నల్గొండ

మన ఎమ్మెల్యేలు మహా పిసినారులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఫిబ్రవరి 9: శాసన సభ్యుల కోటా(సిడిపి) నిధుల ఖర్చులో జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆర్థిక సంవత్సరాల ప్రామాణికతకు అనుగుణంగా గడువులోగా ఏడాది కోటా నిధులను ఖర్చు చేయడంలో పిసినారులను తలపిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు 12మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు, ఇద్దరు లోక్‌సభ సభ్యులు, ఒక రాజ్య సభ సభ్యులున్నారు. జిల్లాల విభజన క్రమంలో నూతన నల్లగొండ జిల్లా పరిధిలో ఆరుగురు ఎమ్మెల్యేలతో పాటు ఎంపిలు, ఎమ్మెల్సీలు చేసిన సిడిపి నిధుల ఖర్చును పరిశీలిస్తే మెజార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సిడిపి నిధుల్లో సగం కూడా ఖర్చు చేయలేకపోవడం విడ్డూరం. దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్.్భస్కర్‌రావు, మునుగోడు ఎమ్మెల్యే కె.ప్రభాకర్‌రెడ్డి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జానారెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలకు 2014-15నుండి 2016-17వరకు మంజూరైన 36కోట్లకుగాను 14కోట్ల 19లక్షల 45వేలు మాత్రమే ఖర్చు చేశారు. ఆరుగురు ఎమ్మెల్యేలకు 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఎమ్మెల్యే కోటా సిడిపి నిధులు కోటిన్నర చొప్పున 9కోట్లు మంజూరయ్యాయి. 450పనులను 8కోట్ల 45లక్షలతో మంజూరు చేయగా 385పనులు పూర్తి కాగా 6కోట్ల 86లక్షలు ఖర్చు చేశారు. 64పనులు ప్రారంభకాకపోగా ఒకటి పురోగతిలో ఉంది. 2015-16లో సైతం ఆరుగురి ఎమ్మెల్యేలకు 9కోట్ల సిడిపి నిధులు మంజూరయ్యాయి. 530పనులను 7కోట్ల 97లక్షలతో మంజూరు చేయగా 340పనులను పూర్తి చేసి 4కోట్ల 67లక్షల 55వేలు ఖర్చు చేశారు. 190పనులు ప్రారంభకాకపోగా ఒకటి పురోగతిలో ఉంది. 2016-17లో పెరిగిన సిడిఎఫ్ కోటా నిధుల మేరకు ఒక్కో ఎమ్మెల్యేకు 3కోట్ల చొప్పున 18కోట్లు మంజూరుకాగా ఫిబ్రవరి 1నాటికి 414పనులను 8కోట్ల 13లక్షలతో మంజూరు చేశారు. వీటిలో 271పనులు ప్రాంరభంకాలేదు. 143పనులు పూర్తవ్వగా 1కోటి 93లక్షలు ఖర్చయ్యాయి.
ఖర్చులో కోమటిరెడ్డి టాప్ !
ఎమ్మెల్యే కోటా సిడిపి నిధుల ఖర్చులో నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముందున్నారు. కోమటిరెడ్డికి మూడేళ్లలో 6కోట్ల సిడిపి నిధులు మంజూరుకాగా 3కోట్ల 74లక్షల 75వేలు ఖర్చు చేశారు. రమావత్ రవీంద్రకుమార్ తన 6కోట్ల నిధుల్లో మూడేళ్లలో 2కోట్ల 55లక్షల 9వేలు ఖర్చు చేశారు. వేముల వీరేశం తన కోటా ఆరుకోట్లలో 2కోట్ల 20లక్షల 53వేలు ఖర్చు చేశారు. కుందూరు జానారెడ్డి తన ఆరుకోట్ల నిధుల్లో తొలి రెండేళ్ల మూడు కోట్లలో 1కోటి 43లక్షలు ఖర్చు చేశారు. మూడో ఏడాది రూపాయి కూడా ఖర్చు కాలేదు. 20పనులకు 82లక్షల 50వేలు మంజూరు చేశారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆరుకోట్ల నిధుల్లో 3కోట్ల 29లక్షలు ఖర్చు చేశారు. ఎన్.్భస్కర్‌రావు తన కోటా నిధులు ఆరుకోట్లలో 2014-15లో 78లక్షలు, 2015-16లో 20లక్షలతో కలిపి 97లక్షల 5వేలు మాత్రమే ఖర్చు చేశారు. మూడో ఏడాది కోటా మూడు కోట్ల నిధులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. కేవలం మూడు పనులకు 13లక్షలను మంజూరు చేశాడు.
