నల్గొండ

సురక్షిత తాగునీటి పంపిణీకే ’్భగీరథ‘

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఫిబ్రవరి 7: తెలంగాణ ప్రజలందరికి సురక్షిత తాగుజలాలు అందించేందుకు సీఎం కెసిఆర్ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకంతో కృషి చేస్తుందని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ కోటా నిధులతో నిర్మించిన మంచినీటి వాటర్ ఫ్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతు మిషన్ భగీరథ పథకంతో పల్లెలు, పట్టణాల్లో ఇంటింటికి మంచినీటిని 2018లోగా అందించేందుకు కెసిఆర్ ప్రభుత్వం గట్టిపట్టుదలతో పనులు కొనసాగిస్తుందన్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం 35వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. ముస్లింలకు షాదీ ముబారక్, 12శాతం రిజర్వేషన్లు, మైనార్టీ గురుకులాల ఏర్పాటు, బడ్జెట్‌లో మైనార్టీల సంక్షేమానికి అధిక నిధులు కేటాయిస్తు ప్రభుత్వం వారి సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లతో పేదలు, మహిళల సంక్షేమానికి బాసటనిస్తుందన్నారు. కోటి ఎకరాలకు సాగునీరందించేందుకు ఇరిగేషన్ ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ పథకాలు సాగుతున్నాయన్నారు. ఐటి, పారిశ్రామిక రంగాల ప్రగతికి, వ్యవసాయం, ఉద్యానవన రంగాల అభివృద్దికి ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి దుబ్బాక నరసింహారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, వార్డు కౌన్సిలర్ మారగోని నవీన్‌గౌడ్, అబ్బగోని రమేష్, కొండేటి మల్లయ్య, అభిమన్యు శ్రీనివాస్, దుబ్బ అశోక్ సుందర్, రహీంఖాన్, ఔట రవిందర్, ఖయ్యుంబేగ్, కవితావేణుగోపాల్, వైద్యులు రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

పెద్దగట్టుకు పటిష్ట భద్రత
సూర్యాపేట, ఫిబ్రవరి 7: తెలంగాణలోనే రెండవ అతిపెద్ద జాతరగా పేరొందిన పెద్దగట్టు జాతరకు పోలీస్ శాఖ పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేపడుతోంది. నూతన జిల్లా ఏర్పాటు అనంతరం తొలిసారిగా ఈ నెల 12నుండి ఐదు రోజుల పాటు జరిగే జాతర సందర్భంగా ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఆధునీక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తోంది. కొత్తగా డ్రోన్ కెమోరాలు, సిసి కెమోరాలను ఏర్పాటుచేసి నిఘా, భద్రతను కట్టుదిట్టం చేస్తూ చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పి పరిమళ హనానూతన్ గత పక్షం రోజులుగా విస్తృత కసరత్తు చేపట్టి 1500మంది సిబ్బందిని జాతర బందోబస్తుకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఎస్పి పర్యవేక్షణలో ఏఎస్పి గంగారంతో పాటు 8మంది డిఎస్పిలు, 29మంది సిఐలు, 89మంది ఎస్‌ఐలు, 120మంది ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 500మంది కానిస్టేబుళ్లు, 200మంది హోంగార్డ్‌లు, 100మంది మహిళా పోలీస్‌ఫోర్స్, ఎనిమిది స్పెషల్ పార్టీ టీములు, 200మంది ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్ బలగాలను జాతర బందోబస్తుకు నియమించారు. అంతే కాకుండా జాతరలో మహిళలపై పోకిరీల ఆగడాలను అరికట్టేందుకు ఐదు షీటీమ్‌లు, ఐదు స్నేహిత టీమ్‌లను ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. వీరితో పాటు జాతరలో అసాంఘీక కార్యకలాపాలు, మద్యం అమ్మకాలు, జేబు దొంగలను నివారించేందుకు పది మఫ్టి పార్టీలు, ఎనిమిది ఐడి పార్టీ టీమ్‌లను ఏర్పాటుచేశారు. జాతర ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు నాలుగు పోలీస్ కంట్రోల్ రూములు ఏర్పాటుచేస్తున్నారు. రెండు డ్రోన్ కెమోరాలు, 50సిసి కెమోరాలను గుట్ట పైభాగంలో, కింద భాగంలో ఏర్పాటుచేసి జాతర ప్రాంతాన్ని మొత్తం ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా చర్యలు చేపట్టారు. జాతర సందర్భంగా జాతీయ రహదారితో పాటు జాతర జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.