నల్గొండ

చెక్‌డ్యాంతో కరవును పారదోలుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలేరు, ఫిబ్రవరి 3: ఆలేరు పెద్దవాగుపై సాయిగూడెం వద్ద 1 కోటి 85 లక్షల 75 వేల రూపాయలతో నిర్మించే చెక్‌డ్యాం వల్ల ఆలేరు ప్రాంతంలో శాశ్వతంగా కరవును నివారిస్తామని ప్రభుత్వ విప్ గొంగిడి సునితా మహేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక రహదారి బంగ్లాలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గత పాలకుల ఉదాసీనత వల్ల ఆలేరు ప్రాంతం కరవుతో కొట్టుమిట్టాతుందన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వంలోకి వచ్చాక జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సహకారంతో చెక్‌డ్యాంకు అవసరమైన నిధులను జనవరి 19న విడుదల చేయడం జరిగిందన్నారు. ఈసందర్భంగా వారికి కృలజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంపిపి అనసూర్య, జడ్పీటిసి పరమేశ్వర్, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఆకవరం మోహన్‌రావు, నాయకులు మధు, విజయ్, డానియల్, తదితరులు పాల్గొన్నారు.

పోలీసుల బందోబస్తుల మధ్య భూముల సర్వే ప్రశాంతం
మఠంపల్లి, ఫిబ్రవరి 3: మండలంలోని గుర్రంపోడుతండా సమీపంలోని సర్వే నెం.540లో శుక్రవారం పోలీసు బందోబస్తు మధ్య భూముల సర్వే ప్రశాంతంగా జరిగింది. హుజూర్‌నగర్ సిఐ వరాల నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఎలాంటి ఘటనలు జరగకుండా వంద మంది పోలీసులతో భద్రతను ఏర్పాటుచేశారు. తహశీల్దార్ యాదగిరి, ఆర్‌ఐ శైలజ నేతృత్వంలోని ఎనిమిది మంది రెవెన్యూ బృందం ఈ సర్వేను నిర్వహించింది. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ గ్లేడ్ మినర్ ఫోర్స్ కంపెనీ సర్వే నెం.540లో ఉన్న 400ఎకరాల భూమికి హద్దులు చూపాలని హైకోర్టును ఆశ్రయించగా వారి ఆదేశం మేరకు ఈ సర్వేను నిర్వహించామన్నారు.
మూడోసారి విజయవంతం
గతంలో ఈ భూముల సర్వే కోసం రెండుసార్లు ప్రయత్నించినా రెవెన్యూ యంత్రాంగానికి గిరజనుల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. దీంతో రెండుసార్లు వాయిదాపడ్డ సర్వే ఎట్టకేలకు ముగిసింది. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు రాణి, రంజిత్‌రెడ్డి, రవికుమార్, పరమేశ్, జగన్మోహన్, యాదవేంద్రరెడ్డి, సర్వేయర్ సురేశ్, విఆర్‌ఓలు యాదయ్య, వాసు, నర్సింహారావు, రాంబాబు, శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.