ఎమ్మెల్సీల్లో పూల మేటి!
జిల్లా పరిధిలోని ఎమ్మెల్సీల్లో పూల రవిందర్‌కు మూడేళ్లలో కలిపి ఐదుకోట్లు మంజూరవ్వగా 3కోట్ల 83లక్షలు ఖర్చు చేశారు. నేతి విద్యాసాగర్‌కు సంబంధించి అందుబాటులో ఉన్న లెక్కల మేరకు 2014-15లో కోటిన్నర నిధుల్లో 1కోటి 25లక్షలు ఖర్చు చేశారు. కర్నే ప్రభాకర్ సైతం తన కోటిన్నర నిధుల్లో 1కోటి ఐదులక్షలు ఖర్చు చేశారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోటా 2015-16లో కోటిన్నర నిధులకు 51లక్ష, 2016-17నిధుల్లో మూడుకోట్లకు 41లక్షలు ఖర్చు చేయగా మొత్తం నాలుగున్నర కోట్లలో ఇప్పటిదాకా 92లక్షలు ఖర్చు చేశారు. ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి 2016-17లో మూడుకోట్లు మంజూరుకాగా 1కోటి 30లక్షలు ఖర్చు చేశారు.
ఎంపి కోటా నిధుల ఖర్చులో అదే తీరు
పార్లమెంటు సభ్యుల కోటా కింద ఏడాదికి 5కోట్లు మంజూరవుతున్నాయి. నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి 2014-15నుండి 2016-17వరకు 15కోట్ల ఎంపి కోటా నిధుల నుండి 578పనులను 15కోట్ల 81లక్షలతో మంజూరు చేశారు. వాటిలో 490పనులు పూర్తికాగా మూడు పురోగతిలో ఉండగా 85పనులు ప్రారంభంకాలేదు. 12కోట్ల 44లక్షలు ఖర్చు చేశారు. భువనగిరి ఎంపి బూర నర్సయ్యగౌడ్ తొలి రెండేళ్లలో 10కోట్ల నిధుల నుండి 229పనులను 8కోట్ల 19లక్షలతో మంజూరు చేయగా 107పనులు పూర్తవ్వగా మూడు పురోగతిలో ఉండగా 119ప్రారంభంకాలేదు. మొత్తం 3కోట్ల 94లక్షలు ఖర్చు చేశారు. మూడో ఏడాది ఎంపి కోటా నిధులు లెక్కలు తెలియాల్సివుంది. రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి 2012నుండి 2016-17వరకు 25కోట్లకుగాను 970పనులను 24కోట్ల 35లక్షలతో మంజూరు చేయగా 893పనులు పూర్తికాగా 61పనులు ప్రారంభంకాలేదు. 16పనులు పురోగతిలో ఉన్నాయి. మొత్తం ఇప్పటిదాకా 22కోట్ల 26లక్షల 41వేల రూపాయలు ఖర్చు చేయడం విశేషం.
