నల్గొండ

ప్రముఖ పుణ్యక్షేత్రంగా చెర్వుగట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 3: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా చెర్వుగట్టు విరాజిల్లుతుందని, సిఎం కెసిఆర్ త్వరలో క్షేత్రాన్ని సందర్శిస్తారని ఆలయాన్ని తెలంగాణకు తలమానికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం చెర్వుగట్టు వార్షిక బ్రహ్మోత్సవాలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. చెర్వుగట్టుకు వచ్చిన మంత్రి జగదీష్‌రెడ్డి, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎమ్మెల్యే వేముల వీరేశంలకు ఆలయ ఈవో గుత్తా మనోహర్‌రెడ్డి, అర్చకుల బృందం సాంప్రదాయ బద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్వతి జడల రామలింగేశ్వరుడికి మంత్రి జగదీష్‌రెడ్డి తలంబ్రాల బియ్యం, నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. జడలరామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవ ప్రారంభ పూజల్లో పాల్గొన్నారు. కార్యనిర్వాహణాధికారి కార్యాలయంలో బ్రహ్మోత్సవాల నిర్వాహణ ఏర్పాట్లను సమీక్షించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ చెర్వుగట్టు సుందర పుణ్యక్షేత్రమని, ప్రకృతి రమణీయంగా భక్తి అధ్యాత్మికతల వేదికగా ఉంటుందన్నారు. స్వామి దర్శనంతో తన మనస్సు పులకరించిందన్నారు. గర్భాలయంలోని పరుశరముడి ప్రతిష్టయైన రామలింగేశ్వరుడి విగ్రహం దర్శనంతో తాను పులకరించానన్నారు. ఈ క్షేత్రం యాదగిరిగుట్ట తర్వాతా తెలంగాణలో అంతటి ప్రాముఖ్యత క్షేత్రంగా తీర్చిదిద్ది నల్లగొండ జిల్లాకే వనె్న తెస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాలకు అభివృద్ధి పరిచే దిశగా నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా యాదగిరిగుట్ట క్షేత్రాన్ని ప్రపంచ స్థాయి దివ్యక్షేత్రంగా తీర్చిదిద్ధేందుకు ముందుకు సాగుతున్నామన్నారు. అదే కోవలో చెర్వుగట్టును కూడా ప్రముఖ శైవ క్షేత్రంగా తీర్చిదిద్ధేందుకు సిఎం కెసిఆర్‌ను తీసుకవచ్చి దేవాలయ అభివృద్ధికి నిధుల సాధనకు కృషి చేస్తామన్నారు. ఇప్పటికే హైద్రాబాద్-విజయవాడ, అద్దంకి-గుంటూరు రహదారులకు ఆనుకుని ఉన్న ఈ క్షేత్రం రవాణా సౌకర్యానికి అనుకూలంగా ఉన్నందున తగిన వౌలిక వసతుల కల్పనతో మంచి పుణ్యక్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా మారుతుందన్నారు. ఈబ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా జిల్లా అధికార యంత్రాంగం భక్తులకు లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేపట్టిందన్నారు. బ్రహ్మోత్సవాల అనంతరం చెర్వుగట్టు అభివృద్ధిపై సమీక్ష జరిపి మంచినీటి వసతి, మరుగుదొడ్ల నిర్మాణం, వసతి గృహాల సముదాయల విస్తరణకు ప్రణాళికలు, పనులు చేపడతామన్నారు. ప్రతి అమవాస్య రోజున ప్రత్యేకంగా జాతర సాగుతున్న చెర్వుగట్టును మరింత అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం ఘాట్ రోడ్డు అభివృద్ధి పనులను, సబ్ స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జడ్పీ చైర్మన్ ఎన్. బాలునాయక్, ఎంపి బూర నర్సయ్యగౌడ్, జెసి సి.నారాయణరెడ్డి, ఆర్డీవో వెంకటాచారి, మార్కెట్ చైర్మన్ పద్మ, జడ్పీటిసి సత్తయ్యయాదవ్, ఎంపిపి ఆర్. మల్లిఖార్జున్‌రెడ్డి, వైస్ చైర్మన్ రహీంఖాన్, సర్పంచ్ రమణ బాలకృష్ణ, అచ్చాలు, ఈవో గుత్తా మనోహర్‌రెడ్డి, ప్రధానార్చకులు రామలింగేశ్వరశర్మ, ప్రత్యేకార్చకులు సుబ్రమణ్యశర్మ పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో
