నల్గొండ

ఉద్యానవన రైతులకు చేయూతనివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఫిబ్రవరి 8: ఉద్యాన వన రైతులకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సక్రమంగా వారికి అందించేందుకు అధికార యంత్రాంగం చొరవ తీసుకోవాలని జడ్పీ చైర్మన్ ఎన్. బాలునాయక్ కోరారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన జడ్పీ రెండవ స్థాయి గ్రామీణాభివృద్ధి, నాల్గవ స్థాయి వైద్య వైద్యం స్థాయి సంఘాల సమావేశంలో ఆయన ఆయా శాఖల వారిగా జరిగిన పథకాలను సభ్యులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ప్రభుత్వం ఇటీవల సూక్ష్మసేద్యం పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు 33కోట్లు మంజూరు చేసినందునా సకాలంలో లబ్ధిదారులకు పథకాల లబ్ధిని అందించాలన్నారు. పండ్ల తోటల రైతులకు నాణ్యమైన మొక్కలు అందించపోవడంతో రైతులు నష్టపోతున్నారని ఈ దిశగా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు. తిరుపతి ఉద్యాన వన నర్సరీ నుండి మొక్కలు రైతులకు అందడం లేదన్నారు. వేసవిలో పనుల కొరత నేపధ్యంలో ఉపాధి హామీ పథకం పనులు పెంచాలని జడ్పీ చైర్మన్ సూచించారు. డంపింగ్ యార్డులు, అంగన్‌వాడీ, పంచాయతీ భవనాలు, పంచాయతీ రాజ్ రోడ్ల పనుల నిర్వాహణతో పనులు కల్పించాలన్నారు. గొర్రెల పంపిణీ పథకం యూనిట్లను లబ్ధిదారులకు సకాలంలో పంపిణీ జరిగేలా చూడాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది పనితీరుపై ఉన్నతాధికారులు తరుచు తనిఖీలు నిర్వహించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని జడ్పీటీసిలు కోరారు. పలు ఆరోగ్య కేంద్రాల్లో మందులు సైత కరువయ్యాయని సభ్యులు ఆరోపించారు. గ్రామాల్లో, రహదారుల వెంట విచ్చలవిడిగా బెల్ట్‌షాపులు నెలకొన్నాయని వాటిని పూర్తిగా మూసివేయించాలన్నారు. నాటుసారా తయారీ, విక్రయాలను అరికట్టిన తరహాలో బెల్ట్‌షాపులను కూడా మూసివేయించాలని సభ్యులు కోరారు. కల్తీ మద్యం అమ్మకాలపై అధికారులు తనిఖీలు జరుపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, కస్తూరిభా, గురుకుల పాఠశాలల్లో వసతులు మెరుగుపరిచి విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించడంలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. తరుచు పాఠశాలలను తనిఖీ చేయాలని తాము తనిఖీలకు వెళ్లిన సందర్భాల్లో గుర్తించి నివేధించిన సమస్యలపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జడ్పీటీసిలు డిమాండ్ చేశారు. ఈ సమావేశాల్లో జడ్పీ సిఈవో ఆర్.అంజయ్య, డిప్యూటీ సిఈవో మోహన్‌రావు, జడ్పీటిసిలు పరమేశ్వర్, తండు సైదులుతో పాటు స్థాయి సంఘాల సభ్యులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జిల్లా బిజెపి నేతలకు కేంద్ర నామినేటెడ్ పదవులు !
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, ఫిబ్రవరి 8: జిల్లా బిజెపి సీనియర్ నేతలు పలువురికి కేంద్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవులను కేటాయించింది. జాతీయ వ్యవసాయ విస్తరణ బోర్డు డైరక్టర్‌గా జిల్లాకు చెందిన కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూధన్‌రెడ్డిని నియమించారు. కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని బాల కార్మిక సలహా మండలి సభ్యులుగా సీనియర్ నేత రామోజి షణ్ముఖను, పాదూరి కరుణను నియమించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి, రైల్వేబోర్డు సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్‌లు వారిని ఘనంగా సన్మానించి తమ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీకి వారందించిన సేవలను అధిష్టానం గుర్తించి నామినేటెడ్ పదవులు కేటాయించడం హర్షనీయమన్నారు. ఆర్‌ఎస్‌ఎస్, ఎబివిపి, హిందువాహిని, బిజెపి, కిసాన్‌మోర్చాలలో పనిచేసిన గోలి, షణ్ముఖలు తమ కొత్త బాధ్యతలను కూడా విజయవంతంగా నిర్వహిస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. వారి నియామకంతో బిజెపిలో పనిచేసిన నాయకులకు తప్పక గుర్తింపు ఉంటుందని పార్టీ చాటిందన్నారు. కాగా తమ నియామకానికి సహకరించిన కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయకు, రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, జి.కిషన్‌రెడ్డిలకు గోలి, షణ్ముఖ, కరుణలు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రభుత్వ భూముల
పరిరక్షణకు కఠిన చర్యలు
* కలెక్టర్ అనితారామచంద్రన్
చౌటుప్పల్, ఫిబ్రవరి 8: ప్రభుత్వ భూములను కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ అన్నారు. ఆర్డీవో కార్యాలయాన్ని బుధవారం అకస్మికంగా సందర్శించారు. సాదాబైనామాలపై సమీక్ష చేశారు. దరఖాస్తులను పరిశీలించారు. సదాబైనామాలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అంతకు ముందు చౌటుప్పల్ అటవీశాఖ కార్యాలయంలో బుధవారం విలేఖరులతో మాట్లాడారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. సర్వేలు నిర్వహించి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. అక్రమ వెంచర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఎస్.సూరజ్‌కుమార్, తహశీల్దార్ షేక్‌అహ్మద్‌లు ఉన్నారు.