హరిత సంకల్పం
* గ్రీన్‌డేకు కలెక్టర్ శ్రీకారం
* నేటి నుంచి జిల్లాలో ప్రారంభం
సూర్యాపేట, ఫిబ్రవరి 9: నూతనంగా ఆవిర్భావించిన సూర్యాపేట జిల్లాలో వినూత్న తరహా కార్యక్రమాలను అమలుచేస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రశంసలు అందుకున్న జిల్లా కలెక్టర్ సురేంద్రమోహన్ మరో విభిన్న కార్యక్రమానికి అంకురార్పణ చేయనున్నారు. ముఖ్యమంత్రి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న హరితహార కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ‘గ్రీన్‌డే’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఇక నుండి ప్రతి శుక్రవారం గ్రీన్‌డేను నిర్వహించి జిల్లావ్యాప్తంగా నాటిన మొక్కలను సంరక్షించేలా చర్యలు చేపట్టారు. అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలను భాగస్వామ్యం చేసి నాటిన ప్రతి మొక్కను బతికించేలా కార్యక్రమానికి రూపకల్పన చేశారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి శుక్రవారం ఉదయం 9గంటల నుండి 10.30గంటల వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, రహదారులు, ఇళ్ల ముందు నాటిన మొక్కల వద్ద పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలిగించి కంచెను పటిష్టపర్చి మొక్కలకు నీళ్లు అందిస్తారు. ప్రజాప్రతినిధులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయనున్నారు. గ్రీన్‌డేను అన్ని చోట్ల అమలుచేసేలా పర్యవేక్షించేందుకు ఆకస్మిక తనిఖీలు చేపడుతానని చెప్పారు.
పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి
కలెక్టర్ గౌరవ్ ఉప్పల్

నల్లగొండ, ఫిబ్రవరి 9: పది పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. గురువారం సెయింట్ అల్ఫానస్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమగ్ర మూల్యాంకన అమలుపై ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులకు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతు పది ఫలితాల లక్ష్యాలను నిర్ధేశించుకుని సాధనకు కృషి చేయాలన్నారు. గత ఏడాది 84శాతంతో జిల్లా ఏడవ స్థానంలో ఉందని ఈ దఫా 95శాతం సాధించేందుకు కృషి చేయాలన్నారు. ప్రత్యేక తరగతులు, వౌలిక వసతుల కల్పనతో విద్యార్థులను ప్రొత్సహించాలన్నారు. మధ్యాహ్న భోజనం సక్రమంగా అందించాలన్నారు. సీఎం కెసిఆర్ విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తు నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. 101పాఠశాలల్లో మరమ్మతులకు మంజురైన నిధులతో పాటు కలెక్టర్ నిధుల నుండి 30లక్షలతో ఆర్‌వో ఫ్లాంట్ల నిర్మాణాలను జరిపిస్తున్నామన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి డిఈవో చంద్రమోహన్ మాట్లాడుతు పది పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధన దిశగా వారం వారం సన్నాహాక పరీక్షలు నిర్వహించి వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. మార్చి 1నుండి వార్షిక పరీక్షలు నిర్వహిస్తారని, ఏప్రిల్ 21 నుండి వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభమవుతుందన్నారు. ఈ సంవత్సరం పది పరీక్షలకు 21,300మంది విద్యార్థులు హాజరవుతారని 100పరీక్ష కేంద్రాలు ఏంపిక చేశామన్నారు. సామాజిక బాధ్యత కింద వివిధ కంపనీల ఆర్ధిక సహాయంతో పాఠశాలల్లో వౌలిక వసతులు కల్పించిన దామరచర్ల, మిర్యాలగూడ, తిప్పర్తి, కేతెపల్లి, వేములపల్లిల ఎంఈవోలను శాలువలతో కలెక్టర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
