి పరాకాష్టగా నిలిచింది. కృష్ణా పుష్కరాల్లో మంచినీటి ఫ్లాంట్‌ల ఏర్పాటుకు సంబంధించిన బిల్లుల చెల్లింపు చేసేందుకు కాంట్రాక్టర్ నుండి 6లక్షల లంచం సొమ్మును ఎస్‌ఈ ఆదేశాల మేరకు సూపరిండెంట్ లక్ష్మారెడ్డి తీసుకుంటు ఎసిబికి చిక్కడం అధికారుల అవినీతి పర్వానికి పరాకాష్టగా నిలిచింది. ఈ వ్యవహారంలో ఎసిబి అధికారులు లక్ష్మారెడ్డితో పాటు ఎస్‌ఈ రమణనాయక్‌ను సైతం అరెస్టు చేసి విచారిస్తున్నారు. జిల్లాలో ఒకే నెలలో ఇద్దరు జిల్లా అధికారులు ఏసిబికి చిక్కడం చర్చనీయాంశమైంది.
రెండేళ్లలో 33 మంది పట్టివేత
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గడిచిన రెండేళ్లలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 33మంది అధికారులు, ఉద్యోగులు ఎసిబి దాడుల్లో పట్టుబడ్డారు. ఎక్కువగా విద్యుత్, రెవెన్యూ శాఖల ఉద్యోగులు ఎసిబికి చిక్కుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 2015లో మొత్తం 21మంది అధికారులు ఎసిబికి చిక్కారు. ఇందులో కలెక్టరేట్ ఉద్యోగులు సైతం ఉన్నారు. 2016లో తొమ్మిది మంది ఎసిబికి చిక్కారు. ఈ ఏడాది ప్రారంభం జనవరి నెల పూర్తికాకముందే ఇద్దరు జిల్లా అధికారులు, ఒక సూపరిండెంట్ ఏసిబికి చిక్కారు. ఇప్పటిదాకా పట్టుబడిన వారిలో ఎక్కువగా విద్యుత్ శాఖ నుండి ట్రాన్స్‌కో ఏఈలు ఐదుగురు, ఒక డిఈ, డిసిటీవో, విద్యాశాఖ ఉద్యోగి, పది మంది విఆర్‌వోలు ఉన్నారు. జిల్లాలో వ్యవసాయ, రెవెన్యూ, విద్యుత్, మైనింగ్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్, వాణిజ్యపన్నులు, కలెక్టరేట్‌లోని వివిధ విభాగాల్లో ఏళ్ల తరబడిగా పేరుకుపోయిన అధికారులపై, ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు చోటుచేసుకుంటున్నాయి. తరుచు ఉద్యోగుల బదిలీ సాగితేనే అవినీతికి కొంత అడ్డుకట్ట పడవచ్చన్న వాదన వ్యక్తమవుతుంది.

డబుల్ బెడ్‌రూం ఇళ్ల వద్ద
అంగన్‌వాడీ కేంద్రాలు
* గృహనిర్మాణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి చిత్ర రామచంద్రన్
సూర్యాపేట, జనవరి 27: ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న రెండు పడక గదుల ఇండ్లలోకి వచ్చే వారంత బిపిఎల్ కుటుంబాలకు చెందిన వారే ఉంటారని అలాంటి కుటుంబాల్లో మహిళలు పిల్లలను ఇండ్లలో వదిలేసి పనులకు వెళ్తారని దీన్ని దృష్టిలో పెట్టుకొని డబుల్‌బెడ్‌రూం ఇళ్ల వద్ద ఒక అంగన్‌వాడీ కేంద్రాన్ని, ప్రాథమిక పాఠశాలను ఏర్పాటుచేయాలని గృహనిర్మాణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిత్రరామచంద్రను అధికారులకు సూచించారు. శుక్రవారం హైదరాబాద్ నుండి ఖమ్మం వెళ్తున్న ఆమె మార్గమద్యలో సూర్యాపేట రహదారి బంగ్లాలో ఆగారు. ఈ సందర్భంగా ఆమె పట్టణంలో నిర్మాణంలో ఉన్న రెండు పడక గదుల ఇండ్లను పరిశీంచారు. ఈ సందర్భంగా ఆమె ఇండ్ల నిర్మాణ పనులు జరుగుతున్న తీరు పట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్, గృహనిర్మాణ శాఖ చీఫ్ ఇంజనీర్ ఎస్. ఈశ్వరయ్య, పిడి రాజ్‌కుమార్, ఆర్‌అండ్‌బి ఈఈ గోవర్దన్‌రెడ్డి, డిఈ మహిపాల్‌రెడ్డి, తహశీల్దార్ మహమూద్ అలీ, ఆర్‌ఐ ఇంద్రకుమార్‌లు పాల్గొన్నారు.