నకిలీ పాస్‌పుస్తకాల కేసులో
అదుపులో ఇద్దరు నిందితులు
నేరేడుచర్ల, ఫిబ్రవరి 8: మండలం చెల్లిపల్లి సిండికేట్ బ్యాంకులో నకిలి పాస్‌పుస్తకాలపై రుణాలు పొందిన సంఘటనలో ఇరువురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. పంట రుణాల్లో అసలు పట్టాదారులు బూడుగులతండాకు చెందిన గిరిజనులు, సిండికేట్ బ్యాంక్ మేనేజర్ రాజేశ్వర్ ఫిర్యాదుమేరకు నేరేడుచర్ల ఎస్‌ఐ బుధవారం విచారణ చేపట్టారు. ఈ నకిలి పాస్‌పుస్తకాల మయాజాలంలో త్రిపురారం మండలం అర్జాతండాకు చెందిన తుల్జానాయక్, దామరచర్ల మండలం రాళ్లవాగుతండాకు చెందిన వీరాసింగ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టారు. ఈబ్యాంకులో నకిలి పాస్‌పుస్తకాలపై ఆరుగురు రూ.8.72లక్షల పంట రుణాలు పొందగా మరో ముగ్గురు కూడా రుణాలు తీసుకోవడానికి ప్రయత్నించగా నకిలి పాస్ పుస్తకాల సంఘటన వెలుగులోకి రావడంతో ఆ రుణాల విడుదలను బ్యాంక్ అధికారులు నిలిపివేసినట్లు తెలిసింది.
నల్లగొండ టౌన్, ఫిబ్రవరి 8: వేసవిలో ఎదురయ్యే విద్యుత్ డిమాండ్‌తో పాటు సరఫరాలో తలెత్తే సమస్యల పట్ల విద్యుత్‌శాఖ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించి పనిచేయాలని టిఎస్‌పిసిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి సూచించారు. బుధవారం జరిగిని శాఖపరమైన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతు వేసవిలో లోవోల్జేజి సమస్యల నివారణకు లైన్ల లోపాలు వంటి వాటిని సవరించాలన్నారు. కొత్త సబ్ స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు వేగవంతం చేయాలన్నారు. గ్రామీణ, పట్టణ విద్యుధీకరణ పథకాల పనులు సత్వరమే పూర్తి చేయాలన్నారు. రైతులకు పెండింగ్‌లో ఉన్న కొత్త కనెక్షన్లను వెంటనే మంజూరు చేయాలన్నారు. కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లను వెంటనే 24గంటల్లో మరమ్మతు జరిపించి రైతులకు అందించాలన్నారు. బిల్లుల వసూళ్ల లక్ష్యాలను పూర్తి చేసి సంస్థ బలోపేతానికి, వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు సిబ్బంది కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్‌ఈ బిక్షపతి, వివిధ డివిజన్ల డిఈలు, ఏఈలు పాల్గొన్నారు.