ఆడపిల్లల రక్షణకు చర్యలు
* ప్రభుత్వ విప్ సునితామహేందర్ రెడ్డి
ఆలేరు, ఫిబ్రవరి 9: సమాజంలో ఆడపిల్లల రక్షణకోసం ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వవిప్ సునితామహేందర్ రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక దొంతిరి సోమిరెడ్డి ఫంక్షన్ హాలులో మండల స్థాయి బాలికలకు కరాటెలో సామూహిక శిక్షణను ఆమె ప్రారంభించి మాట్లాడుతూ ప్రభుత్వం షీటీమ్‌లను ఏర్పాటుచేసి ఆకతాయిల ఆకృత్యాలను ఎక్కడికక్కడ అడ్డుకుంటుందన్నారు. మహిళలు, అమ్మాయిలు, స్వీయరక్షణ చర్యల్లో ప్రావీణ్యం సంపాదించి అత్యవసర సమయాల్లో తమను తాము కాపాడుకోవాలని సూచించారు. ప్రభుత్వ పరంగా ప్రతి మండలంలోను స్వీయ రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఫిజికల్ ట్రైనర్ ఎన్.లక్ష్మీ, ఎంపిపి అనసూయ, జెడ్పిటిసి పరమేశ్వర్, మార్కెట్ చైర్మన్ సుమలత, టీ ఆర్ ఎస్ మోహన్‌రావు, కృష్ణయ్య, మురళీ, రాం ప్రసాద్, మధు, సోమిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

పునరావాస కేంద్రాల్లో
సౌకర్యాలు కల్పిస్తాం
* కలెక్టర్ సురేంద్రమోహన్
మేళ్లచెర్వు, ఫిబ్రవరి 9: పులిచింతల ముంపు గ్రామాల పునరావాస కేంద్రాల్లోని ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని జిల్లా కలెక్టర్ సురేంద్రమోహన్ అన్నారు. మండలపరిధిలోని వెల్లటూరు ముంపు గ్రామ పునరావాస కేంద్రాన్ని గురువారం కలెక్టర్ సందర్శించారు. పునరావాస కేంద్రాల్లోని వౌలిక వసతుల నాణ్యత లోపంపై అధికారులపై కలెక్టర్ మండిపడ్డారు. డ్రైనేజి నిర్మాణం వాడక ముందే కూలిపోవడం, విద్యుత్, మంచినీరు తదితర అంశాలపై ఆరా తీశారు. నాణ్యత లోపించడంపై తనకు నివేదిక ఇవ్వాలని అప్పటి అధికారులపై కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వెల్లటూరు ప్రజలు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. మంచినీటి కొరత తీవ్రంగా ఉందని ఈ వేసవిలో మరింత తీవ్రంగా ఉంటుందని ప్రజలు కలెక్టర్‌కు తెలిపారు. విద్యుత్‌కు సంబంధించి ఆన్ ఆఫ్ స్విచ్‌ల కోసం రూ. 4లక్షలు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. వెల్లటూరు రెండవ పునరావాస కేంద్ర ఏర్పాటుపై కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. నాణ్యత లోపించకుండా పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రేబల్లె రెండవ పునరావాస కేంద్రంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఆయన వెంట జెసి సంజీవరెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్, పంచాయితీరాజ్, ఆర్‌అండ్‌బీ అధికారులు పాల్గొన్నారు.
