నల్గొండ

ఏయిమ్స్ ప్రకటన పట్ల హర్షం : ఎంపి బూర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీబీనగర్, ఫిబ్రవరి 10: ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి వల్లనే తెలంగాణ రాష్టన్రికి ఏయిమ్స్ వచ్చిందని భువనగిరి ఎంపి బూర నర్సయ్యగౌడ్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం భువనగిరిలోని రహదారి బంగ్లాలో పార్టీ కార్యకర్తలతో విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపి బూర మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో బీబీనగర్‌లో ఏయిమ్స్‌ను ఏర్పాటు ఉద్యమాలు నిర్వహించామని ఉద్యమాలతోనే నేడు ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణకు ఏయిమ్స్‌ను మంజూరు చేశారన్నారు. వెంటనే ఈబడ్జెట్‌లో నిధులు కేటాయించి పనులు ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం నిమ్స్ వద్ద 160 ఎకరాల స్థలం ఉందని ఏయిమ్స్‌కు అదనంగా 40 ఏకరాలు సేకరించి ఏయిమ్స్‌ను ఏర్పాటు చేసేందుకై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో టిఆర్‌ఎస్ క్రమశిక్షణ సంఘం ఉపాధ్యక్షుడు ఏలిమినేటి కృష్ణారెడ్డి, టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు జడల అమరేందర్, భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ పంతులు నాయక్, కొల్పుల అమరేందర్, పిట్టల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు తాగుసాగునీరివ్వాలి
* మంత్రి హరీష్‌రావుకు కోమటిరెడ్డి వినతి

నల్లగొండ, ఫిబ్రవరి 10: నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు ఏఎమ్మార్పీ, సాగర్ ఎడమకాలువల ద్వారా తాగుసాగు నీరివ్వాలని సిఎల్పీ ఉపనేత, నల్లగొండ శాసన సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి టి.హరీష్‌రావును కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతు వారం రోజుల్లోగా రెండు జిల్లాలకు తాగుసాగునీటిని విడుదల చేయని పక్షంలో భారీ జనసమీకరణతో ఇందిరాపార్కు వద్ద ఒక రోజు దీక్ష చేపట్టనున్నట్లుగా ప్రకటించారు. ప్రభుత్వం వెంటనే రెండు జిల్లాల ప్రజలకు తాగుసాగునీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు. కోమటిరెడ్డి వెంట డిసిసిబి డైరక్టర్ పాశం సంపత్‌రెడ్డి, కనగల్ జడ్పీటీసి శ్రీనివాస్ ఉన్నారు.