నల్గొండ

పరికరాల కొనుగోలుకు నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఫిబ్రవరి 7: ఉమ్మడి జిల్లా ఆసుపత్రి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. మంగళవారం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. అంతకుముందు ఆసుపత్రిలోని అన్ని విభాగాలను తనిఖీ చేశారు. ప్రసూతి వార్డు, అక్షయ పిల్లల ఆరోగ్య పునరరుజ్జీవ కేంద్రం, నవజాత శిశు సంరక్షణ కేంద్రం, సంజీవని కేంద్రం, చిన్నపిల్లల వార్డు, ఆపరేషన్ థియేటర్, కంటి, ఫిజియోథెరపి విభాగాలు, వైకల్య నిర్ధారణ తదితర విభాగాలను ఆయన పరిశీలించారు. స్వయాన డాక్టర్‌యైన కలెక్టర్ రోగులను స్వయంగా పరీక్షించి వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యాధికారులతో ఆసుపత్రి సమస్యలను సమీక్షించారు. ఆసుపత్రికి అవసరమైన ఆధునాతన వైద్య పరికరాల నివేదికను అందించాలన్నారు. ప్రభుత్వ పరమైన నిధులతో పాటు ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ నిధుల నుండి ఆత్యవసర పరికరాలను కొనుగోలు చేసే విధంగా సొసైటీ సమావేశంలో తీర్మానం ఆమోదించాలని సూచించారు. ఆల్ట్రాసౌండ్ సిస్టిమ్, శవపరీక్ష నిర్వహించే, వివిధ ఆసుపత్రి విభాగాలను, ఇంటర్నల్ ఫోన్ సౌకర్యం, ఖాళీ పోస్టుల భర్తీ అంశాలపై కలెక్టర్ ఆసుపత్రి వైద్యులతో చర్చించారు. శాఖపరంగా సరఫరా చేయని వైద్య పరీక్షల నిర్ధారణ పరికరాల వివరాలను సొసైటీకి నివేధించాలన్నారు. వైద్యాధికారులు కూడా తమ వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. వైద్యులు సమిష్టిగా పనిచేసి ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం కల్పించాలన్నారు. ఆసుపత్రి తనిఖీ సమయంలో సురేష్ వౌనిక దంపతులకు రెండో కాన్పులో ఆడ శిశువు జన్మించగా వారికి ప్రభుత్వం నుండి అందించాల్సిన ఆర్ధిక సహాయాన్ని అందించాలని ఆదేశించారు. చిన్నపిల్లల వార్డుల్లో చికిత్స పొందుతున్న అఖిల్‌కు అందుతున్న వైద్యసేవలపై కలెక్టర్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం అతడిని హైద్రాబాద్‌కు తరలించాలని సూచించారు.