నల్గొండ

కౌన్సిలర్ల మధ్య విభేదాలతో ఓ నిండు ప్రాణం బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, ఫిబ్రవరి 3: దేవరకొండ నగరపంచాయతీ కార్యాలయంలో కౌన్సిలర్ల మధ్య ఉన్న విభేదాలు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. అధికారులు చట్టబద్ధంగా తమ విధులు నిర్వర్తించకుండా కౌన్సిలర్ల మాటలకే విలువ ఇస్తుండడంతోరెండు గదులు నిర్మించుకుందామనుకున్న ఆలేటి సాల్మన్‌రాజ్ (56) అనే ఓ సామాన్యుడు అధికారుల ఒత్తిళ్ళు తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో మృతుని కుటుంబసభ్యులు శుక్రవారం నగరపంచాయతీ కార్యాలయం ఎదుట శవంతో బైఠాయించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతుని బంధువుల ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో సిఐ ఎంజిఎస్ రామకృష్ణ ఆందోళనకారుల వద్దకు వచ్చి సర్ధి చెప్పడంతో వివాదం సద్దు మణిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఆలేటి సాల్మన్‌రాజ్ పుట్టింది పెరిగింది దేవరకొండ పట్టణంలోనే. ప్రస్తుతం సాల్మన్‌రాజ్ హైద్రాబాద్‌లో ఆర్ అండ్‌బి శాఖలో వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పట్టణం లోని 15 వ వార్డులో తన పాత ఇంటి స్థలంలో నూతనంగా గృహనిర్మాణాన్ని చేపడుతున్నారు. ఇందుకుగాను నాలుగు మాసాల క్రితమే నిబంధనల ప్రకారం సాల్మన్‌రాజ్ ఎల్‌ఆర్‌ఎస్, భవన నిర్మాణాన్ని చేపట్టేందుకు చెల్లించాల్సిన డబ్బులను నగరపంచాయతీలో చెల్లించారు. అనంతరం ఇంటి నిర్మాణాన్ని చేపడుతుండగా మరో కౌన్సిలర్ కుమారుడు సాల్మన్‌రాజ్ ఇంటి నిర్మాణం చేపట్టకుండా టిపివో పై ఒత్తిళ్ళు తీసుకురావడంతో నగరపంచాయతీ సిబ్బంది రోజు అక్కడికి వెళ్ళి నిర్మాణం చేపట్టకుండా అడ్డుకుంటున్నారు. నిర్మాణం చేపడుతున్న స్థలం కోర్టు వివాదంలో ఉందని అక్కడ నిర్మాణానికి అనుమతి ఇవ్వవద్దని ఓ కౌన్సిలర్ కుమారుడు అధికారులతో ఒత్తిడి తీసుకురావడం, వార్డు కౌన్సిలర్ ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి తీసుకువస్తుండడంతో అధికారులు ఇంటి నిర్మాణానికి అడ్డుపడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో గత వారం రోజులుగా ఇంటి నిర్మాణం పై ఆందోళన చెందుతున్న సాల్మన్‌రాజ్ గురువారం హైద్రాబాద్‌లో గుండె పోటుతో మృతి చెందాడు. వై ఎస్ కరుణాకర్, మరో ముగ్గురు వ్యక్తులు తమ ఇంటి నిర్మాణానికి అడ్డుపడుతున్నారని వారు పెట్టిన ఇబ్బందుల వల్లే తన భర్త మానసిక వేదనతో గుండెపోటుతో మృతి చెందాడని మృతుని భార్య లక్ష్మి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదుపై విచారణ జరుపుతాం
వైఎస్ కరుణాకర్ అతనితో పాటు మరి కొంత మంది వ్యక్తులు తమ ఇంటి నిర్మాణానికి అడ్డుపడుతుండడం వల్లే మానసికంగా ఇబ్బంది పడ్డ తన భర్త సాల్మన్‌రాజు గుండెపోటుతో మృతి చెందాడని మృతుని భార్య లక్ష్మి శుక్రవారం ఫిర్యాదు చేసిందని సిఐ ఎంజిఎస్ రామకృష్ణ చెప్పారు. తమకు అందిన ఫిర్యాదు పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.