నల్గొండ

పేద, మధ్యతరగతికి వ్యతిరేకంగా బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేటటౌన్, ఫిబ్రవరి 3: ఈనెల 22నుండి మార్చి 1వరకు సూర్యాపేట జిల్లాలో జరిగే మహాజన పాదయాత్రను జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ఎంవీఎన్ భవన్‌లో నిర్వహించిన జిల్లా కమిటీ సభ్యుల, మండల కార్యదర్శుల, ప్రజాసంఘాల బాధ్యుల సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయం- సమగ్రాభివృద్ధికై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్టవ్య్రాప్తంగా 5నెలలు 4వేల కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. ఈ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. ఇటీవల కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన పేద, మధ్యతరగతి ప్రజలకు వ్యతిరేకంగా ఉందన్నారు. కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు, పారిశ్రామిక వేత్తలకు వేలకోట్ల ప్రయోజనం కల్గించే విధంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆందోళన చేస్తుందన్నారు. మూడు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో బిజెపికి ప్రజలు బుద్దిచెప్పడం తప్పదన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ముల్కలపల్లి రాములు, జిల్లా కార్యదర్శివర్గసభ్యులు మల్లు లక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, నాయకులు దీరావత్ రవినాయక్, బుర్రి శ్రీనివాస్, పారెపల్లి శేఖర్‌రావు, వెంకటేశ్వర్లు, వెంకట్‌రెడ్డి, గోవింద్, బుర్రి శ్రీరాములు, కోట గోపి, మట్టిపెల్లి సైదులు, ధన్యాకుల శ్రీకాంత్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌కు పట్టిన గతే టిఆర్‌ఎస్‌కు..
* మతపరమైన రిజర్వేషన్లకు బిజెపి వ్యతిరేకం
* బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్
యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 3: అంబేద్కర్ నిర్ణయాలకు భిన్నంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం ముస్లింలకు 12శాతం మతపరమైన రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించడం మంచి పద్ధతి కాదని బిజెపి రాష్ట్రఅధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. రాబోయే కాలంలో కాంగ్రెస్‌కు పట్టిన గతే టిఆర్‌ఎస్‌కు పడుతుందని విమర్శించారు. శుక్రవారం లక్ష్మణ్ యాదాద్రి శ్రీ లక్ష్మినర్సింహ్మస్వామి ఆలయాన్ని సందర్శించారు. దైవదర్శణం చేసుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారులు స్వామి ఆశీస్సులు అందజేశారు. అనంతంరం ఆయన హరిత హోటల్లో విలేకర్లతో మాట్లాడారు. తాము మత పరమైన రిజర్వేషన్లకు తమ పార్టీ వ్యతిరేకమని చెప్పారు. 4వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు,్ధర్నాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కెసిఆర్ ఓటు బ్యాంక్ రాజకీయాలు మానుకోవాలని లేదంటే ప్రజలే బుద్ది చెబుతారని అన్నారు. సమావేశంలో కాసం వెంకటేశ్వర్లు, రాఘవుల నరేందర్, లెంకల పల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.