పాలకులు విఫలం
* ఎఐసిసి అధికార ప్రతినిధి మధుయాష్కీ
చౌటుప్పల్, ఫిబ్రవరి 3: ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని ఎఐసిసి అధికార ప్రతినిధి, మాజీ ఎంపి మధుయాష్కీ ఆరోపించారు. చౌటుప్పల్ మండల కేంద్రంలోని రాజీవ్ స్మారక భవన్‌లో శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. రెండున్నర యేళ్ల పాలనలో కేంద్రంలోని ఎన్డీయే, రాష్ట్రంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించింది శూన్యమన్నారు. పాలకులపై ప్రజల్లో ఉన్న భ్రమలు తొలగిపోయి కాంగ్రెస్ వైపుకు చూస్తున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మాటలు కోటలు దాటుతున్నాయి తప్పా చేతలు తంగళ్లు దాటడంలేదన్నారు. మాటల గారడీతో మాయ చేస్తూ కాలం నెట్టుకువస్తున్నాడని విమర్శించారు. ఎపి, తెలంగాణ ముఖ్యమంత్రులు ప్రజా సంక్షేమం, ప్రాంతాల అభివృద్ధిని విస్మరిస్తూ గవర్నర్ పాదసేవ చేస్తున్నారన్నారు. పెద్ద నోట్లను రద్దు చేసి ప్రజలను కష్టాలు పెట్టాడు తప్పా ప్రధానమంత్రి మోదీ సాధించింది ఏమిలేదన్నారు. అవగాహన లోపంతో ప్రజలను ఇబ్బందులు పెట్టారన్నారు. ఇప్పటికీ స్పష్టమైన విధానాలను అవలంభించడంలేదన్నారు. 2019లో జరుగనున్న ఎన్నికల్లో రాహుల్‌గాంధీ సారథ్యంలో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేయాలని పిలుపునిచ్చారు. విలేఖరుల సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండు మల్లయ్యగౌడ్, మండల కమిటీ అధ్యక్షుడు చింతల వెంకట్‌రెడ్డి, బోయ రామచంద్రం, తిరుపతి రవీందర్, పల్చం సత్యం తదితరులు పాల్గొన్నారు.

పశుసంపద అభివృద్ధిని పెంపొందించాలి
* నూరు శాతం కృత్రిమ గర్భదారణను ప్రోత్సహించాలి
* జిల్లా పశుసంవర్థక శాఖ వర్క్‌షాపులో కలెక్టర్ సురేంద్రమోహన్
సూర్యాపేట, ఫిబ్రవరి 3: దేశంలో 70శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, రైతుల ఆకలి తీర్చేందుకు వ్యవసాయం, పశుసంవర్ధక శాఖలు ఎంతో దోహదడతాయని ఇకపై ఈ రెండు శాఖలు రైతుల ముంగిట సేవలందిస్తూ వారి జీవనోపాధిని పెంపొందించేలా చేయూతనివ్వాలని కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పశుసంవర్థక శాఖ కార్యాలయంలో జిల్లావ్యాప్తంగా పశుసంవర్థక శఋ౎ఖ అధికారులు, గోపాలమిత్ర సిబ్బందికి ఏర్పాటుచేసిన వర్క్‌షాపునకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతిరైతు పశుసంపద కలిగి ఉండి వాటిని పెంపొందించుకునేలా, వాటిని 100శాతం కృత్రిమ గర్భాదరణను ప్రోత్సహించేలా అవగాహన కలిపించాలన్నారు. కృత్రిమ గర్భాదరణ వల్ల ఎలాంటి వ్యాధులు సంక్రమించకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఎదుగుదల ఉంటుందనే విషయాన్ని రైతులకు తెలియజేయాలన్నారు. అదే విధంగా పశుసంపదలేని రైతులను గుర్తించి వారికి ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ రుణాలపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లావ్యాప్తంగా గర్భాదరణకు అర్హత కలిగిన పశువులను గుర్తించి వివరాలు నమోదు చేయాలన్నారు. ఇందుకు అవసరమైన గోపాలమిత్ర సిబ్బందిని పెంచుతామన్నారు. అగ్రికల్చర్ విభాగంతో పాటు వెటర్నరి విభాగం కూండా రైతులకు ఎంతగానో తోడ్పడుతుందని రెండు విభాగాలు రైతులకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ సేవలందించాలన్నారు. రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ సబ్సిడి రుణాల వివరాలు గ్రామాలల్లో రాత పేయింటిగ్స్ ఏర్పాటుచేయాలన్నారు. ఈ వర్క్‌షాపులు జిల్లావ్యాప్తంగా అన్ని మండలాలల్లో ఫిబ్రవరి 15వరకు నిర్వహించుకొని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పశు పోషకాల అభివృద్ధికి వైద్య సేవల మెరుగు, పశుగ్రాస ఏర్పాటు, సమయానుకూల శిక్షణ, మార్కెటింగ్ వౌలిక వసతుల ఏర్పాటు ఈ నాలుగు అంశాలు సక్రమంగా ఉండాలన్నారు. అలాగే త్వరలో జిల్లాకేంద్రంగా ప్రభుత్వ వెటర్నరి పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు అదే విధంగా కోదాడ పట్టణంలో 10 ఎకరాల విస్తీర్ణంలో రాష్టస్థ్రాయి వైద్య వైద్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామని ఇందుకు స్థల సేకరణ జరుగుతుందన్నారు. త్వరలోనే వెటర్నరి విభాగం జిల్లా సమావేశం నిర్వహించనున్నామని ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విద్యుత్ శాఖ గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి హాజరవుతారని తెలిపారు. ఈ వర్క్‌షాపులో జిల్లా పశువైద్య సంవర్థక శాఖ అధికారి డాక్టర్ నర్సింహ్మరెడ్డి, పశు గణాభివృద్ది సంస్థ చైర్మన్ పిచ్చిరెడ్డి, సహయ సంచాలకులు డాక్టర్ క్రిష్ణ, శ్రీనివాసరావు, ఈవోలు దేవేందర్, అనిల్‌కుమార్, అన్ని మండలాల పశువైద్యాధికారులు గోపాలమీత్ర సిబ్బంది పాల్గొన్నారు.

బీబీనగర్-నడికుడి డబ్లింగ్‌కు మొండిచేయి
జాన్‌పహడ్-జగ్గయ్యపేట్ లైన్‌కు 79కోట్లు * యాదాద్రి ఎంఎంటిఎస్ పొడగింపునకు 16.3కోట్లు * ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపులు

నల్లగొండ, ఫిబ్రవరి 3: కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపుల వివరాలను దక్షిణ మధ్య రైల్వే శాఖ శుక్రవారం ప్రకటించింది. బడ్జెట్ కేటాయింపులు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు సంబంధించి కొంత మోదం, మరికొంత ఖేదమన్నట్లుగా ఉన్నాయి. కొత్త రైల్వే లైన్లు, పెండింగ్ పనులకు బడ్జెట్‌లో కేటాయింపులు చేయలేదు. అయితే పురోగతిలో ఉన్న జానపహడ్-మేళ్లచెర్వు-జగ్గయ్యపేట రైల్వే లైన్ పనుల పూర్తికి ఈ బడ్జెట్‌లో 79కోట్లు కేటాయించడంతో పనులు వేగం పుంజుకోనున్నాయి. అలాగే ఘట్‌కేసర్ నుండి యాదాద్రి దేవస్థానం రాయగిరి స్టేషన్ వరకు ఎంఎంటిఎస్ రైలు పొడగింపుకు అదనంగా 16కోట్లు కేటాయించడంతో కేంద్ర-రాష్ట్రాలు ఉమ్మడి భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు త్వరలో టెండర్ల ప్రక్రియను పూర్తి చేసుకుని పనుల నిర్వాహణ దిశగా సాగనున్నాయి. రెండు తెలుగురాష్ట్రాలకు సంబంధించి పలు కొత్త లైన్ల సర్వేకు, మరికొన్నింటి నిర్మాణానికి బడ్జెట్‌లో కేటాయింపులున్నప్పటికి వరంగల్-సూర్యాపేట-మిర్యాలగూడ లైన్ సర్వేకు, నల్లగొండ-మాచర్ల లైన్ పనులకు కేటాయింపులు దక్కలేదు. ముఖ్యంగా బీబీనగర్-నడికుడి డబ్లింగ్‌కు ఈ దఫా కూడా నిధుల కేటాయింపు లేకపోవడం తీవ్రంగా ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలకు తీవ్ర నిరాశేనే మిగిల్చింది. అలాగే మూడు జిల్లాల పరిధిలోని రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు నిధుల కేటాయింపు కూడా జరుగకపోవడం ఈ జిల్లాల ఎంపిలను, ప్రజాప్రతినిధులను నిరాశ పరిచినట్లయ్యింది.