ఫార్మా కంపెనీలో షార్ట్‌సర్క్యూట్
తుర్కపల్లి, ఫిబ్రవరి 9: మండలంలోని పల్లెపహాడ్ గ్రామంలోని వేద్‌గిరి ఫార్మా కంపెనీలో బుధవారం రాత్రి షార్ట్‌సర్కూట్‌కు గురైంది. భారీగా మంటలు చెలరేగి సుమారు కోటి రూపాయల విలువైన ఆస్థి నష్టం జరిగింది. కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు భయాందోళనలకు గురై పరుగులు తీశారు. వివరాలలోకి వెళ్తే గ్రామంలోని వేద్‌గిరి ఫార్మా కంపెనీలో సోడియం నైట్రేట్, సోడియం సల్ఫేట్, పొటాషియం సల్ఫేట్ ముడిసరుకులతో ప్రోడక్ట్ తయారు చేసి హైదరాబాద్‌కి ఎగుమతి చేస్తారు. రోజువారి మాదిరిగానే కంపెనీలోని 2వ ఫ్లాట్‌లో బుధవారం రాత్రి 11 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలోనే మొదటి బ్లాక్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ఆ బ్లాక్‌లో ఉన్న డీజిల్, కెమికల్ డ్రమ్ములు అంటుకొని మంటలు తీవ్ర స్థాయిలో ఎగిసిపడ్డాయి. వెంటనే ఈ సంఘటన పై భువనగిరి ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించడంతో అక్కడి చేరుకున్న ఫైర్ సిబ్బందిని అతి కష్టంమీద మంటలను పూర్తిగా ఆర్పేశారు. ఈ సంఘటన స్థలాన్ని యాదాద్రి-్భవనగిరి జిల్లా డిసిపి పాలకుర్తి యాదగిరి సందర్శించారు. సంఘటన పై కంపెనీ ఎండిని విషయాలు అడిగి తెలుసుకున్నారు.
మత రిజర్వేషన్ల పేరుతో రాజకీయాలు
బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి పాదూరి కరుణ
మిర్యాలగూడ, ఫిబ్రవరి 9: ముఖ్యమంత్రి కెసిఆర్ మతపరమైన రిజర్వేషన్ల పేరుతో ఓట్ల రాజకీయాలకు పాల్పడుతుందని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి పాదూరి కరుణ అన్నారు. బిజెపి పట్టణశాఖ ఆధ్వర్యంలో విజేత కళాశాల సెంటర్‌లో మతపరమైన రిజర్వేషన్లను వ్యితిరేకిస్తూ గురువారం సంతకాల సేకరణ నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధమైన మత రిజర్వేషన్లను కెసిఆర్ ప్రభుత్వం ప్రకటించడం సరైందికాదని ఆమె అన్నారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని ఆమె అన్నారు. మతపరమైన రిజర్వేషన్ల వల్ల పేదప్రజలకు అన్యాయం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మతపరమైన రిజర్వేషన్ల ఆలోచనను వెంటనే విరమించుకోవాలని ఆమె అన్నారు. దేశ సమైక్యతకు మత రిజర్వేషన్లు విఘాతమని ఆమె పేర్కొన్నారు. మతపరమైన రిజర్వేషన్ల అంశంపై న్యాయస్థానంలో తీర్పు వెలువడకముందే ఓటు బ్యాంక్ రాజకీయాలకు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతుందని ఆమె ఆరోపించారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ హామి ఇవ్వడం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమని ఆమె అన్నారు. 4శాతం రిజర్వేషన్లు కల్పించే సమయంలో న్యాయస్థానం రిజర్వేషన్‌ను కొట్టివేసిందని ఆమె అన్నారు. మతపరమైన రిజర్వేషన్లను అన్నివర్గాల ప్రజలు వ్యతిరేకించాలని, దీనిని ఎత్తివేసే వరకు బిజెపి పోరాడుతుందని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బంటు సైదులు, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రేపాల పురుషోత్తంరెడ్డి, జొన్నలగడ్డ కర్నాకర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు చిలుకూరి శ్యాం, బిజెవైఎం పట్టణ అధ్యక్షులు బంటు గిరి, నాయకులు శివశంకర్, ఆదినారాయణ, పోరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, అశోక్, నగేశ్, రవిబాబు, రాకేశ్, కోటిరెడ్డి, సాయి, హన్మంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాల్లో
విద్యార్థుల భాగస్వామ్యం
* కలెక్టర్ గౌరవ్ ఉప్పల్