వౌలిక వసతుల కల్పనకు నిధులు
ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎంపి గుత్తా
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, ఫిబ్రవరి 8: జిల్లా కేంద్ర ఆసుపత్రి అభివృద్ధికి వౌలిక వసతుల కల్పన, పరికరాల కొనుగోలుకు నిధులు మంజూరుకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ తీర్మానించిందని సభ్యులు, ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. అభివృద్ధి కమిటీ చైర్మన్, జడ్పీచైర్మన్ ఎన్. బాలునాయక్ అధ్యక్షతన జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశంలో వైస్ చైర్మన్ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌తో కలిసి గుత్తా ఆసుపత్రి వసతులను సమీక్షించారు. ఆసుపత్రిలో నూతనంగా నిర్మిస్తున్న 150పడకల మాతాశిశు చికిత్సాలయం భవన నిర్మాణ పనులను మార్చి నెలఖారుకల్లా పూర్తి చేయాలని, ఆసుపత్రి సామర్ధ్యాన్ని 150నుండి 250పడకల సామర్ధ్యంకు విస్తరించి నూతన భవానాన్ని సీఎం కెసిఆర్ చేతుల మీదుగా ఏప్రిల్‌లో ప్రారంభించాలని అభివృద్ధి కమిటీ నిర్ణయించిందన్నారు. జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు జరిపించాలని సీఎం కెసిఆర్‌ను కోరామని, ఇందుకు నల్లగొండ ఎస్‌ఎల్‌బిసి, మహాత్మగాంధీ యూనివర్సిటీల స్థలాలను గుర్తించామన్నారు. మెడికల్ కళాశాల మంజూరైతే ఆసుపత్రి అభివృద్ధి మరింత జరుగుతుందన్నారు. ఆసుపత్రికి అవసరమైన ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్‌తో పాటు మార్చురీ మరమ్మతులు, అదనపు గదుల నిర్మాణాలకు, ఆసుపత్రిలో చోరీల నివారణ దిశగా సిసి కెమెరాల ఏర్పాటుకు అభివృద్ధి కమిటీ నిధుల మంజూరుకు ఆమోదించిందన్నారు. వంటశాలను 400మంది వంట చేసుకునేలా విస్తర్తించాలని, పార్కింగ్ స్థలం, ఆసుపత్రి ఆవరణలో పచ్చిక ఏర్పాటు, పారిశుద్ధ్యం చర్యలకు, అంబులెన్స్‌ల మరమ్మతులు, స్టేషనరీ, ప్రింటింగ్ సామాగ్రి, జెరాక్స్ మిషన్ ఏర్పాటుకు నిధులను, 15మంది అదనపు సెక్యూర్టీ గార్డులను నియమించుకునేందుకు అనుమతించినట్లుగా తెలిపారు. అంతకుముందు ఆసుపత్రిలోని వివిధ వార్డులను, పరిసరాలను తనిఖీ చేసి సమస్యలను పరిశీలించారు. సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మి, సూపరిండెంట్ నర్సింగ్‌రావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, వైద్యులు పాల్గొన్నారు.

రాచకొండలో ఇక అంతా అభివృద్ధే..
మంత్రి జగదీశ్ రెడ్డి
సంస్థాన్‌నారాయణపురం, ఫిబ్రవరి 8: చారిత్రాత్మకమైన రాచకొండ ప్రాంతం ఇక శరవేగంగా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర విద్యుత్‌శాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. రాచకొండ కమిషనరేట్ కమిషనర్ మహేశ్ ఎం. భగవత్ రాచకొండ రామాలయం వద్ద బుధవారం భారీ ఎత్తున ఏర్పాటు చేసిన ఉచిత మెగా హెల్త్‌క్యాంపును మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు. అక్కడే చౌటుప్పల్ ఏసీపీ హ్నేహిత అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి రాచకొండను గతంలోనే పరిశీలించామన్నారు. ఈప్రాంతం అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధను కనబర్చినారని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న అన్ని పథకాలను ప్రజలకు అందించేందుక క్రిందిస్థాయి అధికారులు కృషిచేయాలని సూచించారు. రాచకొండలోని అన్ని గిరిజనతండాలకు సంస్థాన్‌నారాయణపురం మండలం నుంచి, ఇటు రంగారెడ్డి జిల్లా నుంచి డబుల్ రోడ్లను మంజూరు చేయిస్తానని తెలిపారు. ముందుగా ఇక్కడి రామాలయం వరకు రోడ్డును నెలరోజుల్లో పూర్తిచేయిస్తానని హామీనిచ్చారు. ఎన్నో ఏళ్ళుగా ఇక్కడి ప్రజలు సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు ఇచ్చి శాశ్విత పరిష్కారం చూపిస్తామని తెలిపారు. ఇక్కడి రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించడానికి కృషిచేస్తానన్నారు. రాచకొండ కమిషనర్ భగవత్ ఇక్కడి ప్రజలకోసం ఏర్పాటు చేసిన మెగా హెల్త్‌క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్యాన్సర్‌ను ముందుగా గుర్తించే యంత్రాలను తెప్పించి వైద్యం అందించడం మంచి పరిణామమన్నారు. ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిలు మాట్లాడుతూ రాచకొండ హైదరాబాద్‌కు అతి దగ్గరలో ఉన్నా అభివృద్ధికి నోచుకోలేదన్నారు. రాచకొండను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని, ఇక్కడి ప్రజలకు ఉపాది, ఉద్యోగావకాశాలు కల్పించాలని మంత్రిని కోరారు. పురాతనమైన రామాలయం స్థానంలో నూతన దేవాలయాన్ని నిర్మించాలని కోరారు. ఇక్కడ భూమిలో లభ్యమైన భారీ శివలింగం కోసం నూతనంగా శివాలయాన్ని నిర్మించాలని సూచించారు. రాచకొండకు రంగారెడ్డి జిల్లా నుంచి విద్యుత్‌ను అందిస్తున్నారని, ఏమైనా పనులు కావాల్సి వస్తే మాత్రం యాదాద్రి జిల్లా నుంచి విద్యుత్ సిబ్బంది రావాల్సి వస్తుందన్నారు. కరెంటుకు శాశ్వితంగా పరిష్కారం చూపించాలని కోరారు. రాచకొండ కమిషనరేట్ కమిషనర్ సిపి భగవత్ మాట్లాడుతూ తమ కమిషనరేట్‌కు రాచకొండ పేరును పెట్టినందుకు రాచకొండను పోలీస్‌శాఖ దత్తత తీసుకుంటుందన్నారు. ఇక్కడి యువతకు ఉపాధి, ఉద్యోగాలను కల్పించడానికి కృషిచేస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛ రాచకొండగా మార్చడానికి అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, డీసీపీలు యాదగిరి, ఇక్బాల్, మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఇన్‌చార్జి పాల్వాయి శ్రవంతి, ఆర్‌డీవో సూరజ్‌కుమార్, తహశీల్దార్‌లు శ్రీనివాస్‌కుమార్, షేక్ అహ్మద్, ఎంపీడీవో సరస్వతి, సిఐ నవీన్‌కుమార్, ఎస్‌ఐ మల్లీశ్వరి, రాచకొండ సర్పంచ్ సాగర్‌నాయక్, తిప్పాయిగూడెం సర్పంచ్ మంగమ్మ, సాయిసంజీవిని, కామినేని, నేత్రాలయ ఆసుపత్రుల వైద్యులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

పెద్దగట్టు జాతరను విజయవంతం చేయాలి
కలెక్టర్ సురేంద్రమోహన్

సూర్యాపేట, ఫిబ్రవరి 8: తెలంగాణలో అతిపెద్ద జాతరగా పేరొందిన దురాజ్‌పల్లి పెద్దగట్టు జాతరను విజయవంతం చేసేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సురేంద్రమోహన్ కోరారు. బుధవారం కలెక్టరేట్‌లో పాయింట్ కంట్రోలింగ్ ఇంచార్జ్‌లతో సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ జిల్లా ఏర్పాటు అనంతరం తొలిసారిగా జరుగుతున్న జాతరను విజయవంతం చేసి జిల్లా యంత్రాంగం ప్రతిష్టను ఇనుమడింపజేయాలని సూచించారు. ప్రధాన రహదారినుండి దేవాలయం వరకు ప్రతిరోజు నీళ్లు చల్లి దుమ్ము లేవకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జాతరకు వచ్చే మంది భక్తులకు తాగునీటిని ఏర్పాటుచేయాలని జిల్లా పంచాయితీ, గ్రామీణ నీటి సరఫరా అధికారులను ఆదేశించారు. ఇందుకోసం జిల్లాకేంద్రంలోని మినరల్ వాటర్ ప్లాంట్‌ల యాజమానులతో సంప్రదించి రోజుకు మూడు విడతలుగా 15ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. జాతరలో పారిశుధ్యాన్ని మెరుగుపరుస్తూ అంటువ్యాధులు ప్రభలకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఎప్పటికప్పుడు వ్యర్ధాలను తొలగించాలని కోరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటుచేయాలని పోలీస్ అధికారులను కోరారు. జాతరను సజావుగా నిర్వహించేందకు 90మంది ఫ్రోటోకాల్ అధికారులను నియమించి మూడు విడుతలుగా విధులు నిర్వహించేలా ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. జాతర జరుగుతున్న రోజుల్లో విద్యుత్ సరఫరా ఎలాంటి అంతరాయం కలగకుండా శ్రద్ధ వహించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీవో మోహన్‌రావు, డిఎస్పి సునీతామోహన్, జిల్లా పంచాయితీ అధికారి రాంమోహన్‌రాజు, దురాజ్‌పల్లి సర్పంచ్ అంబాలి తదితరులు పాల్గొన్నారు.