నల్గొండ

అకౌంటెంట్ గదికి తాళం వేసిన మున్సిపల్ చైర్‌పర్సన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోదాడ, ఏప్రిల్ 12: కోదాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా చేయాలనే తన సంకల్పానికి మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది పలుమార్లు ద్వజమెత్తిన సహకరించడంలేదని ఆరోపిస్తూ మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ వంటిపులి అనిత నాగరాజు మంగళవారం మధ్యాహ్నం తానే స్వయంగా అకౌంటెంట్ గది వద్దకు తాళం వేశారు. ఛైర్‌పర్సన్ అనిత విలేఖరులతో చెప్పిన వివరాల మేరకు ఉదయం 11 గంటలకు మున్సిపాలిటీకి వచ్చిన తాను అకౌంటెంట్ మునీమ్‌ను పిలిచి చెక్ విడుదల నమోదు రిజిష్టర్‌ను పరిశీలిస్తానని, తెచ్చి చూపించాల్సిందిగా కోరారు. గంట సమయం వేచిచూసినా అకౌంటెంట్‌నుండి స్పందన లేకపోవడంతో అకౌంటెంట్ కొరకు ఛైర్‌పర్సన్ అనిత అటెండర్‌ను పంపగా అతను కార్యాలయంలో లేడు. ఫోన్ చేస్తే స్విఛ్చ్ఫా రావడంతో అకౌంటెంట్ అసిస్టెంట్ కుమార్‌కు ఫోన్ చేస్తే అతను బ్యాంక్‌లో వున్నట్లు చెప్పి వచ్చేసరికి మరో గంట సమయం పట్టింది. చెక్ విడుదల నమోదు రిజిష్టర్‌ను చూపించడంలో అకౌంటెంట్ ప్రదర్శించిన నిర్లక్ష్యంపై ఆగ్రహించిన ఛైర్‌పర్సన్ అనిత అకౌంటెంట్ గది వద్దకు తాను స్వయంగా వెళ్లి తాళం వేశారు. ఈలోగా వచ్చిన అసిస్టెంట్ కుమార్‌ను అడిగితే రిజిష్టర్ గురించి తనకు తెలియదని చెప్పడంతో ఆగ్రహించిన అనిత తరువాత తన ఛాంబర్‌లో విలేఖరులతో మాట్లాడుతూ మున్సిపాలిటీ సిబ్బంది, అధికారులు బాధ్యతారాహిత్యంతో పనిచేస్తున్నారని ద్వజమెత్తారు. గతంలో తాను అడిగినప్పుడు చూపించిన రిజిష్టర్‌ను ఇప్పుడు తాను పరిశీలించేందుకు అడిగితే ఎందుకు చూపించకుండా మొహం చాటేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. అధికారులు, సిబ్బంది తనకు సహకరించకపోవడాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతానని అనిత ప్రకటించారు. కౌన్సిలర్‌లు వాడపల్లి వెంకటేశ్వర్లు, దండ వీరభద్రం, సోమగాని ఖాజాగౌడ్ మాట్లాడుతూ మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం వలన ప్రజల మంచినీటి అవసరాలను తీర్చేందుకు గత సంవత్సరం విడుదలైన బడ్జెట్‌లో సుమారు 25 లక్షల రూపాయలు ఖర్చు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని ద్వజమెత్తారు. నిధులు ఎందుకు ఖర్చు చేయలేదంటే ఫైల్ ఇఇ దగ్గర వుందని చెపుతున్నారని వారు ఆరోపించారు. కౌన్సిల్ సమావేశాల్లో, కార్యాలయంలో అనేకసార్లు అడిగిన స్టాక్ రిజిష్టర్‌ను ఎందుకు చూపించడం లేదని సిబ్బందిని, అధికారులను వారు నిలదీసారు.