నల్లగొండ, ఫిబ్రవరి 9: ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు పర్యవేక్షణలో మహాత్మగాంధీ అధ్యాపకులను, విద్యార్థులను భాగస్వామ్యం చేస్తామని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. గురువారం యూనివర్సిటీలో అధ్యాపకులు, విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతు ఆడపిల్లల అమ్మకాలు, బ్రూణ హత్యలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, పింఛన్లు, ఉపాధి హామీ పనులు, నగదు రహిత లావాదేవిల నిర్వాహణపై ప్రజల్లో అవగాహాన కల్పించేందుకు విద్యార్థుల సేవలు వినియోగిస్తామన్నారు. పర్యాటక కేంద్రాల గుర్తింపు, దేవాలయాల వసతుల కల్పన, ఫ్లోరైడ్ నివారణ కార్యక్రమాల్లో, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల తీరు సర్వేలపై విద్యార్థులను భాగస్వామ్యం చేస్తామన్నారు. జిల్లా యంత్రాంగం మరోసారి విద్యార్థులు, అధ్యాపకులతో సమావేశమై సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో, అధ్యాపకులు, విద్యార్థులతో కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఎంజి యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ అల్త్ఫా హుస్సెన్ మాట్లాడుతు యూనివర్సిటీలోని వివిధ కోర్సుల విద్యార్థులు సంబంధిత ప్రనుత్వ శాఖల కార్యక్రమాల అమలులో భాగస్వామ్యమవుతారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేపట్టిన పలు కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా అధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి, అల్వాల రవి, డిఎఫ్‌వో శాంతారాం, డిఆర్‌డివో అంజయ్య, రిజిస్ట్రార్ ఉమేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తెదేపా అధికారంలోకి రావడం ఖాయం
* తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కంచర్ల భూపాల్ రెడ్డి
చిట్యాల, ఫిబ్రవరి 9: గ్రామాలు మరింతగా అభివృద్ధి చెందేటందుకు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ఆపార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. మండలంలోని వెలిమినేడు గ్రామంలో గురువారం పార్టీ క్రియాశీల సభ్యుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి పార్టీ రాష్ట్ర నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డితో కలిసి భూపాల్‌రెడ్డి హాజరై మాట్లాడారు. గ్రామాల్లో తెదేపాకు ఆదరణ తరగలేదని తెదేపా ప్రభుత్వంలో గ్రామాలాభివృద్ధి ఎంతగానో జరిగిందని రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో తెదేపా ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని గ్రామాలు మరింతగా అభివృద్ధి జరుగుతాయన్నారు. తెలంగాణరాష్ట్రంలో మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం ప్రజాసమస్యలను విస్మరిస్తుందని ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుండుతుందన్నారు. సమస్యలను పట్టించుకోకుండా ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న తెరాస ప్రభుత్వంపై తెదేపా కార్యకర్తలు నాయకులు ప్రజలతో కలిసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
తెదేపా రాష్ట్ర నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఇంటింటికి నాయకులు కార్యకర్తలు తిరుగుతూ ప్రజల్లోకి తీసుకెళ్ళి విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉండుందని వచ్చే ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, గ్రామగ్రామాన పార్టీని మరింతగా బలోపేతం చేయాలని సూచించారు. సమావేశంలో ఉడుగు వెంకటేశం, పొన్నం లక్ష్మయ్య, తోకల నరేందర్‌రెడ్డి, ఏనుగు రఘుమారెడ్డి, జినుకుల లింగస్వామి, అంతటి నర్సింహ, పైళ్ళ నర్సిరెడ్డి, మేడి శేఖర్, దేవిరెడ్డి సుధాకర్‌రెడ్డి, లొడె చిరంజీవి, బల్గూరి యాదయయ, చిన్నం భిక్షం తుమ్మల నాగరాజురెడ్డి, చిన్నం శ్రీను, అభిలాష్‌రెడ్డి, రామకృష్ణ, సురేష్, భాను, నవీన్‌రెడ్డి, బాలకృష్ణ, సందీప్‌రెడ్డి, ముత్యాలు, భరత్ తదితరులు పాల్గొన్నారు.