నల్గొండ

రహదారిపై మొక్కల పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్యాల, జనవరి 30: హరితహారం కార్యక్రమంలో రహదారికి ఇరువైపులా నాటిన మొక్కల ప్రాంతాల్లో సిబ్బంది చెత్తాచెదారం పిచ్చిమొక్కలను సిబ్బంది తొలగించడం సిబ్బంది పనితీరును సోమవారం జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, సంయుక్త కలెక్టర్ నారాయణరెడ్డి, ఆర్‌డివో ఇ. వెంకటాచారి, జెడ్పీ ఇన్‌చార్జి సిఇవో ఆర్. అంజయ్యలు పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈనెల 31న(నేడు) ఖమ్మం జిల్లాలో పర్యటనకు రోడ్డుమార్గం ద్వారా వాహనంలో వెళుతున్నందున రహదారి పక్కన హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను పరిశీలించే అవకాశాలున్నందున అధికారులు సిబ్బందిచే శుబ్రం చేయిస్తున్నారు.
మండల పరిధిలో జాతీయ రహదారికి ఇరువైపులా ఎంపిడివో కాంతమ్మ, తహశీల్దార్ పుష్పలత, ఇవోఆర్‌డి లాజర్‌లు సిబ్బందితో మొక్కల ప్రాంతాలను శుబ్రం చేయిస్తున్నారు. మొక్కల వద్ద సిబ్బంది చేపట్టిన పనులను కలెక్టర్, జెసి, ఆర్‌డివో, జెడ్పీ ఇన్‌చార్జి సిఇవోలు పరిశీలించారు.
టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడ్తాం

* బిజెపి శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి
భువనగిరి, జనవరి 30: కేంద్ర ప్రభుత్వ నిధులను దారిమళ్లించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెడ్తామని బిజెపి శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం నిర్వహించిన యాదాద్రి భువనగిరి జిల్లా బిజెపి కార్యవర్గం సమావేశంలో ముఖ్యఅతిథిగా కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతు బిజెపి ప్రభుత్వం బిజెపేతర ప్రభుత్వాలకు వ్యతిరేకం కాదని ప్రజావ్యతిరేక విదానాలు చేపడుతున్న ప్రభుత్వాలకు మాత్రమె వ్యతిరేకమని వివరించారు. పార్టీని బలోపేతం చేసేందుకు తెలంగాణా రాష్ట్రంలొ బిజెపి జాతీయధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రకమిటి సభ్యులు పర్యటించనున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరువుపరిస్థితులలో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు విడుదల చేసిన 701కోట్ల రూపాయల ఇన్‌పుట్ సబ్సిడి నిధులను టిఆర్‌ఎస్ ప్రభుత్వం దారిమళ్లించి స్వప్రయోజనాలకు ఉపయోగించడం రైతులను మోసం చేయడమేనన్నారు. అదేవిదంగా ఉపాధి హామి కూలిల నిధులు, స్వచ్చ్భారత్, ఫీజ్‌రియంబర్స్‌మెంట్ నిధులు రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.తెలంగాణ రాష్ట్భ్రావృద్ధికి మోడి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వంతు నిధులు కెటాయించకపోవడంతోనె ఎంఎంటిఎస్ పనులు ఆలస్యవౌతున్నట్లుగా ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం గృహవసతిలేని పేదకుటుంభాలకు ఇండ్లను మంజూరిచేసినా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టకోసం డబుల్ బెడ్‌రూం గృహనిర్మాణాల పేరుతో కాలయాపన చేస్తున్నట్లుగా తెలిపారు. రాష్ట్రంలో కొనసాగిస్తున్న పేదలకు రూపాయికి కిలోబియ్యం సరఫరాలో ఇస్తున్న సబ్సిడిలో కిలోబియ్యానికి ప్రజలు రూపాయి చెల్లిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం 2రూపాయలు చెల్లిస్తుందని కేంద్రప్రభుత్వం 29.67రూపాయల సబ్సిడిని భరిస్తుందన్నారు.